ప్రధాన మంత్రి కార్యాలయం
'2047 నాటికి అందరికీ బీమా' లక్ష్యంతో ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తాం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 SEP 2025 8:55PM by PIB Hyderabad
అందరికీ ఆర్థిక భద్రత, ఆరోగ్య సేవలను అందించడం ప్రభుత్వ నిబద్ధతలో ఒక ప్రధాన అంశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలలో జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు ఇచ్చిన గణనీయమైన పన్ను రాయితీలు ప్రతి పౌరుడికి వాటిని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తెస్తాయి.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర భరింద్వాల్ చేసిన ఒక పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ, “ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా కొన్నేళ్లుగా మేం కృషి చేస్తున్నాం. జీవిత, ఆరోగ్య బీమాను మరింత చౌకగా అందించే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ‘2047 నాటికి అందరికీ బీమా' అనే మా లక్ష్యంలో మరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయి. అందరం కలిసి స్వస్థ్, సమర్థ భారత్ వైపు అడుగులు వేద్దాం” అని పేర్కొన్నారు.
#NextGenGST”
(रिलीज़ आईडी: 2164309)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Assamese
,
Bengali
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada