ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ - సింగపూర్ సంయుక్త ప్రకటన

Posted On: 04 SEP 2025 8:04PM by PIB Hyderabad

గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:

1. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ 2025 సెప్టెంబరు నుంచి వరకు భారత్‌లో అధికారికంగా పర్యటించారు.

2. 2025 సెప్టెంబరు 4న ప్రధానమంత్రులిద్దరూ విస్తృత స్థాయిలో చర్చించారుఅనంతరం నాయకులిద్దరూ వివిధ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారుమోదీ ఇచ్చిన విందుకు వాంగ్ హాజరయ్యారుగౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కూడా ఆయన కలిశారుసింగపూర్ ప్రధానమంత్రి వాంగ్ రాజ్‌ఘాట్‌ను కూడా సందర్శించి మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారుభారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్జైశంకర్ కూడా వాంగ్‌ను కలిశారు.

3. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తవుతాయిభారత్సింగపూర్ మధ్య నమ్మకంపరస్పర గౌరవంఅనేక రంగాల్లో విస్తృత సహకారం ప్రాతిపదికలుగా సుదీర్ఘ స్నేహ సంప్రదాయం నెలకొని ఉన్నదని ప్రధానులిద్దరూ అంగీకరించారు. 2024 సెప్టెంబరులో సింగపూర్‌లో భారత ప్రధానమంత్రి మోదీ అధికారిక పర్యటన, 2025 జనవరిలో భారత్‌లో గౌరవ సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం అధికారిక పర్యటన, 2025 ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన మూడో భారత్-సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశాల వంటి ఇటీవలి ఉన్నత స్థాయి కార్యక్రమాలు సహా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారు సమీక్షించిసంతృప్తి వ్యక్తం చేశారురాజకీయఆర్థికభద్రతసాంకేతికతవిద్యప్రజాసాంస్కృతిక రంగాలు సహా సమగ్ర సహకారంగా ఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి.

4. 2024 సెప్టెంబరులో సింగపూర్‌లో భారత ప్రధానమంత్రి మోదీ అధికారిక పర్యటన సందర్భంగా.. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్పీ)గా మలచుకునే దిశగా ఒప్పందాన్ని ప్రధానులిద్దరూ గుర్తు చేసుకున్నారుద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దశాదిశలను నిర్దేశించేలాఎనిమిది రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేలా.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునివాస్తవిక ప్రణాళికను రూపొందించిస్వీకరించేందుకు వారు అంగీకరించారుఆ ఎనిమిది రంగాలు: (i) ఆర్థిక సహకారం; (ii) నైపుణ్యాల అభివృద్ధి; (iii) డిజిటలీకరణ; (iv) సుస్థిరత; (v) అనుసంధానం; (vi) ఆరోగ్య సంరక్షణఔషధాలు; (vii) ప్రజాసాంస్కృతిక సంబంధాలు; (viii) రక్షణభద్రతాపరమైన సహకారం.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ప్రణాళిక

  • ఆర్థిక సహకారం: కొత్తభవిష్యత్ దార్శనిక రంగాల్లో ఆర్థిక సంబంధాల బలోపేతంసహకారాన్ని పెంపొందించుకోవడం

  • సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)వాణిజ్యమూ పెట్టుబడుల సంయుక్త కార్యాచరణ బృందం వార్షిక సమావేశం ద్వారా.. ఇరుదేశాల వాణిజ్య ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని ద్వైపాక్షిక వాణిజ్యాన్నిమార్కెట్లలో ప్రవేశ సౌలభ్యాన్ని మరింత పెంచడం;

  • ఇరు పక్షాల మధ్య చర్చల కొనసాగింపు.. అలాగేసీఈసీఏ మూడో సమీక్షను ప్రారంభించడంలో పురోగతి సాధించడంతోపాటు 2025లో వస్తువుల ఒప్పందంలో ఆసియాన్ భారత్ వాణిజ్యాన్ని (ఏఐటీఐజీఏవిశేషంగా సమీక్షించడం;

  • భారత సెమీకండక్టర్ పరిశ్రమసానుకూల వ్యవస్థ వృద్ధికి చేయూతనివ్వడం.. అందులో భాగంగా భారత్ సింగపూర్ సెమీకండక్టర్ విధాన చర్చల కింద సహకారంసింగపూర్ కంపెనీలతో భాగస్వామ్యాలకు అవకాశాలుక్రియాశీలంగా ఉండే సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థల అభివృద్ధిపరస్పర ప్రయోజనకరమైన పరిశోధన అభివృద్ధి సహకారాల అన్వేషణశ్రామికశక్తి అభివృద్ధికి ప్రోత్సాహంసమాచార వినిమయం ద్వారా వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహించడంఅత్యుత్తమ విధానాల పరస్పర మార్పిడిప్రత్యక్ష పెట్టుబడులుభారతీయ సింగపూర్ సంస్థల మధ్య అవకాశమున్న భాగస్వామ్యాలు;

  • వెంచర్లూ భాగస్వామ్యాల ఏర్పాటువైజ్ఞానిక వినిమయంలో ప్రభుత్వాల నడుమ సహకారంనైపుణ్య శిక్షణపర్యావరణ హిత ప్రమాణాల అమలుబృహత్ప్రణాళికలుప్రోత్సాహం సహా... సంయుక్తంగా పర్యావరణ హిత మార్గాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధిఅధునాతన తయారీ సామర్థ్యాలతో సమగ్ర పారిశ్రామిక పార్కులు

  • భారత్-సింగపూర్ మూలధన మార్కెట్ అనుసంధానాన్ని సంయుక్తంగా మెరుగుపరచడం.. అలాగే ఎన్ఎస్ఈ-ఐఎఫ్ఎస్సీ-ఎస్‌జీఎక్స్ గిఫ్ట్ కనెక్ట్ వంటి ఉమ్మడి కార్యక్రమాలపై సన్నిహిత సహకారాన్ని నిర్మించడం,

  • భారత్సింగపూర్‌లోని వాణిజ్య వర్గాల మధ్య భాగస్వామ్యాలుముఖ్యంగా ద్వైపాక్షిక సహకార ఎజెండాను అమలు చేసే రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం.. భారత్-సింగపూర్ వాణిజ్య రౌండ్ టేబుల్ సమావేశాల (ఐఎస్‌బీఆర్వంటి వ్యాపార సంబంధాలనూ విస్తృతం చేయడం,

  • అంతరిక్ష రంగంలో ఉమ్మడి సహకారాన్ని ప్రోత్సహించడం.. ఇందులో భాగంగా భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహకఆధీకృత కేంద్రం (IN-SPACe)సింగపూర్ అంతరిక్ష సాంకేతికతపరిశ్రమల కార్యాలయం మధ్యఅలాగే ఇరుదేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకారంఅంతరిక్ష విధానమూ చట్టాల్లోనూఅలగే భూ పరిశీలనఉపగ్రహ కమ్యూనికేషన్ సాంకేతికతఅనువర్తనాలు వంటి ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల్లోనూ సహకారం,

  • భారత్సింగపూర్‌లోని సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రమేయంతో ఇరుపక్షాల వాణిజ్య అవసరాలను తీర్చే లక్ష్యంతో అవకాశమున్న చోట్ల చట్టపరమైనవివాద పరిష్కార సహకారాన్ని పెంపొందించుకోవడం.

    నైపుణ్యాల అభివృద్ధినైపుణ్యాలుసామర్థ్యాభివృద్ధిలో భాగస్వామ్యం

  • తమిళనాడులోని చెన్నైలో అధునాతన తయారీపై సంయుక్తంగా జాతీయ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు... పారిశ్రామిక సంబంధాలను పెంచడంపాఠ్యాంశాల్లో ప్రమాణాలపై సహకారంశిక్షకులకు శిక్షణనైపుణ్య ధ్రువీకరణ వ్యవస్థల ఏర్పాటుఎప్పటికప్పుడు సమీక్షలుమదింపులతో నాణ్యతను కాపాడుకోవడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుందిఅధునాతన తయారీవిమానయానంనిర్వహణపరమైన మరమ్మతులూ సమగ్ర మరమ్మతులూ (MRO) సహా ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో నైపుణ్య కేంద్రాల అభివృద్ధి దిశగా ప్రైవేటు రంగంతో సహకరించడంపైనా ఇది దృష్టిపెడుతుంది.

  • సాంకేతిక వృత్తి విద్య శిక్షణ (టీవీఈటీ)నైపుణ్యాల అభివృద్ధిలో సామర్థ్యాభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడంఉన్నత విద్యా సంస్థల మధ్య సాంకేతిక విద్యా రంగంలో సహకారంఉద్యోగుల్లో కొత్త నైపుణ్యాల శిక్షణతోపాటు ప్రస్తుత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సమాచారంఅత్యుత్తమ పద్ధతుల విషయంలో పరస్పర మార్పిడివిద్యార్థులూ సిబ్బంది వినిమయంవిద్యార్థుల ఇంటర్న్ షిప్పులూ పరిశ్రమలతో సిబ్బంది ఎటాచ్మెంట్లనూ పెంచడంబోధకులకు శిక్షణవిద్యనైపుణ్యాభివృద్ధి ఎజెండాలో పురోగతిని ముందుకు తీసుకెళ్లిసమీక్షించడం కోసం ఇరుపక్షాలూ ఓ ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తాయి,

  • సింగపూర్-అస్సాం నర్సింగ్ టాలెంట్ స్కిల్స్ కోఆపరేషన్ వంటి రాష్ట్ర స్థాయి నైపుణ్య సహకారానికి చేయూతనిచ్చేలా నైపుణ్యాభివృద్ధి కోసం సింగపూర్‌ భారత్ మధ్య ప్రస్తుత సహకారాన్ని మరింత బలోపేతం చేయడం,

  • డిజిటలీకరణ: డిజిటల్ఆర్థిక సాంకేతికతల్లో సహకారాన్ని బలోపేతం చేయడం

  • ఫిన్‌టెక్‌పై సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా.. భారత్ సింగపూర్ మధ్య డిజిటల్ ఫైనాన్స్‌నుఫిన్ టెక్‌లో సహకారంతోపాటు సైబర్ భద్రతనూ మూలధన మార్కెట్ అనుసంధానాలనూ బలోపేతం చేయడం,

  • డిజిటల్ మార్గాల్లో అనుభవాలను పంచుకోవడంతోపాటు సాంకేతిక నైపుణ్య పరస్పర వినిమయం.. అలాగేప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా వాటి అమలును పర్యవేక్షించడం,

  • డిజిటల్ రంగంలో భాగస్వామ్యాలు లక్ష్యంగా ఇరు పక్షాల అంకుర సంస్థలు చిన్నమధ్య తరహా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం,

  • సైబర్ విధానాలుసీఈఆర్టీ -  సీఈఆర్టీ సమాచార వినిమయంసైబర్ భద్రతా సామర్థ్యాభివృద్ధిసైబర్ సంబంధిత అంశాల్లో ఇరువైపులా భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడం,

  • గిఫ్ట్ సిటీ-సింగపూర్ సహకారానికి సంబంధించి.. విధాన చట్రంపై చర్చలను ప్రారంభించడానికిఅలాగే అది వర్తించే డేటా రకాల వంటి వినియోగ సందర్భాలను గుర్తించిట్రయల్ చేయడానికి భారత్సింగపూర్‌లోని సంబంధిత ఏజెన్సీలునియంత్రణ సంస్థల అధికారులతో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటు,

  • ఆవిష్కరణలతోపాటు సమ్మిళితసుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికిడిజిటల్ సాంకేతికతలపై ప్రస్తుతం  ఉమ్మడి కార్యాచరణ బృందం పరిధిలో కీలకఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో సహకార అవకాశాలను పరిశీలించడం.

  • వ్యవసాయంఆరోగ్య సంరక్షణవిద్య వంటి రంగాలలో ఏఐ సిద్ధంగా ఉన్న డేటా సెట్‌లను అభివృద్ధి చేయడానికిడేటా ఆధారిత ఏఐ వినియోగ నమూనాలను నిర్మించడంలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా కృత్రిమ మేధస్సుపై సహకారాన్ని అన్వేషించడం

  • యూపీఐ-పే నవ్‌ లింకేజ్‌ను ఉపయోగించి దేశాల మధ్య చెల్లింపుల సామర్థ్యాన్ని పెంచడంకాగితరహితసురక్షితవ్యాపారవ్యక్తిగత చెల్లింపుల మార్గాలను విస్తరించడంపరిమితిని పెంచడం

  • భారతసింగపూర్ మధ్య ట్రేడ్‌ ట్రస్ట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేసి పరస్పరం అనుసంధానమైన ఈ-బిల్స్ ఆఫ్ లేడింగ్ ద్వారా నమ్మదగినసురక్షిత వాణిజ్య పత్రాలను మార్పిడి చేయడం.

  • స్థిరత్వంసుస్థిర అభివృద్ధిహరిత వాణిజ్యంలో సహకార అవకాశాలను అన్వేషించడం

  • గ్రీన్ హైడ్రోజన్అమ్మోనియా ఉత్పత్తివాణిజ్యంలో సహకారాన్ని పెంచడం.

  • పట్టణ నీటి నిర్వహణ రంగంలో సహకారాన్ని అన్వేషించడం.

  • పౌర అణు రంగంలో సహకార మార్గాలను అన్వేషించడం.

  • పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 ప్రకారం వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొవడానికి పరస్పర లాభదాయకమైన ద్వైపాక్షిక సహకార వ్యూహాన్ని అభివృద్ధి చేయడం.

  • సింగపూర్ సభ్యదేశంగా ఉన్న సంస్థలైన అంతర్జాతీయ సౌర కూటమిప్రపంచ బయోఇంధన కూటమి వంటి బహుపాక్షిక వేదికలపై హరితసుస్థిర కార్యక్రమాలపై కలసి పని చేయడం.

  • భారత్‌సింగపూర్ మధ్యఅలాగే మూడో దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా ఆహార భద్రతపై సహకారాన్ని లోతుగా అభివృద్ధి చేయడం.

  • ఎంపిక చేసిన ఎగుమతులకు దేశ స్థాయిగుర్తింపు అవకాశాలను అన్వేషించడం ద్వారా ఈ సహకారాన్ని బలోపేతం చేయడం.

  • అనుసంధానంసముద్రవిమానయాన అనుసంధానతను విస్తరించడం.

  • భారత్‌సింగపూర్‌ మధ్య హరితడిజిటల్ రవాణా మార్గం (జీడీఎస్‌సీస్థాపనకు మద్దతు ఇవ్వడం ద్వారా సింగపూర్భారత్‌లోని నౌకాశ్రయాల మధ్య సముద్ర అనుసంధానాన్ని మరింతగా పెంచవచ్చుఇది హరిత సముద్ర ఇంధన కారిడార్ స్థాపనకు కృషి చేస్తుంది.

  • భారత్‌లో అభివృద్ధి చెందుతున్న విమానయానఅంతరిక్ష రంగాల్లో రెండు దేశాల సంస్థల మధ్య భాగస్వామ్యాల ద్వారా అనుబంధ వ్యవస్థ సహకారాన్ని మరింతగా పెంపొందించడంసింగపూర్ నైపుణ్యాన్ని పంచుకోవడంఉద్యోగ శిక్షణ అవకాశాలను అందించడం.

  • రెండు దేశాల మధ్య ప్రయాణ అవకాశం పెరుగుదలను గుర్తించిన ఇరు దేశాల ప్రధానులు వైమానిక అనుసంధానాన్ని పెంపొందించడానికి ద్వైపాక్షిక వాయు సేవల ఒప్పందాన్ని విస్తరించడం గురించి చర్చించాలని రెండు దేశాల పౌర విమానయాన అధికారులను ప్రోత్సహించారు.

  • భారత విమానాశ్రయాల కోసం విమానాశ్రయ సలహానిర్వహణ సేవలలో అనుభవంనైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడంతో సహా సామర్థ్య నిర్మాణంవిమానాశ్రయ అభివృద్ధిలో భాగస్వామ్యాలను అన్వేషించడం.

  • విమానయాన రంగంలో పరిశుభ్రమైనస్థిరమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా స్థిరమైన విమానయాన ఇంధనంపై సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.

  • ఆరోగ్య సేవలువైద్యంఆరోగ్య సేవలువైద్య రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం

  • ఆరోగ్యంవైద్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కింద సహకారాన్ని మరింతగా పెంచడంఇందులో మానవ వనరుల అభివృద్ధిడిజిటల్ ఆరోగ్య పరిష్కారాలువ్యాధి పర్యవేక్షణతల్లి-బిడ్డ ఆరోగ్యంపోషకాహారంఆరోగ్య విధానాలు,, వైద్య ఉత్పత్తులపై దృష్టి సారించడం,నియంత్రణ సులభతరం చేసే సహకార పరిశోధనపై దృష్టి పెట్టడంసంక్రమించేసంక్రమించని వ్యాధులను ఎదుర్కోవడంఆరోగ్య భద్రతపరిశోధనఆవిష్కరణలపై దృష్టి పెట్టడం.

  • ఆరోగ్య సహకారంపై ఏర్పాటైన సంయుక్త కార్యనిర్వాహక వర్గాన్ని క్రమం తప్పకుండా సమావేశపరచడం.

  • నర్సింగ్ నైపుణ్యాల శిక్షణలో సమాచారంజ్ఞానాన్ని పంచుకోవడం చేసుకోవడం ద్వారా నర్సింగ్ నైపుణ్యాల అభివృద్ధి రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చయడంఅదే విధంగా ప్రస్తుతం సింగపూర్అస్సాం రాష్ట్రం మధ్య నర్సింగ్ ప్రతిభ నైపుణ్యాల సహకారంపై అవగాహన ఒప్పందం ప్రకారం సింగపూర్‌లో ఉపాధిని మెరుగుపరచడం.

  • డిజిటల్ ఆరోగ్యంవైద్య సాంకేతికత రంగాల్లో సహకార పారిశ్రామిక పరిశోధనఅభివృద్ధిలో కొనసాగుతున్న సహకారాన్ని మరింతగా విస్తరించడంకొత్త ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు

  • ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిప్రజల మధ్య సంబంధాలనుసాంస్కృతిక అనుబంధాలను మద్దతివ్వడం

  • భారత్‌సింగపూర్ మధ్య దీర్ఘకాలిక సామాజికసాంస్కృతికప్రజల మధ్యకు సంబంధాలను మరింత బలోపేతం చేయడంముఖ్యంగా సముద్ర వారసత్వం వంటి పరస్పర ఆసక్తి కలిగిన రంగాల్లో సహకారాన్ని అన్వేషించడం

  • పారిశ్రామిక శిక్షణా సంస్థల విద్యార్థులతో సహా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడంవిస్తరించడంసింగపూర్-భారత్‌ భాగస్వామ్య సంస్థ ద్వారా నిర్వహించే అనుభవజ్ఞ శిక్షణా కార్యక్రమాలుఇంటర్న్‌షిప్‌ల ద్వారా భారతీయ కంపెనీలలో సింగపూర్ ఇంటర్న్‌ల అనుబంధం వంటివి కలిగి ఉంటాయి

  • పార్లమెంటరీ మార్పిడి కార్యక్రమాల ద్వారా మరింత లోతైన పార్లమెంటరీ అనుసంధానాన్ని ప్రోత్సహించడం.

  • సీనియర్‌ ప్రభుత్వాధికారుల స్థాయిలో అధ్యయన సందర్శనల ద్వారా ప్రజాసేవ మార్పిడినిశిక్షణను సులభతరం చేయడం.

  • రాయబారి/దౌత్య సంబంధాల విషయంలో సంబంధిత అధికారుల మధ్య క్రమం తప్పకుండా సలహా సమావేశాలను నిర్వహించడం ద్వారా సమస్యలకు వేగంగా పరిష్కారాలు కనుగొనడం..

  • రెండు దేశాల ఆలోచనా సంస్థలుఅకాడమిక్‌ సంస్థలుపరిశోధనా సంస్థల మధ్య స్థిరమైన సంబంధాలనీపరస్పర అనుసంధానాన్నీ ప్రోత్సహించడం.

  • కళాకారులుకళాబృందాలుప్రదర్శనల ద్వారా సాంస్కృతిక మార్పిడిని కొనసాగించడంప్రోత్సహించడం.

  • రక్షణభద్రతా సహకారంప్రాంతీయ శాంతి స్థిరత్వాన్ని ప్రోత్సహించే వ్యూహాత్మక సహకారం.

  • అన్ని స్థాయిల్లో రక్షణభద్రతా సహకారంపై నిరంతర మార్పిడులుఅనుసంధానాన్ని ప్రోత్సహించడంఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశాలుసీనియర్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సైనిక సహకారంమార్పిడికి సంబంధించి రక్షణ విధాన చర్చలు కూడా ఉంటాయిఇందులో భారత్‌సింగపూర్ ఆర్మీనేవీఎయిర్ ఫోర్స్ కలిసి వివిధ రూపాలలో నిర్వహించే సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఉంటాయి.

  • క్వాంటమ్ కంప్యూటింగ్కృత్రిమ మేధఆటోమేషన్మానవ రహిత నౌకలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రక్షణ సాంకేతికత సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడం.

  • సముద్ర భద్రతజలాంతర్గామి రక్షణ రంగాల్లో సహకారాన్ని కొనసాగించడంఅలాగే ఇండో-పసిఫిక్‌ఇండో-పసిఫిక్‌ మహా సముద్రాల కార్యక్రమాలపై ఏషియన్‌ దృక్పథం సూత్రాలుసహకార రంగాలకు అనుగుణంగా ప్రాంతీయ భద్రతా వ్యవస్థలతో సన్నిహితంగా పనిచేయడం.

  • అంతర్జాతీయ అనుసంధాన అధికారుల ద్వారా సంబంధిత సమాచార విలీన కేంద్రాల మధ్య సముద్ర ప్రాంత అవగాహనలో సహకారాన్ని బలోపేతం చేయడం.

  • మలక్కా జలసంధి నిఘాపై భారత్‌ ఆసక్తిని సింగపూర్ కృతజ్ఞతతో గుర్తించింది.

  • సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పరస్పర సహకారాన్ని బలపరచడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయిఐక్యరాజ్యసమితి 1267 ఆంక్షల కమిటీ నిషేధించిన వాటితో సహా ప్రపంచప్రాంతీయ ఉగ్రవాదంఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగాఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగాద్వైపాక్షిక యంత్రాంగాలుఎఫ్‌ఏటీఎఫ్‌ఇతర బహుపాక్షిక వేదికల ద్వారా పోరాడటానికి రెండు దేశాల సహకారాన్ని బలోపేతం చేస్తాయి.

  • రెండు దేశాల మధ్య జరిపే నేర విచారణలున్యాయ ప్రక్రియలలో సహకారాన్ని సులభతరం చేసే ద్వైపాక్షిక్ష పరస్పర చట్ట సహాయ ఒప్పందం కింద సహకారాన్ని బలోపేతం చేయడం.

  • సింగపూర్‌భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య జరుగుతున్న విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించేందుకు కట్టుబడి ఉన్నాయి.

  • సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో పురోగతిని ప్రతి ఏడాది పర్యవేక్షించేందుకు భారత్‌-సింగపూర్ మంత్రుల రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఒక అగ్రగామి యంత్రాంగంగా సంస్థాగతీకరించడానికి ఇద్దరు ప్రధానులు అంగీకరించారు.

 

***

 


(Release ID: 2164306) Visitor Counter : 5