రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి


విజ్ఞానంలో ప్రపంచశక్తిగా భారత్‌ను మార్చేందుకు మన ఉపాధ్యాయులను

ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలి: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Posted On: 05 SEP 2025 2:20PM by PIB Hyderabad

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఆహారందుస్తులునివాసం లాగే విద్య కూడా ఒక వ్యక్తి గౌరవంభద్రతకు చాలా అవసరమన్నారువివేకవంతులైన ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గౌరవంభద్రతను పెంపొందించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారుఉపాధ్యాయురాలిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్న రాష్ట్రపతి.. ఆ సమయాన్ని తన జీవితంలో చాలా అర్థవంతమైన కాలంగా అభివర్ణించారు.

విద్య ఒక వ్యక్తిని సమర్థుడిని చేస్తుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారునిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు విద్యా శక్తితో పురోగతి అనే ఆకాశాన్ని అందుకుంటారని అన్నారుప్రేమఅంకితభావం కలిగిన ఉపాధ్యాయులు పిల్లల పురోగతికి ప్రోద్బలాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారువిద్యార్థులు జీవితాంతం ఉపాధ్యాయులను గుర్తుంచుకోవడం ఉపాధ్యాయులకు లభించే అతిపెద్ద బహుమతి అవుతుందన్నారుకుటుంబంసమాజందేశం కోసం ఉపాధ్యాయులు చేసే కృషి ప్రశంసనీయమని రాష్ట్రపతి కొనియాడారు.

విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ప్రాథమిక కర్తవ్యంగా రాష్ట్రపతి పేర్కొన్నారుపోటీపుస్తక జ్ఞానంస్వార్థం పట్ల మాత్రమే ఆసక్తి గల విద్యార్థుల కంటే నైతిక విలువలతో కూడిన ప్రవర్తనను అనుసరించే సున్నితమైనబాధ్యతాయుతమైనఅంకితభావం గల విద్యార్థులు అత్యుత్తములని వ్యాఖ్యానించారుమంచి ఉపాధ్యాయుడికి భావోద్వేగాలుతెలివి రెండూ ఉంటాయనీ.. ఈ రెండింటి సమన్వయం విద్యార్థులపై కూడా ప్రభావం చూపుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

స్మార్ట్ బ్లాక్‌బోర్డులుస్మార్ట్ తరగతి గదులుఇతర ఆధునిక సౌకర్యాలకు సొంత ప్రాముఖ్యం ఉంటుందన్న రాష్ట్రపతి.. అతి ముఖ్యమైన విషయం స్మార్ట్ టీచర్లేనన్నారుస్మార్ట్ టీచర్లు అంటే విద్యార్థుల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకునే ఉపాధ్యాయులనీ.. వారు ప్రేమసున్నితత్వంతో అభ్యసన ప్రక్రియను ఆసక్తికరంగాప్రభావవంతంగా మార్చగలరని రాష్ట్రపతి వ్యాఖ్యానించారుఅలాంటి ఉపాధ్యాయులు సమాజదేశ అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉండే విద్యార్థులను రూపొందించగలరని శ్రీమతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

బాలికల విద్యకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని రాష్ట్రపతి కోరారుబాలికా విద్యలో పెట్టుబడి పెట్టడం ద్వారా మన కుటుంబంసమాజందేశ నిర్మాణంలో మనం అమూల్యమైన పెట్టుబడి పెట్టినట్లేనని వ్యాఖ్యానించారుబాలికలకు సాధ్యమైనంత ఉత్తమ విద్యను అందించడం మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆమె పేర్కొన్నారుకస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను విస్తరించడంవెనకబడిన తరగతుల బాలికలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను అందించడంపై జాతీయ విద్యా విధానం 2020 ప్రధానంగా దృష్టి సారిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారువిద్యకు సంబంధించిన ఏ కార్యక్రమం విజయవంతమైనా ప్రధానంగా అది ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారుబాలికల విద్యకు వారు ఎంత ఎక్కువ సహకరిస్తారోఉపాధ్యాయులుగా వారి జీవితం అంత అర్థవంతంగా ఉంటుందని తెలిపారుభయస్తులైనతక్కువ ప్రాధాన్యం గల నేపథ్యం నుండి వచ్చిన బాలికలు సహా విద్యార్థులందరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు.

విజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చడమే జాతీయ విద్యా విధాన లక్ష్యమని రాష్ట్రపతి అన్నారుదీని కోసం మన ఉపాధ్యాయులను ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఆమె వ్యాఖ్యానించారుమన సంస్థలుఉపాధ్యాయులు పాఠశాల విద్యఉన్నత విద్యనైపుణ్య విద్యలో సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. తమ వంతు కృషిని అందించడం ద్వారా ఉపాధ్యాయులు మన దేశాన్ని విజ్ఞాన రంగంలో ప్రపంచశక్తిగా నిలుపుతారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని చూసేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి-

 

***


(Release ID: 2164302) Visitor Counter : 2