ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచంలో... బ్యాంకింగ్ సేవలను ఇంటింటికీ తీసుకువెళ్లిన అతిపెద్ద సంస్థగా అవతరించిన భారత తపాలా వ్యవస్థపై వ్యాసాన్ని పంచుకొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 SEP 2025 12:04PM by PIB Hyderabad

బ్యాంకింగ్ సేవలను వినియోగదార్ల ఇంటి ముంగిటకే తీసుకువచ్చి అందిస్తున్న ప్రపంచవ్యాప్త వ్యవస్థల్లో ప్రస్తుతం అతి పెద్ద వ్యవస్థగా మన దేశ తపాలా వ్యవస్థ ఎలా పేరుతెచ్చుకొని ఆత్మగౌరవానికిసాధికారతకు పెద్దపీట వేసిందోఇండియా పోస్ట్ తో పాటు ఐపీపీబీ ఆన్‌లైన్ కూడా ఈ అంశంలో తోడ్పడిన తీరును వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ జ్యోతిరాదిత్య సింధియా నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందించారు:

‘‘
ఎంతో వినయంతో సేవలందించే మన పోస్ట్‌మన్ ఇంతకు ముందు ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ప్రభుత్వం చేసిన కృషితోఆర్థిక సేవలను అందరి చెంతకు చేర్చడంలో అగ్రగామిగా నిలిచాడుఇండియా పోస్ట్ (@IndiaPostOffice), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (@IPPBOnline)ల అండదండలతో భారత తపాలా వ్యవస్థ ఆత్మగౌరవానికిసాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అత్యంత విస్తృత ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌’గా పేరు తెచ్చుకొంది.

దీనిపై కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా (@JM_Scindia) రాసిన వ్యాసాన్ని మీరు చదివితే మరింత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవచ్చు!’’


***


(रिलीज़ आईडी: 2163872) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam