ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సింగపూర్ ప్రధాని శ్రీ లారెన్స్ వోంగ్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 SEP 2025 1:04PM by PIB Hyderabad
సింగపూర్ ప్రధాని శ్రీ లారెన్స్ వోంగ్ భారత్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా మేం పయనిస్తున్నాం. ఈ పయనంలో సింగపూర్ ఒక గౌరవనీయ భాగస్వామి అని శ్రీ మోదీ అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశంలో ఇలా రాశారు:
‘‘భారత్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు మీకు ఇవే ధన్యవాదాలు ప్రధానమంత్రి శ్రీ వోంగ్.
వికసిత్ భారత్‌ను ఆవిష్కరించే దిశలో ముందుకు సాగుతున్న మాకు సింగపూర్ ఒక ముఖ్య భాగస్వామ్య దేశం. ఆధునిక తయారీ, నైపుణ్యాలను పెంచుకోవడం, డిజిటల్ వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటే మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తత్సంబంధిత మార్గసూచీని త్వరితగతిన అమలు చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.’’
@LawrenceWongST
(रिलीज़ आईडी: 2163689)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam