ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రముఖ సీఈవోలతో ప్రధాని సంభాషణ

Posted On: 03 SEP 2025 8:38PM by PIB Hyderabad

సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెమీకండక్టర్ల రంగంలోని ప్రముఖ సీఈవోలతో సంభాషించారు. ‘‘బలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు నైపుణ్యాభివృద్ధిఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం సహా ఈ రంగంలో భారత నిరంతర సంస్కరణల ప్రస్థానం గురించి నేను మాట్లాడాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘ఈ రోజు సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా సెమీకండక్టర్ల రంగానికి సంబంధించిన ప్రముఖ సీఈవోలతో మాట్లాడానుభారత్ సామర్థ్యంపై వారికి స్పష్టమైన విశ్వాసం ఉందిసెమీకండక్టర్ ఆవిష్కరణతయారీ విషయంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ మారడంపై వారికి భారీ అంచనాలున్నాయిబలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు నైపుణ్యాభివృద్ధిఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం సహా ఈ రంగంలో భారత్ నిరంతర సంస్కరణల ప్రస్థానం గురించి నేను మాట్లాడాను.’’ 

 

***


(Release ID: 2163519) Visitor Counter : 2