ప్రధాన మంత్రి కార్యాలయం
భారత సెమీకండక్టర్ల పరివర్తనాత్మక ప్రస్థానంపై వ్యాసం.. పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
03 SEP 2025 12:24PM by PIB Hyderabad
భారత సెమీకండక్టర్ల రంగ లో పరివర్తనాత్మక ప్రస్థానాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారు. ఈ మార్గంలో నిరంతరంగా ముందుకు సాగిపోతుందనడానికి ‘సెమీకాన్ ఇండియా 2025’ ఒక ప్రతీకగా నిలిచిందని మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా రాశారు:
‘‘భారత సెమీకండక్టర్ల పరివర్తనాత్మక ప్రస్థానంపై కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ (@AshwiniVaishnaw) తన వ్యాసంలో వివరించారు. ఈ మార్గంలో దేశం మున్ముందుకు సాగిపోతుందనడానికి ‘సెమీకాన్ ఇండియా 2025’ ఒక ప్రతీకగా నిలిచిందని మంత్రి తెలిపారు.
రాబోయే పదేళ్లలో, మన దేశ సెమీకండక్టర్ యూనిట్లు మరింతగా వృద్ధి చెంది పరిపక్వతను సాధించే కొద్దీ.. దేశంలోని పూర్తి సెమీకండక్టర్ సంబంధిత విలువ ఆధారిత వ్యవస్థ గట్టి పోటీ ఇస్తూ ఎదుగుతుందని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు.’’
(Release ID: 2163304)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam