ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడిన ప్రధానమంత్రి


ఉక్రెయిన్‌కు సంబంధించిన ఇటీవలి పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఘర్షణల శాంతియుత పరిష్కారం విషయంలో భారత సుస్థిర వైఖరిని.. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి

భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్య బలోపేతం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరువురు నేతలు

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2025 7:49PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో టెలిఫోన్లో మాట్లాడారు.

ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల పట్ల తన దృక్పథాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి తెలియజేశారు.

అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి.. ఘర్షణల శాంతియుత పరిష్కారం, శాంతి పునరుద్ధరణ పట్ల భారత దృఢమైన, సుస్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు. ఈ విషయంలో సాధ్యమైన మేరకు అన్ని విధాలా మద్దతునందించడం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనం గల అన్ని రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే అవకాశం గల మార్గాలను చర్చించారు.

సంప్రదింపులు కొనసాగించడానికి వారు అంగీకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2162552) సందర్శకుల సూచీ సంఖ్య : : 18