ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో ఉన్న సెమీకండక్టర్ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

Posted On: 30 AUG 2025 11:52AM by PIB Hyderabad

జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జపాన్‌కు చెందిన మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో పర్యటించారుసెమీ‌కండరక్టర్ రంగంలో ప్రముఖ జపాన్ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రాన్ మియాగీ లిమిటెడ్‌ను (టీఈఎల్ మియాగీవారు సందర్శించారుప్రపంచ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విలువ గొలుసులో టీఈఎల్ పాత్రదాని అధునాతన తయారీ సామర్థ్యాలు.. భారత్‌తో ఆ కంపెనీ ప్రణాళికలో ఉన్న భాగస్వామ్యాల గురించి ప్రధాన మంత్రికి వివరించారుసెమీకండక్టర్ రంగంలో సరఫరా వ్యవస్థతయారీపరీక్షలకు సంబంధించిన విభాగాల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు రెండు దేశాల మధ్య ఉన్న అవకాశాల గురించి ఇరువురు నాయకులకు క్షేత్ర స్థాయి అవగాహనను ఈ సందర్శన కల్పించింది.

 

భారతదేశంలో వృద్ధి చెందుతోన్న సెమీకండక్టర్ తయారీ వ్యవస్థ.. అధునాతన సెమీకండక్టర్ పరికరాలుసాంకేతికత విషయంలో జపాన్‌కు ఉన్న సామర్థ్యంలోని సారూప్యతలను అర్థం చేసుకోవడానికి ఈ సెండాయ్ పర్యటన ఉపకరించిందిభారత్‌-జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యంఆర్థిక భద్రతా చర్చల ప్రకారం ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలతో పాటు జపాన్-ఇండియా సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ భాగస్వామ్యంపై సహకార ఒప్పందం ఆధారంగా ఈ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిబద్ధతలో ఉన్నట్లు ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.

 

భారత ప్రధాని శ్రీ మోదీజపాన్ ప్రధాని శ్రీ ఇషిబా సంయుక్తంగా చేపట్టిన ఈ పర్యటన.. భారీధృడమైనవిశ్వసనీయమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే ఇరు దేశాల ఉమ్మడి దార్శనికతకు అద్దం పట్టిందిఈ పర్యటనలో పాల్గొన్నందుకు ఆ దేశ ప్రధాని శ్రీ ఇషిబాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియజేశారుఈ వ్యూహాత్మక రంగంలో జపాన్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్లు శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

 

సెండాయ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం జపాన్ ప్రధాని శ్రీ ఇషిబా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారుఈ కార్యక్రమంలో మియాగి రాష్ట్ర గవర్నర్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 2162212) Visitor Counter : 20