ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్లోని రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సవం నాడు పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 28 AUG 2025 8:25PM by PIB Hyderabad

బీహార్లోని చారిత్రక నగరం రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సమైన ఆగస్టు 29న ప్రారంభమయ్యే పురుషుల హకీ ఆసియా కప్ 2025‌లో ఆసియా వ్యాప్తంగా పాల్గొనే జట్లుక్రీడాకారులుఅధికారులువారి అభిమానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్‌షిప్ 2025, ఐఎస్‌టీఏఎఫ్ సెపక్‌తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా ఇటీవలి కాలంలో శక్తిమంతమైన క్రీడాకేంద్రంగా తనదైన ముద్ర వేసిన బీహార్‌ను అమిభనందించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన థ్రెడ్‌లో ప్రధాని ఇలా అన్నారు:

‘‘రేపుఆగస్టు 29న (ఆ రోజు జాతీయ క్రీడా దినోత్సవంమేజర్ ధ్యాన్‌చంద్ జయంతి కూడాపురుషుల హాకీ ఆసియా కప్ 2025 బీహార్లోని చారిత్రక నగరం రాజ్‌గిర్లో ప్రారంభమవుతుందిఆసియా వ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొంటున్న జట్లుక్రీడాకారులుఅధికారులువారి అభిమానులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’’

‘‘భారత్ఆసియా వ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాల్లో హాకీకి ప్రత్యేక స్థానం ఉందిభవిష్యత్తు తరాలకు చెందిన క్రీడా ప్రేమికులకు ఉత్కంఠభరితమైన మ్యాచులుఅత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనలుగుర్తుండిపోయే క్షణాలు ఈ టోర్నమెంట్లో ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను.’’

‘‘పురుషుల హాకీ ఆసియా కప్ 2025కు బీహార్ ఆతిథ్యమివ్వడం సంతోషించదగ్గ విషయంఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్‌షిప్ 2025, ఐఎస్‌టీఏఎఫ్ సెపక్‌తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లకు ఆతిథ్యమివ్వడం ద్వారా బీహార్ శక్తిమంతమైన క్రీడా కేంద్రంగా మారిందిఈ నిరంతరం వేగం.. బీహార్లో పెరుగుతున్న మౌలిక వసతులుక్షేత్ర స్థాయిలో ఉత్సాహంవివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభను ప్రోత్సహించడంలో చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది.’’

 

***


(Release ID: 2161725) Visitor Counter : 15