ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశానికి ఫైడ్ ప్రపంచ కప్ రావడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

Posted On: 26 AUG 2025 11:30PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్- 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారుఇది ఎంతో గర్వ కారణమైన విషయమనిదీనికోసం ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 20 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు భారతదేశం అతిథ్యం ఇవ్వనున్నది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య చేసిన పోస్టుపై ప్రధానమంత్రి మోదీ ఈ విధంగా స్పందించారు:

రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్-2025కు ఆతిథ్యం ఇవ్వటంపై భారతదేశం సంతోషంగా ఉందిమన యువతలో చెస్ ఆదరణ పొందుతోందిఈ టోర్నమెంటు... ఉత్కంఠభరితమైన పోటీలకు సాక్ష్యంగా నిలుస్తుందనిప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్ల ప్రతిభను ప్రదర్శిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను."


(Release ID: 2161285)