ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరగటంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని

Posted On: 27 AUG 2025 1:01PM by PIB Hyderabad

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరగటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరగటం బాధాకరంనా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయిగాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానుబాధితులందరికీ ప్రభుత్వం సహాయం చేస్తోందిఅందరూ భద్రంగాక్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను”


(Release ID: 2161278)