ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిజీ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంగ్లిషు పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

Posted On: 25 AUG 2025 1:35PM by PIB Hyderabad

గౌరవ ప్రధాని శ్రీ రాబుకా,

ఇరు దేశాల ప్రతినిధులు,

ప్రసార మాధ్యమ మిత్రులారా,

నమస్కారం.

బులా వినాకా.

ప్రధాని శ్రీ రాబుకాతో పాటు ఆయన ప్రతినిధి వర్గానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా.

33 సంవత్సరాల తరువాత ఓ భారత ప్రధాని 2014లో ఫిజీని సందర్శించారుఇప్పుడీ సందర్భం నాకు అమితానందాన్ని ఇస్తోంది.

ఆ కాలంలోమనం ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కోఆపరేషన్‌ను (ఎఫ్ఐపీఐసీప్రారంభించాంఈ కార్యక్రమం భారత్-ఫిజీ సంబంధాల్ని పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండాపూర్తి పసిఫిక్ రంగంతో మన బంధాలకు ఒక కొత్త శక్తిని కూడా అందించిందిఈ  రోజునప్రధాని శ్రీ రాబుకా పర్యటనతో మన సంబంధాలకు ఒక నూతన అధ్యాయాన్ని జత చేస్తున్నాం.

మిత్రులారా,

భారత్ఫిజీ దేశాల మధ్య గాఢమైన స్నేహబంధముందిపంతోమ్మిదో శతాబ్దంలోభారత్ నుంచి వెళ్లిన అరవై  వేల కన్నా ఎక్కువ మంది గిర్‌మిటియా సోదరీసోదరులు తమ కఠోర పరిశ్రమతోనుఅంకితభావంతోను ఫిజీ సమృద్ధికి తోడ్పడ్డారువారు ఫిజీ సామాజికసాంస్కృతిక వైవిధ్యానికి కొత్త వన్నెలు జోడించారుఫిజీ ఏకతఅఖండతలను వారు నిరంతరంగా బలోపేతం చేస్తున్నారు.

 

అయినవారు తమ మూలాలను మర్చిపోలేదుతమ సంస్కృతిని పదిలపరుచుకుంటున్నారుఫిజీలోని రామాయణ మండలి సంప్రదాయమే దీనికి సజీవ ప్రమాణం. ‘గిర్‌మిటీ దినోత్సవాన్ని’ పాటిస్తామని ప్రధాని శ్రీ రాబుకా ప్రకటించడాన్ని నేను అభినందిస్తున్నాఇది మన ఉమ్మడి చరిత్రను గౌరవించుకోవడమేదీని ద్వారా మన వెనుకటి తరాల వారి స్మృతులకు మనం నివాళి అర్పించినట్లు కూడా అవుతుంది.  

మిత్రులారా,

ఈ రోజు మా విస్తృత చర్చల్లోమేం అనేక ముఖ్య నిర్ణయాల్ని తీసుకొన్నాంఒక దేశం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందగలుగుతుందని మేం నమ్ముతున్నాంఅందువల్లసువాలో ఒక 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాంరక్తశుద్ధి యూనిట్లతో పాటు సముద్ర అంబులెన్సుల్ని కూడా పంపిస్తాంజన ఔషధి కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేస్తాందీంతో తక్కువ ధరల్లో అధిక నాణ్యత కలిగిన మందులు ప్రతి ఇంటికీ అందుతాయికలలను నెరవేర్చుకోవడంలో ఏ ఒక్కరి పరుగూ ఆగిపోకుండా చూసే ఉద్దేశంతోఫిజీలో ఒక ‘జైపూర్ ఫుట్’ శిబిరాన్ని కూడా నిర్వహిస్తాం.

వ్యవసాయ రంగంలోభారత్ పంపించిన అలసంద విత్తనాలు ఫిజీ నేలపై చాలా చక్కగా పెరుగుతున్నాయిభారత్ డజను వ్యావసాయక డ్రోన్లతో పాటు రెండు సంచార భూసార పరీక్షా ప్రయోగశాలల్ని కూడా కానుకగా ఇవ్వబోతోందిఫిజీ‌లో భారత నేతి విక్రయాలకు అనుమతి ఇచ్చినందుకు మేం ఫిజీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం.

మిత్రులారా,

రక్షణభద్రత రంగంలో మన పరస్పర సహకారాన్ని పటిష్ఠపరుచుకోవాలని మేం నిర్ణయించుకున్నాందీనికోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాంఫిజీ నౌకా వాణిజ్య భద్రతను మెరుగుపరచడానికి భారత్ శిక్షణసామగ్రి రూపేణా సహకారాన్ని అందిస్తుందిసైబర్ భద్రతసమాచార పరిరక్షణ రంగాల్లోనూ మేం మా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ఒక పెద్ద సవాలును విసురుతోందని మన రెండు దేశాలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయిఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం చేస్తున్న పోరాటంలో సహకారాన్ని అందించడంతో పాటు మద్దతిస్తున్నందుకు ప్రధాని శ్రీ రాబుకాతో పాటు ఫిజీ ప్రభుత్వానికి మేం మా కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నాం.

మిత్రులారా,

క్రీడారంగంమైదానం నుంచి మనసు వరకు ప్రజలను కలిపే రంగాల్లో ఒకటిఫిజీలో రగ్బీభారత్‌లో క్రికెట్దీనికి  ఉదాహరణలు. ‘స్టార్ ఆఫ్ రగ్బీ సెవెన్స్’గా పేరు తెచ్చుకున్న శ్రీ వైసాలే సెరెవీ భారతదేశ రగ్బీ జట్టుకు శిక్షణనిచ్చారుఇప్పుడుభారత్ కోచ్ తన మార్గదర్శకత్వంలో ఫిజీ క్రికెట్ జట్టును నూతన శిఖరాలకు చేర్చనున్నారు.

ఫిజీ విశ్వవిద్యాలయంలో హిందీనిసంస్కృతాన్ని బోధించడానికి భారత్ నుంచి అధ్యపకులను పంపించాలని మేం నిర్ణయించాంఫిజీకి చెందిన పండితులు మరింత జ్ఞానాన్ని ఆర్జించడానికి భారత్‌కు వచ్చిగీతా మహోత్సవంలో పాల్గొననున్నారుదీంతోభాష నుంచి సంస్కృతి వరకు మన సంబంధాలు మరింత గాఢతరం కానున్నాయి.

మిత్రులారా,

వాతావరణ మార్పు ఫిజీకి కీలక ముప్పుగా మారిందిఈ సందర్బంగామేం పునరుత్పాదక ఇంధనంమరీ ముఖ్యంగా సౌర ఇంధనం రంగంలో కలిసికట్టుగా పనిచేస్తున్నాంఅంతర్జాతీయ సౌర కూటమిసమర్థమైన విపత్తు సన్నద్ధ కూటమిలతో పాటు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్సులో మనం కలిసి నడుస్తున్నాంఇక మనం విపత్తు వేళల్లో తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా ఫిజీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాలను పెంచడంలో సహకారాన్ని అందిస్తాం.

మిత్రులారా,

పసిఫిక్ ద్వీప దేశాలతో సహకారం అన్న అంశంలోమేం ఫిజీని ఒక  కూడలిగా చూస్తున్నాంమన రెండు దేశాలూ దాపరికానికి తావు ఉండనిస్వేచ్ఛాయుతసమగ్రసురక్షభరితసమృద్ధ ఇండో-పసిఫిక్ ‌ను ఆవిష్కరించాలనే ఆశయానికి గట్టి మద్దతును ఇస్తున్నాయి. ‘‘శాంతియుత మహా సముద్రాల్ని’’ ఆవిష్కరించాలన్న ప్రధాని దృష్టికోణం నిజంగా ఎంతో సానుకూలముందుచూపుతో కూడిన విధానంభారత్ ప్రతిపాదించిన ‘ఇండోపసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం’తో ఫిజీ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడాన్ని మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం

భారత్‌కుఫిజీకి మధ్య మహాసముద్రాలు ఉన్నాయి... కానీ ఆకాంక్షల విషయానికి వస్తే మన రెండు దేశాలకూ ఒకే విధమైన ఆకాంక్షలున్నాయి.

గ్లోబల్ సౌత్ ప్రగతి ప్రయాణంలో మనం కలిసి పయనిస్తున్నాంకలిసికట్టుగామనం ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దే  ప్రక్రియలో భాగస్వాములంఆ సరికొత్త ప్రపంచ వ్యవస్థలో స్వాతంత్ర్యానికీఆలోచనలకూగ్లోబల్ సౌత్‌ గుర్తింపునకూ సముచిత గౌరవం లభిస్తుంది.  

ఏ ఒక్కరి అభిప్రాయాన్నీ పట్టించుకోకుండా ఉండకూడదనీఏ దేశాన్నీ వదలివేయరాదనీ మేం నమ్ముతున్నాం.


 

రాబుకా గారూ...

హిందూ మహాసముద్రం మొదలు పసిఫిక్ వరకుమన భాగస్వామ్యం సముద్రాలకు ఒక వారధిగా నిలిచిందిదీని మూలాలు వీలోమానీలో ఉన్నాయిఇది నమ్మకంతో పాటు గౌరవంపైన నిర్మితమైంది.

ఈ చిరకాల బంధాన్ని మీ పర్యటన మరింత బలపరుస్తోందిమీ స్నేహానికి మేం ఎంతో విలువిస్తాం.

వినాకా వాకాలెవూ.‌

 

***


(Release ID: 2160825)