ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రియో డి జనిరో ప్రకటన – సమ్మిళిత, సుస్థిర పాలన దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకుందాం

Posted On: 07 JUL 2025 6:00AM by PIB Hyderabad

 బ్రిక్స్ దేశాధినేతలమైన మేము 2025 జూలై 6 నుంచి 7 వరకు.. ‘‘సమ్మిళితసుస్థిర పాలన దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకార బలోపేతం’’ ఇతివృత్తంతో నిర్వహించిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో సమావేశమయ్యాం.

పరస్పర గౌరవం, అవగాహనఅన్ని దేశాలకూ సమాన సార్వభౌమాధికారంసంఘీభావంప్రజాస్వామ్యంనిష్పాక్షికతసమ్మిళిత్వంసహకారంఏకాభిప్రాయం అనే బ్రిక్స్ స్ఫూర్తికి మేం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. రాజకీయ- భద్రత అంశాలుఆర్థిక- విత్తపరమైన అంశాలుసాంస్కృతిక- ప్రజా సంబంధాలు మూడూ కీలక ప్రాతిపదికలుగా... విస్తరించిన బ్రిక్స్‌లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ 17వ శిఖరాగ్ర సదస్సు వేళ మేం పునరంకితమవుతున్నాం. శాంతిప్రాతినిధ్య పెంపున్యాయబద్ధమైన అంతర్జాతీయ క్రమంపునరుజ్జీవితమైనసంస్కరించిన బహుపాక్షిక వ్యవస్థసుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వికాసాలను ప్రోత్సహించడం ద్వారా మన ప్రజల ప్రయోజనం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికీ కట్టుబడి ఉన్నాం.

ఇండోనేషియాను బ్రిక్స్ సభ్యదేశంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బెలారస్బొలీవియాకజకిస్థాన్క్యూబానైజీరియామలేషియాథాయిలాండ్వియత్నాంఉగాండా, ఉజ్బెకిస్థాన్ లను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానిస్తున్నాం.

వాతావరణ పరిరక్షణ నిధులపై బ్రిక్స్ దేశాధినేతల విధాన ప్రకటన, ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ విధివిధానాలపై బ్రిక్స్ దేశాధినేతల ప్రకటనలను అంగీకరించాల్సిన ఆవశ్యకతను మేం గుర్తిస్తున్నాం. అలాగేసామాజిక కారకాలున్న వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా బ్రిక్స్ భాగస్వామ్య ఏర్పాటును అంగీకరిస్తున్నాం. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలకు సమ్మిళిత, సుస్థిర పరిష్కారాలను పెంపొందించే దిశగా మా ఉమ్మడి ప్రయత్నాలను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.

బహుపాక్షిక వాదాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా విధాన సంస్కరణ

విస్తృతమైన సంప్రదింపులు, ఉమ్మడి సహకారం, ఉమ్మడి ప్రయోజనాల స్ఫూర్తితో- మరింత న్యాయబద్ధ, నిష్పక్షపాత, క్రియాశీల, ప్రభావవంతమైన, సమర్థ, సముచిత, ప్రాతినిధ్య, చట్టబద్ధ, ప్రజాస్వామ్య, జవాబుదారీ అంతర్జాతీయ- బహుపాక్షిక వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా విధానపరమైన సంస్కరణకు, దానిని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ మేరకు అంతర్జాతీయ డిజిటల్ ఒడంబడిక, భవిష్యత్ తరాల ప్రకటన అనే రెండు అనుబంధాలు సహా భవిష్యత్తులో నిర్ణయించబోయే ఒప్పందాలను మున్ముందు జరగబోయే శిఖరాగ్ర సదస్సుల్లో ఆమోదించాలని మేం నిర్ణయించాం. సమకాలీన వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా అంతర్జాతీయ సంబంధాల్లో ప్రస్తుత ధోరణులను సానుకూలంగా మలచుకోవాల్సిన ఆవశ్యకత దృష్ట్యా.. బహుపాక్షిక వాదాన్ని, అలాగే ఐక్య రాజ్య సమితి (ఐరాస) చార్టర్‌లో పొందుపరిచిన లక్ష్యాలు, సూత్రాలు సహా సంపూర్ణంగాను, పరస్పర అనుసంధానాలుగాను అంతర్జాతీయ చట్టాన్ని పాటించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. (అంతర్జాతీయ వ్యవస్థలో అనివార్య మూలాధారంగా, ఐరాస ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం, సుస్థిరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అందరికీ ప్రాథమిక స్వేచ్ఛలు లభించేలా ప్రోత్సహించి, పరిరక్షించడంతోపాటు సంఘీభావం, పరస్పర గౌరవం, న్యాయం, సమానత్వం ప్రాతిపదికలుగా సహకారాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా ఐరాసలో దేశాల నడుమ సహకారం ఉంటుంది). నూతనంగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు- అభివృద్ధి చెందుతున్న దేశాలు (ఈఎండీసీ), స్వల్పంగా అభివృద్ధి చెందిన దేశాలు (ఎల్‌డీసీ).. అందునా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు అంతర్జాతీయంగా నిర్ణయ స్వీకార ప్రక్రియలు, విధానాల్లో మరింత ఎక్కువ, అర్థవంతమైన భాగస్వామ్యాన్ని, ప్రాతినిధ్యాన్ని అందించడంతోపాటు.. ఆయా దేశాలు సమకాలీన యథార్థ పరిస్థితులకు మరింత అనుగుణంగా కొనసాగేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఐక్య రాజ్య సమితి సచివాలయం, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో అన్ని ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు సమాన ప్రాతినిధ్యాన్ని సాధించడంతోపాటు ఈ సంస్థల్లో నాయకత్వం, బాధ్యతలకు సంబంధించి అన్ని స్థాయుల్లో మహిళల పాత్ర, వాటాను.. అందునా కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మహిళల పాత్రను పెంచేలా మేం పిలుపునిచ్చాం. పారదర్శకత, సమ్మిళిత సూత్రాల నిర్దేశం మేరకు, ఐరాస చార్టర్‌లోని అధికరణ 101లోని అన్ని నిబంధనలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక అధిపతులు, సీనియర్ పదవుల ఎంపిక, నియామకాలు జరగాల్సిన ఆవశ్యకతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. వీలైనంత విస్తృతమైన భౌగోళిక ప్రాతిపదికన, మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఐరాస వ్యవస్థలోని సీనియర్ పదవులపై ఏ దేశానికీ లేదా దేశాల బృందానికీ గుత్తాధిపత్యం ఉండకూడదన్న సూత్రానికి కట్టుబడి ఉంటూ సిబ్బంది నియామక అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

2023 జోహన్నెస్‌బర్గ్-II నాయకుల ప్రకటనను గుర్తిస్తూ.. భద్రతా మండలి సహా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. దానిని మరింత ప్రజాస్వామికంగా, ప్రాతినిధ్యపూర్వకంగా, ప్రభావవంతంగా, సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు మండలి సభ్యత్వాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా సంస్కరణలు చేపట్టాలి. తద్వారా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై తగిన విధంగా ఐరాస ప్రతిస్పందించగలుగుతుంది. అలాగే బ్రిక్స్ దేశాలు సహా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల న్యాయబద్ధమైన ఆకాంక్షలకు మద్దతునిస్తూ.. అంతర్జాతీయ వ్యవహారాల్లో, అందునా ఐక్యరాజ్య సమితిలోనూ భద్రతా మండలిలోనూ అవి కీలక పాత్ర పోషించడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎజుల్విని ఏకాభిప్రాయం, సిర్టే డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా.. ఆఫ్రికా దేశాల న్యాయబద్ధమైన ఆకాంక్షలను మేం గుర్తిస్తాం. ఐక్యరాజ్యసమితి... భద్రతా మండలిలో తెచ్చే సంస్కరణలు అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని మరింత బలంగా వినిపించడానికి అవకాశమిస్తాయని మేం గట్టిగా చెప్తున్నాం. 2022 బీజింగ్, 2023 జోహన్నెస్బర్గ్-II నాయకుల ప్రకటనల నేపథ్యంలో... భద్రతా మండలి సహా ఐక్యరాజ్యసమితిలో మరింత కీలక పాత్ర పోషించాలన్న బ్రెజిల్, భారత్ ఆకాంక్షలకు- భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న చైనా, రష్యా తమ మద్దతును పునరుద్ఘాటించాయి.

ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా, ఐరాస సాధారణ సభ తీర్మానాలు 75/1, 77/335, సంబంధిత ఇతర తీర్మానాలను గుర్తుచేస్తూ.. ఐక్యరాజ్యసమితి తన విధులను నిర్వర్తించడానికి అవసరమైన మద్దతును అన్నివిధాలా అందించడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. కచ్చితమైన పురోగతిని సాధించే దిశగా ఐక్యరాజ్యసమితి ప్రధాన విభాగాల్లో సంస్కరణలు తేవాలని బలంగా పిలుపునిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణపై చర్చల్లో కొత్త జీవం పోసేందుకు, సాధారణ సభను పునరుజ్జీవింపజేసే దిశగా కృషి చేసేందుకు, ఆర్థిక-సామాజిక పరిషత్తును బలోపేతం చేసుకునేందుకు పునరంకితమవుతున్నాం. శాంతి స్థాపన వ్యవస్థ (పీస్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్)- 2025 సమీక్ష విజయవంతం కావాలని మేం ఆకాంక్షిస్తున్నాం.

బహుధృవ ప్రపంచంలోని ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, దేశాల మధ్య మరింత న్యాయబద్ధత, ప్రభుత్వాల విధానాల్లో సామ్యత, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాల దిశగా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు చర్చలు, సంప్రదింపులను ప్రోత్సహించేలా బలంగా కృషిచేయడం అత్యావశ్యకమని మేం అంగీకరిస్తున్నాం. ఈ బహుధృవ స్వభావం వల్ల కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు- అభివృద్ధి చెందుతున్న దేశాలు (ఈఎండీసీ) నిర్మాణాత్మక సమర్థతను పెంపొందించుకోవడానికి, అందరికీ ప్రయోజనకరంగా ఉండే సమ్మిళిత, సమాన ఆర్థిక ప్రపంచీకరణను, సహకారాన్ని పొందడానికి అవకాశం ఉన్నదని గుర్తిస్తున్నాం. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తీవ్రత, వేగవంతమవుతున్న ఆర్థిక క్షీణత, సాంకేతిక మార్పులు, రక్షణాత్మక చర్యలు, వలసల సవాళ్లు సహా గణనీయమైన అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలో... సానుకూల మార్పునకు చోదకశక్తిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని మేం విశ్వసిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలను, ప్రాధాన్యాలను బలంగా వినిపించడంలోనూ, అలాగే, మరింత న్యాయబద్ధమైన, సుస్థిర, సమ్మిళిత, ప్రాతినిధ్య, స్థిరమైన అంతర్జాతీయ క్రమాన్ని ప్రోత్సహించడంలోనూ బ్రిక్స్ కీలకపాత్రను కొనసాగిస్తుందని మేం విశ్వసిస్తున్నాం.

మానవాళికి, ముఖ్యంగా ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాటలకందని పెను విషాదాన్ని మిగిల్చిన రెండో ప్రపంచయుద్ధం ముగిసి 2025తో 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో...ఐక్యరాజ్యసమితి చేసిన సాధారణ సభ తీర్మానం 79/272కు మేం పూర్తిగా మద్దతిస్తున్నాం. ఈ చారిత్రక విషాదం అనంతర పరిస్థితులు.. తరువాతి తరాలను యుద్ధ విపత్తు నుంచి రక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు దారితీశాయి.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. బ్రిట్టన్ వుడ్స్ సంస్థల్లో (బీడబ్ల్యూఐ) సంస్కరణల తక్షణ ఆవశ్యకతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. వాటిని మరింత క్రియాశీలంగా, సమర్థంగా, విశ్వసనీయంగా సమ్మిళితంగా, ప్రయోజనకరంగా, నిష్పక్షపాతంగా, జవాబుదారీగా, ప్రాతినిధ్యపూర్వకంగా, చట్టబద్ధతను పెంచేలా వాటిలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముందు.. నెలకొల్పిన నాటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన విశేష మార్పులను ప్రతిబింబించేలా అవి తమ పాలన వ్యవస్థలను సంస్కరించుకోవాలి. బ్రిట్టన్ వుడ్స్ సంస్థల్లో కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు- అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల (ఈఎండీఈ) గళం, ప్రాతినిధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్రను పెంచేదిగా ఉండాలి. అంతేకాకుండా.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నాయకత్వంలో ప్రాంతీయ వైవిధ్యం, ఈఎండీఈల ప్రాతినిధ్యాన్ని పెంచేలా ప్రతిభ ఆధారిత, సమ్మిళిత ఎంపిక ప్రక్రియ ద్వారా, అలాగే నిర్వాహక స్థాయిలో మహిళల పాత్ర, భాగస్వామ్యాన్ని పెంచేలా మెరుగైన నిర్వహణ విధానాలకు మేం పిలుపునిస్తున్నాం.

అనిశ్చితి, అస్థిరత నెలకొన్న ప్రస్తుత నేపథ్యంలో.. అంతర్జాతీయ ఆర్థిక భద్రత వ్యవస్థ (జీఎఫ్ఎస్ఎన్) కేంద్ర స్థానంలోఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్తగిన వనరులతోక్రియాశీలంగా ఉండాలి. తద్వారా సభ్య దేశాలకు.. ముఖ్యంగా అత్యంత బలహీన దేశాలకు సమర్థంగా చేయూతనిచ్చేలా సంసిద్ధమై ఉండాలి. కోటా పునర్వ్యవస్థీకరణ లేనప్పటికీ, 16వ కోటాల సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) కింద ప్రతిపాదిత కోటా పెంపునకు సమ్మతి తెలిపాం. ఇంకా సమ్మతి తెలపని ఐఎంఎఫ్ సభ్య దేశాలు ఆలస్యం చేయకుండా అంగీకారం తెలపాలని, 16వ జీఆర్‌క్యూ కింద కోటా పెంపును అమలు చేయాలని కోరుతున్నాం. 17వ కోటా సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) కింద కొత్త కోటా సూత్రం సహా.. కోటా వాటా పునర్వ్యవస్థీకరణకు విధానాల రూపకల్పన కోసం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్దేశాన్ని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలిని కోరుతున్నాం. భవిష్యత్ చర్చలకు మార్గనిర్దేశం చేసే సాధారణ సూత్రాల రూపకల్పనలోనూఅలాగే కీలకమైన కోటావిధాన సంస్కరణల్లో అభిప్రాయ క్రోడీకరణలోనూ ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలికిఅంతర్జాతీయ ద్రవ్యఆర్థిక కమిటీ (ఐఎంఎఫ్‌సీ) ప్రతినిధులకూ మేం సహకరిస్తాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి స్థానాలను బట్టిఈఎండీఈల వాటాలు పెరగడాన్ని బట్టి.. ఐఎంఎఫ్‌లో కోటా పునర్వ్యవస్థీకరణ అన్నది అభివృద్ధి చెందుతున్న దేశాలను పణంగా పెట్టకూడదని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఐఎంఎఫ్ కోటాపరిపాలన సంస్కరణల కోసం బ్రిక్స్ రియో డి జనీరో లక్ష్యానికి అనుగుణంగా ఇతర ఐఎంఎఫ్ సభ్యులతో నిర్మాణాత్మకంగా చర్చించి అర్థవంతమైన కోటా వాటా పునర్వ్యవస్థీకరణపాలన సంస్కరణలను 17వ జీఆర్‌క్యూలో చేర్చేలా కృషి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, దానితోపాటు మెరుగైనపెద్దఅత్యంత ప్రభావవంతమైన అభివృద్ధి ఆర్థిక సంస్థగా ప్రపంచ బ్యాంకు గ్రూప్ చట్టబద్ధతను మెరుగుపరచడానికి- బ్రెజిల్ సహాధ్యక్షత వహించిన ప్రపంచ బ్యాంకు వాటాదారుల సమీక్ష-2025 కీలక సాధనమని పునరుద్ఘాటిస్తున్నాం. లిమా సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని మరింత బలంగా వినిపించడాన్నివాటి ప్రాతినిధ్యం పెరగడాన్ని మేం ఎప్పటికీ సమర్థిస్తాం. చరిత్రాత్మకంగా వారికి తక్కువ ప్రాతినిధ్యమే దక్కడందాన్ని సరిదిద్దేలా వాటాలను కలిగి ఉండడంలో పునర్వ్యవస్థీకరణ దీనికి ప్రాతిపదిక. వాతావరణ మార్పులుడిజిటలీకరణ సవాళ్ల నేపథ్యంలో.. ఉపాధి కల్పన సహా పేదరికం, అసమానతలను అధిగమించేందుకు కృషి చేయడం ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రధాన లక్ష్యంగా ఉంది.

బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ చాలా కాలంగా ఓ కూడలిలో ఉంది. విచక్షణారహితంగా టారిఫ్‌లు - ఇతర చర్యల రూపంలో, లేదా పర్యావరణ లక్ష్యాల ముసుగులో రక్షణాత్మక ధోరణుల వంటి వాణిజ్య నియంత్రణ చర్యలు పెరగడం అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని మరింత తగ్గించే ప్రమాదముంది. సరఫరా వ్యవస్థనూ ఇది దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికీ కారణమవుతుంది. ప్రస్తుత ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే, ప్రపంచ ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలనూ ప్రభావితం చేసే అవకాశముంది. వాణిజ్యాన్ని దెబ్బతీసే, డబ్ల్యూటీవో నియమాలకు విరుద్ధంగా ఉండే ఏకపక్ష సుంకాలు, ఇతర చర్యలు పెరుగుతుండడంపై మేం తీవ్ర ఆందోళనలను వ్యక్తపరుస్తునన్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కేంద్రంగా ఉండి, అభివృద్ధి చెందుతున్న దాని సభ్యదేశాలను ప్రత్యేకంగా, భిన్నంగా పరిగణించేలా (ఎస్‌డీటీ) నిబంధనల ఆధారిత, సార్వత్రిక, పారదర్శక, న్యాయబద్ధ, సమ్మిళిత, సమాన, వివక్షా రహిత, ఏకాభిప్రాయ ప్రాతిపదిక కలిగిన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. తగిన బాధ్యతలు, నైపుణ్యం, అందరికీ అందుబాటులో ఉండడంతోపాటు కొత్త వాణిజ్య నియమాలపై సంప్రదింపులు సహా వివిధ కోణాల్లో అంతర్జాతీయ వాణిజ్య చర్చలను ముందుండి నడిపే సమర్థత గల డబ్ల్యూటీవోనే ఏకైక బహుపాక్షి సంస్థగా ఉంటుందని ఆ సంస్థ 30వ వార్షికోత్సవం వేళ మేం ఉద్ఘాటిస్తున్నాం. డబ్ల్యూటీవో 12వ మంత్రుల సభ వాగ్దానాలను, అలాగే, ఈ బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ విశ్వసనీయతను పునరద్ధరించి, దాని ఔచిత్యాన్ని నిలబెట్టడం లక్ష్యంగా తగిన సంస్కరణల దిశగా కృషి చేయాలని డబ్ల్యూటీవో 13వ మంత్రుల సభలో పునరుద్ఘాటించిన విషయాన్ని మేం గుర్తు చేస్తున్నాం. అందుబాటులో ఉండేప్రభావవంతమైనపూర్తి స్థాయిలో పనిచేసేరెండంచెల డబ్ల్యూటీవో వివాద పరిష్కార వ్యవస్థ తక్షణ పునరుద్ధరణకు మేం కట్టుబడి ఉన్నాం. డబ్ల్యూటీవోలో సభ్యత్వం కోసం ఇథియోపియా, ఇరాన్‌ల ప్రయత్నాన్ని మేం గట్టిగా సమర్థిస్తున్నాం. డబ్ల్యూటీవో సంస్కరణలు, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ బలోపేతంపై వాణిజ్య మంత్రుల అంగీకారం పొందిన బ్రిక్స్ ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం.

అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష, బలవంతపు చర్యల అమలును మేం ఖండిస్తున్నాం. ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు, అనంతర ఆంక్షల రూపంలో అలాంటి చర్యలు లక్ష్యంగా చేసుకున్న దేశాల్లో సాధారణ ప్రజల అభివృద్ధిఆరోగ్యం, ఆహార భద్రత హక్కులు సహా మానవ హక్కులపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. పేదలను, దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిజిటల్ అంతరాలను, పర్యావరణ సవాళ్లను తీవ్రతరం చేస్తుంది. అంతర్జాతీయ చట్టాన్ని, ఐరాస చార్టర్ సూత్రాలు, ఉద్దేశాలను బలహీనపరిచే ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలను తొలగించాలని మేం పిలుపునిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన, ఐరాస భద్రతా మండలి అనుమతిలేని ఆంక్షలను బ్రిక్స్ సభ్య దేశాలు విధించవని, లేదా సమర్థించవని మేం పునరుద్ఘాటిస్తున్నాం.

 

 

 

ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లు, సరిహద్దులకు అతీతంగా వాటి వల్ల ఎదురయ్యే సమస్యల ప్రభావాన్ని గుర్తిస్తూ.. అంతర్జాతీయ సహకారం, సంఘీభావాన్ని పెంపొందించడం ద్వారా అంతర్జాతీయ ఆరోగ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ముఖ్యంగా సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు యూఎన్ వ్యవస్థలో అంతర్జాతీయ ఆరోగ్యంపై పర్యవేక్షణ, సమన్వయ అధికారం కలిగి ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రను మేం ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. అలాగే ఈ సంస్థ ఆదేశం, సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తున్నాం. ప్రస్తుత, భవిష్యత్ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి, అసమానతలను తగ్గించడానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఔషధాలు, టీకాలతో సహా అవసరమైన వైద్యసేవలు అందరికీ నిష్పక్షపాతంగా అందించడానికి విస్తృతమైన, సరిపడినన్ని నిధులు అందుబాటులో ఉన్న డబ్ల్యూహెచ్‌వో అవసరం. అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, సమానత్వాన్ని, సమ్మిళిత్వాన్ని, పారదర్శకతను, ప్రతిస్పందనను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంబంధమైన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఏ దేశమూ వెనకబడిపోకుండా తోడ్పాటు అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ద్వారా డబ్ల్యూహెచ్‌వో పాండమిక్ ఒప్పందం స్వీకరణకు మేం అంగీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, సురక్షితమైన, సమానత్వం సాధించిన ప్రపంచానికి ఈ ఒప్పందం బలమైన పునాదిని వేస్తుంది. పాథోజెన్ యాక్సిస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ ఒప్పందంపై అనుబంధ పత్రం కోసం సభ్యదేశాల నేతృత్వంలో జరుగుతున్న చర్చలు సకాలంలో ముగించడానికి ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం.

మరింత సంక్షేమం సాధించిన భవిష్యత్తు దిశగా అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను ముఖ్యమైన అవకాశంగా మేం పరిగణిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించేలా సంభావ్య ప్రమాదాలను తగ్గించి, గ్లోబల్ సౌత్‌తో సహా అన్ని దేశాల అవసరాలను ఏఐ గ్లోబల్ గవర్నెన్స్ పరిష్కరించాలని మేం స్పష్టం చేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామర్థ్య నిర్మాణంతో సహా సార్వభౌమ చట్టాలకు అనుగుణంగా, ఉమ్మడి విలువలను కొనసాగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, నమ్మకాన్ని పెంపొందించే, విస్తృతమైన, సమ్మిళిత అంతర్జాతీయ సహకారం, సౌలభ్యానికి హామీ ఇచ్చే ఏఐ గవర్నెన్స్‌ను ఏర్పాటు చేయడానికి ఐక్యరాజ్య సమితి కేంద్రంగా ప్రపంచ సమష్టి కృషి అవసరం. మరింత సమతౌల్య విధానం దిశగా నిర్మాణాత్మక చర్చకు మద్ధతిచ్చేలా.. గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై బ్రిక్స్ నాయకుల ప్రకటనకు మేం అంగీకరించాం. ఇది జాతీయ నియంత్రణ చట్టాలు, యూఎన్ చార్టర్ నియమాలకు అనుగుణంగా, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ.. సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ఏఐ సాంకేతికతల బాధ్యాతయుతమైన అభివృద్ధి, విస్తరణ, వినియోగాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

శాంతి, భద్రత, అంతర్జాతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం

ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత, విచ్ఛిన్న పరిస్థితులపై మా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించడానికి ఆటంకం కలిగించేలా అంతర్జాతీయంగా సైనిక వ్యయంలో గణనీయంగా పెరుగుదల కనిపించిన ప్రస్తుత ధోరణి పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. సమగ్రాభివృద్ధి, ఆకలి, పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్పందనకు సహకారం సహా కీలకమైన ప్రపంచ అంశాలపై వివిధ దేశాల దృక్పథాలు, అభిప్రాయాలను గౌరవించేలా బహుపాక్షిక విధానాన్ని మేం సమర్థిస్తున్నాం. అదే సమయంలో భద్రతను వాతావరణ మార్పుల అజెండాతో అనుసంధానించే ప్రయత్నాల పట్ల కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.

ప్రస్తుత ప్రపంచంలో అస్థిరత, అపనమ్మకం నేపథ్యాన్ని మేం గమనించాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతను బలోపేతం చేయడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నాం. సంఘర్షణల తీవ్రతను తగ్గించడానికి రాజకీయ-దౌత్యపరమైన చర్యల ద్వారా ఈ సవాళ్లు, వాటికి అనుబంధంగా ఉన్న భద్రతా ముప్పులపై ప్రతిస్పందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నాం. అలాగే మూల కారణాలతో సహా సంఘర్షణలను పరిష్కరించేందుకు నివారణా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాం. అన్ని దేశాల మధ్య భద్రత విడదీయరాని అంశమని స్పష్టం చేస్తున్నాం. అలాగే చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. సంక్షోభాల నివారణకు, వాటిని పరిష్కరించడానికి ప్రాంతీయ సంస్థలు చురుకైన పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తున్నాం. సంక్షోభాల సమయంలో శాంతిని పునరుద్ధరించేందుకు చేపట్టే అన్ని సహాయక ప్రయత్నాలకు మద్దతు అందిస్తాం. యూఎన్ చార్టర్ ప్రయోజనాలు, నియమాలకు అనుగుణంగా.. సంక్షోభాలను నివారించడానికి, అవి విస్తరించకుండా చూడటానికి అవసరమైన సాధనాలుగా మధ్యవర్తిత్వం, నివారణ దౌత్యం ప్రాధాన్యాన్ని మేం తెలియజేస్తున్నాం. ఈ విషయంలో సాయుధ సంఘర్షణల నివారణ, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి మద్దతు కార్యకలాపాలు, మధ్యవర్తిత్వం, శాంతి ప్రక్రియల్లో సహకారానికున్న అవకాశాలను అన్వేషించడానికి మేం అంగీకరించాం.

ప్రపంచవ్యాప్తంగా మానవతా సంక్షోభాలను పరిష్కరించేలా బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, మా దృఢమైన అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తూ, అంతర్జాతీయంగా ప్రతిస్పందన తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ స్పందన ఇప్పటికే చాలా తక్కువగా, విచ్ఛినమై, తరచూ రాజకీయమవుతోంది. పౌరులు, మౌలికవసతులతో సహా ప్రజల ఆస్తులపై దాడులు, మానవతా సాయాన్ని అడ్డుకోవడం, మానవతా సహాయ సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడంతో సహా అంతర్జాతీయ మానవతా చట్టం ఉల్లంఘనలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ మానవతా చట్టం విషయంలో జరిగిన అన్ని ఉల్లంఘనలను జవాబుదారీతనంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని మేం స్పష్టం చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టానికి జరిగే ఉల్లంఘనలు.. ఇబ్బందులను తీవ్రతరం చేయడమే కాకుండా.. సంక్షోభానంతరం చేపట్టే పునరుద్ధరణకు అవసరమైన భౌతిక, సామాజిక పునాదులను నాశనం చేసి శాంతిని కొనసాగించే అవకాశాలను దెబ్బతీస్తాయి. అంతర్జాతీయ మానవతా చట్టం పట్ల గౌరవం, అంగీకారం, సమర్థవంతమైన అమలు కోసం బ్రిక్స్ సభ్యదేశాలు చేపట్టే అంతర్జాతీయ చర్యలను మేం గుర్తించాం.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1325 (2000), 25వ వార్షికోత్సవం నేపథ్యంలో మహిళలు, శాంతి, భద్రత (డబ్ల్యూపీఎస్) అజెండాను పూర్తిగా అమలు చేయడంలో, దీనిని ముందుకు తీసుకెళ్లడంలో మా చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాం. సంఘర్షణ నివారణ, పరిష్కారం, మానవతా సాయం, మధ్యవర్తిత్వం, శాంతి కార్యకలాపాలు, శాంతి నిర్మాణం, సంక్షోభానంతరం చేపట్టే పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో సహా శాంతిభద్రతల ప్రక్రియల్లో అన్ని దశల్లోనూ తీసుకొనే నిర్ణయాల్లో మహిళలకు సంపూర్ణంగా, సమానంగా, సురక్షితమైన, అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాల్సిన ప్రాధాన్యాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం.

అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘిస్తూ.. 2025 జూన్, 13 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను మేం ఖండిస్తున్నాం. అలాగే మధ్యప్రాచ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత ఐఏఈఐ తీర్మానాలను ఉల్లంఘించి, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) రక్షణలో ఉండే ప్రజా మౌలిక వసతులు, శాంతియుత అణు సౌకర్యాలపై ఉద్దేశపూర్వక దాడుల పట్ల మేం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. సాయుధ యుద్ధాలతో సహా అన్ని సమయాల్లోనూ ప్రజలు, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా అణు వ్యవస్థల రక్షణ, భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఈ సందర్భంగా.. ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా దౌత్యపరమైన చర్యలకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం.

ఉక్రెయిన్ సంఘర్షణపై యూఎన్ భద్రతామండలి, యూఎన్ జనరల్ అసెంబ్లీతో సహా సముచిత వేదికల్లో వ్యక్తం చేసిన మా దేశాల వైఖరిని మేం గుర్తు చేసుకుంటున్నాం. చర్యలు, దౌత్యం ద్వారా ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికన్ పీస్ ఇనీషియేటివ్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫర్ పీస్ ఏర్పాటుతో సహా మధ్యవర్తిత్వం, వివాద పరిష్కార ప్రతిపాదనలను మేం ప్రశంసిస్తున్నాం. ప్రస్తుత ప్రయత్నాలు సుస్థిర శాంతిని సాధిస్తాయని మేం ఆశిస్తున్నాం.

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా (ఎంఈఎన్ఏ) ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణలు, అస్థిరతపై మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయంలో, 2025, మార్చి 28న జరిగిన సమావేశంలో బ్రిక్స్ విదేశాంగ ఉప మంత్రులు, ప్రత్యేక రాయబారుల సంయుక్త ప్రకటనను మేం సమర్థిస్తున్నాం.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉండటం, అంతర్జాతీయ మానవతా సాయం చేరుకోకుండా అడ్డుకుంటూ ఉండటంతో ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో నెలకొన్న పరిస్థితులపై మా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను ముఖ్యంగా అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని అనుసరించాలని పిలుపునిస్తున్నాం. యుద్ధ సాధనంగా ఆకలిని ఎంచుకోవడంతో సహా అన్ని ఐహెచ్ఎల్ ఉల్లంఘనలను ఖండిస్తున్నాం. అలాగే మానవతా సాయాన్ని రాజకీయం చేసే లేదా సైనికీకరణ చేసే ప్రయత్నాలను కూడా ఖండిస్తున్నాం. తక్షణమే, శాశ్వతమైన, బేషరతుగా కాల్పుల విరమణ సాధించడానికి, గాజా స్ట్రిప్‌తో సహా పాలస్తీనాలో ఆక్రమించిన అన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్భందించిన ఖైదీలను విడుదల చేయడానికి, మానవతాసాయాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండా అందించడానికి చేపట్టే తదుపరి చర్చల్లో చిత్తశుద్ధితో పాల్గొనాలని అన్ని పక్షాలను కోరుతున్నాం. యూఎన్ఆర్‌డబ్ల్యూఏకు స్థిరమైన మద్దతు అందించి, అయిదు రకాల కార్యకలాపాల్లో పాలస్తీనా శరణార్థులకు ప్రాథమిక సేవలు అందించాలనే యూఎన్‌జీఏ నిబంధనను గౌరవించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టం ప్రకారం తమ బాధ్యతలను గౌరవించాలని, పరిస్థితులను తీవ్రం చేసే, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా సంయమనం పాటించాలని సంబంధిత పక్షాలకు పిలుపునిస్తున్నాం. ఈ అంశంలో ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా చేపట్టిన చట్టపరమైన ప్రయత్నాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకున్న తాత్కాలిక చర్యలను మేం గమనించాం. ఇది గాజాలో మానవతా సాయం అందించడంలో ఇజ్రాయెల్‌కున్న చట్టబద్ధమైన బాధ్యతను తెలియజెప్పింది.

ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో గాజా స్ట్రిప్ విడదీయలేని భాగమని మేం స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను పాలస్తీనా అధికార పరిధిలోకి తీసుకురావాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాం. అలాగే స్వతంత్ర దేశంగా పాలస్తీనాకు ఉండే హక్కుతో సహా పాలస్తీనా ప్రజల స్వీయ నిర్ణయాధికార హక్కును పునరుద్ఘాటిస్తున్నాం.

2025 మార్చి 4న పాలస్తీనా అంశంపై జరిగిన అత్యవసర అరబ్ సదస్సులో అంగీకరించినట్టుగా స్వాతంత్ర్యం, రాజ్యాధికారం కోసం ఉండాలన్న పాలస్తీనియన్ల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి, ఈ ప్రాంతంలో ఆ దేశ ప్రజలే కేంద్రంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల పుననర్నిర్మాణానికి సహకరించాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నాం. అలాగే కైరోలో ప్లెడ్జింగ్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయడానికి తీసుకున్న చొరవను ప్రశంసిస్తున్నాం. గాజాను స్థిరీకరించడానికి, పునర్నిర్మించడానికి చేసే ప్రయత్నాలు దీర్ఘకాలిక సంఘర్షణలకు న్యాయమైన, శాశ్వతమైన రాజకీయ పరిష్కారంతో పాటు కొనసాగాలని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఆ దేశ జనాభాను ఏ పరిస్థితుల్లోనైనా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బలవంతంగా తరలించడం, అలాగే గాజా స్ట్రిప్‌లోని భౌగోళిక లేదా జనాభా మార్పుల విషయంలో మేం తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాం. ఈ ఆక్రమణకు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ న్యాయ సంస్థలు ముగింపు పలకాలని, చట్టపరమైన సూత్రాలను బలహీనపరిచే, న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతికి ఆటకం కలిగించే అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నాం.ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సముచితమైన, శాశ్వతమైన పరిష్కారం శాంతి ప్రయత్నాల ద్వారానే సాధ్యమవుతుందని, అది స్వీయ నిర్ణయాధికారం, తిరిగి పొందే హక్కులతో సహా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన హక్కుల సాధనపై ఆధారపడి ఉటుందని పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, సంబంధిత యూఎన్ భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ తీర్మానాలు, అరబ్ శాంతి చొరవతో సహా రెండు దేశాల సమస్య పరిష్కారానికి చూపిస్తున్న నిబద్ధత నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా దేశానికి, పూర్తి సభ్యత్వం కోసం మా మద్దతును తెలియజేస్తున్నాం. దీనిలో 1967 అంతర్జాతీయ సరిహద్దుల్లో సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణాత్మకమైన పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయడం, తూర్పు జెరూసలేం రాజధానిగా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకుతో సహా రెండు రాష్ట్రాలు పరస్పరం శాంతిభద్రతలతో పొరుగు దేశాలుగా జీవించాలనే లక్ష్యం కూడా ఉంది. బహుపాక్షిక ఆర్థిక సంస్థలతో సహా సంబంధిత అంతర్జాతీయ సంస్థల్లో పాలస్తీనాకు తగినంత ప్రాతినిధ్యం, వాటి వనరులు పొందే అవసరాన్ని ధ్రువీకరిస్తున్నాం. మానవతా సాయాన్ని వేగంగా అందించడానికి, ఈ ప్రాంతంలో శాశ్వతమైన, స్థిరమైన శాంతిని సాధించడానికి తక్షణ కాల్పుల విరమణ కోసం బ్రిక్స్ సభ్య దేశాల ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం.

లెబనాన్లో కాల్పుల విరమణను మేం స్వాగతిస్తున్నాం. అలాగే ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, యూఎన్ఎస్‌సీ తీర్మానం 1701ను పూర్తిగా అమలు చేయాలని అన్ని పక్షాలకు పిలుపునిస్తున్నాం. కాల్పుల విరమణను, లెబనాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పదేపదే ఉల్లంఘించడాన్ని మేం ఖండిస్తున్నాం. లెబనీస్ ప్రభుత్వంతో అంగీకరించిన నిబంధనలను గౌరవించాలని, దక్షిణ లెబనాన్‌లో అయిదు ప్రాంతాలతో సహా లెబనాన్ మొత్తం భూభాగం నుంచి ఆక్రమిత దళాలను ఉపసంహరించాలని ఇజ్రాయెల్‌ను కోరుతున్నాం.

సిరియా సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.భద్రతా మండలి తీర్మానం 2254 (2015) సూత్రాల ఆధారంగా, ఎలాంటి వివక్ష లేకుండా, పౌరుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించే శాంతియుతమైన, సమ్మిళితమైన సిరియా నేతృత్వం, ఆధీనంలోని యూఎన్ (1) సులభతరం చేసిన రాజకీయ ప్రక్రియకు పిలుపునిస్తున్నాం. సిరియాలోని వివిధ ప్రావిన్సుల్లో, సమాజాల్లో కొనసాగుతున్న ఐఎస్ఐఎల్ (దాయిష్), అల్-ఖైయిదా అనుబంధ ఉగ్రసంస్థల కార్యకలాపాలను ఖండిస్తున్నాం. ఇటీవల మార్ ఎలియాస్ చర్చి, రిఫ్ డిమాష్క్‌ల్లో జరిగిన బాంబు దాడులను ఖండిస్తూ.. ఈ ఉగ్రదాడుల బాధితుల కుటుంబాలకు సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాం. సిరియన్ భూభాగంలో విదేశీ ఉగ్రవాదుల ఉనికి వల్ల ఎదురయ్యే ముప్పును, సిరియా నుంచి ప్రాంతీయ దేశాలకు ఉగ్రవాదులు విస్తరించే ప్రమాదాన్ని గర్హిస్తున్నాం. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని సిరియా తీవ్రంగా వ్యతిరేకించాలి. అలాగే ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ సమాజానికున్న ఆందోళనలకు స్పందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. సిరియాపై విధించిన ఏకపక్ష ఆంక్షలను ఎత్తివేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది సిరియన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, అభివృద్ధిని, స్థిరత్వాన్ని పెంపొందించేలా పునర్నిర్మాణ దశను ప్రారంభించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని, 1974 ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ సిరియాలో కొన్ని ప్రాంతాల ఆక్రమణను ఖండిస్తూనే.. సిరియా భూభాగం నుంచి తన సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరుతున్నాం.

‘ఆఫ్రికా సమస్యలకు ఆఫ్రికాయే సమాధానాలు కనుగొనాలి’’ అనే సిద్దాంతమే  ఆఫ్రికా ఖండంలోని ఉద్రిక్తతల పరిష్కారానికి ఒక ప్రాతిపదికగా ఎల్లప్పటిికీ నిలవాలి అని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఉద్రిక్తత నివారణ, నిర్వహణలతో పాటు దానికి పరిష్కారాన్ని కనుగొనడంలో ఆఫ్రికా యూనియన్ పోషించిన కీలక పాత్రను మేం గుర్తిస్తున్నాం. దీంతో పాటు ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా యూనియన్ చేస్తున్న శాంతి ప్రధానమైన కృషి ఒక్కటే కాకుండా, ఈ దిశగా ఆఫ్రికాకు చెందిన ఉప ప్రాంతీయ సంస్థలు కూడా చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ఈ  విషయంలో, ఆఫ్రికా యూనియన్ శాంతి ప్రోత్సాహక కార్యకలాపాలు, మధ్యవర్తిత్వ యత్నాలు, శాంతి నెలకొల్పే ధ్యేయంతో అనుసరిస్తున్న ప్రక్రియలు, ఇతరత్రా కార్యక్రమాల్లో కొత్త కొత్త  మార్గాల్ని అన్వేషించడానికి మేం కట్టుబడి ఉన్నాం.

దీర్ఘకాలిక శాంతి, సుస్థిరాభివృద్ధిల వైపు అడుగులు  వేయాలని ఆఫ్రికా దేశాలు, సంస్థలు నడుంకట్టి సాగిస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రయత్నాల్లో భాగంగా అవి సాధిస్తున్న విజయాలను మేం ప్రశంసిస్తున్నాం. అదే సమయంలో, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో.. మరీముఖ్యంగా సూడాన్, గ్రేట్ లేక్స్ ప్రాంతం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాల్లో చాలా కాలంగా ఎడతెగక సాగుతున్న సంఘర్షణలకు తోడు కొత్త సంఘర్షణలు తలెత్తుతున్న ఫలితంగా తీవ్ర మానవీయ సంక్షోభాలు ఏర్పడుతుండడం పట్ల మేం తీవ్ర ఆందోళనతో ఉన్నాం. ఈ  సంక్షోభాలకు రాజకీయపరమైన పరిష్కారాలను కనుగొనడానికి చేసిన ప్రయత్నాలను ఎప్పటిలాగానే మా మద్దతు ఉంటుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. శత్రుత్వాలకు స్వస్తి పలకాలని, వైరాలకు ఒక శాంతియుత  పరిష్కారాన్ని వెతకడం అవసరమని మేం స్పష్టం చేస్తున్నాం.     

సూడాన్‌లో ఏర్పడ్డ స్థితిని గమనించి మేం తీవ్రంగా బాధపడుతున్నాం. ఈ స్థితి మానవీయ సంక్షోభానికి దారితీయడంతో పాటు ఉగ్రవాదం, అతివాదం పెచ్చుపెరుతుతున్న మరో ప్రమాదాన్ని కూడా వెంటబెట్టుకు వస్తోంది. ఈ విషయంలో మేం మా వైఖరులను మరో సారి విడమరచి చెబుతున్నాం. బేషరతుగా కాల్పుల విరమణకు సిద్ధపడి సంఘర్షణకు సత్వర, శాశ్వత, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని పిలుపునిస్తున్నాం. సూడాన్ ప్రజానీకంతో పాటు ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఎలాంటి ఆంక్షలూ ఉండని, నిరంతర ప్రాతిపదిక కలిగి ఉండే, తక్షణ, మానవతా పూర్వక సహాయాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని కూడా మేం ప్రధానంగా చెబుతున్నాం.

 హైతీలో భద్రత, మానవీయ, ఆర్థిక స్థితిగతులు నానాటికీ దిగజారుతున్నందుకు మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. భద్రత, అభివృద్ధి చెట్టపట్టాల్ వేసుకొని నడుస్తాయని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ప్రస్తుత సంక్షోభానికి హైతీ నాయకత్వంలో ఒక పరిష్కారం లభించాల్సిన అవసరం ఉంది. ఈ పరిష్కారంలో స్థానిక రాజకీయ పార్టీలు, సంస్థలతో పాటు సమాజం.. వీటి మధ్య జాతీయ చర్చ, ఏకాభిప్రాయ సాధనకు అవకాశం ఉండాలి. ముఠాల భరతం పట్టి, భద్రత పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు దేశంలో దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక ప్రగతికి పునాది వేసే దిశలో హైతీ ప్రయత్నాలకు మద్దతివ్వాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేం ఐక్యరాజ్యసమితి పోషిస్తున్న పాత్రకు మా మద్దతును తెలియజేస్తున్నాం. హైతీలో బహుముఖీన సంక్షోభాలను సమర్ధంగా పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చాటిచెబుతున్నాం.

 

ఉగ్రవాద చేష్టలు.. వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏదయినా, అలాంటి పనులు ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎవరు అలాంటి దుశ్చేష్టలకు ఒడిగట్టినా సరే.. అవి నేరపూర్వక కృత్యాలు, అహేతుకమైనవేనంటూ వాటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.  గత ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని మేం అత్యంత తీవ్ర పదజాలంతో ఖండిస్తున్నాం. ఆ దాడి 26 మంది ప్రాణాలను బలిగొంది. అంతేకాక ఆ దాడిలో అనేక మంది గాయాల పాలయ్యారు. ఉగ్రవాదంపైనా, దాని అన్ని రూపాలు, అభివ్యక్తీకరణలపైనా పోరాడాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ వ్యవహారంలో సరిహద్దు అవతలి నుంచి టెర్రరిస్టులు చొరబడడం, ఉగ్రవాదానికి కొమ్ముకాస్తూ నిధులు అందించడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించడం.. వీటన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకొంటాం. ఉగ్రవాదాన్ని ఏ ధర్మంతోను, ఏ జాతీయతతోను, నాగరికతతోను, లేదా జాతీయ సమూహంతోను ముడిపెట్టి చూడకూడదని మేం పునరుద్ఘాటిస్తున్నాం. తీవ్రవాదులకు సాయపడుతుంటే అలాంటి వారిని జవాబుదారుగా చేసితీరాలని, ఈ విషయంలో ఆయా దేశాల్లోని చట్టాలు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని మేం విస్పష్టంగా చెబుతున్నాం. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించకూడదని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండు రకాల ప్రమాణాలను అనుసరించడాన్ని తిరస్కరించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్ని దేశాల ప్రాథమిక బాధ్యత అని మేం స్పష్టం చేస్తున్నాం. ఉగ్రవాదుల బెదిరింపులను అడ్డుకొనేందుకు, వారితో పోరాడేందుకు ప్రపంచ  దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఐక్యరాజ్యసమితి నియమావళి, ప్రత్యేకించి దీని ఉద్దేశాలు, సిద్ధాంతాలతో పాటు సంబంధిత అంతర్జాతీయ సమావేశాలు, ప్రోటోకాల్స్, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, అంతర్జాతీయ శరణార్థుల చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం.. వీటిలో ఏది వర్తిస్తున్నా.. వీటితో పాటు అంతర్జాతీయ చట్టం ప్రకారం తమ తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని కోరుతున్నాం. మేం బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వ్యూహం, బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యాచరణ ప్రణాళిక, సీటీడబ్ల్యూజీ స్థితి పత్రం.. వీటిపై ఆధారపడ్డ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యాచరణ బృందం (సీటీడబ్ల్యూజీ), దాని అయిదు ఉప సమూహాల కార్యకలాపాలను స్వాగతిస్తున్నాం. ఉగ్రదాదాన్ని ఎదుర్కొనే అంశంలో సహకారాన్ని మరింత విస్తృతపరుచుకోవాలని ఆశిస్తున్నాం. మేం ఐరాస ఫ్రేంవర్క్‌ పరిధిలో ‘కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజమ్’ను వీలయినంత త్వరగా ఖరారు చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఐరాస గుర్తించిన అతివాదులు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం.

రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన బ్రాన్స్‌క్, కుర్‌స్క్, వొరోనిశ్ ప్రాంతాల్లో మే 31, జూన్ 1, 5 తేదీల్లో ఉద్దేశపూర్వకంగా పౌరులనే లక్ష్యంగా చేసుకొని వంతెనలు, రైల్వే సదుపాయాలపైన జరిపిన దాడుల్ని మేం తీవ్రాతితీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడుల్లో చిన్న పిల్లలు సహా అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

 

నగదు అక్రమ చెలామణీతో పాటు ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడం సహా న్యాయవిరుద్ధంగా డబ్బు అందజేత సమస్యపై పోరాడాలని, ఈ  సమస్యను ఎదుర్కొని తీరాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఈ  మా కృషిలో ఉగ్రవాదానికి, అతివాద భావజాల వ్యాప్తికి నిధులను సమకూర్చడం, మత్తు మందుల చట్టవిరుద్ధ రవాణా, సైబర్ నేరాలు, పర్యావరణానికి హాని చేసే నేరాలు, ఆయుధాల దొంగరవాణా, మనుషులను చట్టవిరుద్ధ పద్ధతిలో తరలించడం, అవినీతి, ముఖ్యంగా ఉగ్రవాద సంబంధిత ప్రయోజనాలను నెరవేర్చడానికి క్రిప్టోకరెన్సీలు సహా కొత్త కొత్త సాంకేతికతలను వినియోగించడం, ఇతరత్రా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల తాలూకు అన్ని రూపాలపైనా మేం పోరాటాన్ని కొనసాగిస్తాం.  ఈ విషయంలో, మేం సంబంధిత అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రత్యేకించి లెక్కలోకి తీసుకొని సామర్థ్యాలను పెంచడం, సాంకేతికంగా  అవసరమైన  సహాయాన్ని అందించడానికి పెద్ద పీట వేయదలచాం. మేం ఆర్థిక దర్యాప్తు ముఖ్యోద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో నేరాల నిరోధమే ప్రధానంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సాంకేతిక, రాజకీయేతర స్వభావం కలిగి ఉండే సిద్ధాంతాలను అవలంబించడానికి  కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. మేం సంబంధిత బ్రిక్స్ కార్యాచరణ బృందాలు, బ్రిక్స్ దేశాల సాధికారుల (కాంపిటెంట్ అథారిటీస్) సమావేశాలతో పాటు బ్రిక్స్‌లో ఆమోదించిన దస్తావేజుల ఆధారంగా అందజేసుకొనే సహకారాన్ని.. ఆ సహకారం తాలూకు ఇతర రూపాలు సహా, తదనుగుణంగా వర్తించే అంతర్జాతీయ చట్టాల (ఈ చట్టాలను అమలుచేయడానికి బ్రిక్స్ దేశాలు సమ్మతించాయి) సాయంతో.. మరింత పటిష్ఠపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.  మేం యువతరానికి భద్రతతో కూడిన అభివృద్ధిని అందించడానికి అనువైన పరిస్థితులను నెలకొల్పడానికి, వారు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడడానికి ప్రాధాన్యాన్నివ్వాలని స్పష్టం చేస్తున్నాం. ఈ దిశగా యువజనుల భాగస్వామ్యంతో తగిన అంతర్జాతీయ ప్రాజెక్టులను అమలుచేయడాన్ని స్వాగతిస్తున్నాం.

 మేం ఈ విషయంలో సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రత్యేకించి అవినీతికి వ్యతిరేకంగా ఐరాస సమావేశానికి అనుగుణంగా అవినీతిపై పోరాటం చేయడం, దానికి వ్యతిరేకంగా జరిపే పోరులో బ్రిక్స్ సహకారాన్ని పెంపొందించాలని సంకల్పం చెప్పుకొన్నాం. అంతర్జాతీయ అవినీతి నిరోధక అజెండాలోని ప్రధాన అంశాలపై మా సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించుకొన్నాం.  అవినీతి నిరోధం వ్యవహారంలో బ్రిక్స్ వాగ్దానాలను నెరవేర్చాలని, అవినీతి నిరోధక సహకారాన్ని ఇప్పటి కంటే పెంచుకోవాలని, అవినీతికర మార్గాల్లో సమకూర్చుకొన్న ఆస్తులను, ఆదాయాన్ని రికవరీ చేసి వాపసు చేయడంపై శ్రద్ధ తీసుకోవాలని సంకల్పించాం. అవినీతి నిరోధ వ్యవహారాల్లో సహకారాన్ని ప్రోత్సహించుకోవడం కోసం బ్రిక్స్ యాంటి-కరప్షన్ వర్కింగ్ గ్రూపు సాగిస్తున్న కృషిని మేం స్వాగతిస్తున్నాం. విశేషించి అవినీతి నిరోధ ప్రధాన సమాచారాన్ని, దీనిలో సాధించిన ప్రావీణ్యాన్ని దేశాలు పరస్పరం పంచుకోవాలని తీర్మానించుకున్నాం. దీనిలో బ్రిక్స్ ఉమ్మడి దార్శనిక పత్రాన్ని రూపొందించడం, అవినీతి నిరోధ సహకారం, అవినీతి  సొమ్ము, ఆస్తుల రికవరీ, వాపసు అంశాలపై ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ, సురక్షిత ఆశ్రయ స్థావరాలను నిరాకరించడంతో పాటు సభ్య దేశాల మధ్య సామర్థ్యాల  పెంపును పటిష్ఠపరచడం వంటి చర్యలు కూడా కలిసి ఉన్నాయి.

అణ్వాయుధాల ప్రమాదం పొంచి ఉండడం, సంఘర్షణలు.. వీటి రిస్కులు అంతకంతకు పెరుగుతున్న ధోరణి విషయంలోనూ మేం మా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం.  నిరాయుధీకరణ, ఆయుధాల నియంత్రణ, పరమాణు ఆయుధ రాశి మరింత విస్తరించకుండా చూడడం.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం. ప్రపంచ దేశాలకు స్థిరత్వాన్ని, అంతర్జాతీయ శాంతిని సాధించాలంటే దీని సమగ్రతను, ప్రభావశీలత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతయినా ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. మేం పరమాణు ఆయుధాల జాడ ఉండని ప్రాంతాల ఏర్పాటును బలపరచడంలో ‘న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ రెజీమ్’ ముఖ్య తోడ్పాటును అందించాలని స్పష్టం చేస్తున్నాం. మేం ప్రస్తుతం పరమాణు అస్త్రాల ఆనవాలు లేని ప్రాంతాల విషయంలోను, పరమాణు ఆయుధాల ఉపయోగం లేదా అలాంటి ఆయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడాన్ని వ్యతిరేకిస్తూ వాటికి సంబంధించిన హామీల పట్ల మా మద్దతును, గౌరవాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. మధ్య ప్రాచ్యంలో పరమాణు ఆయుధాలు,  సామూహిక విధ్వంసానికి దారితీసే ఇతర ఆయుధాల జాడలే ఉండని ప్రాంతాల ఏర్పాటు ప్రతిపాదనల కార్యాచరణను వేగవంతం చేసే దిశగా సాగే ప్రయత్నాలకు అత్యంత అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలని మేం అంగీకరిస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో ఐరాస సాధారణ సభ (యూఎన్‌జీఏ) తీసుకున్న 73/546వ నిర్ణయానికి అనుగుణంగా నిర్వహించిన సమావేశం కూడా ఓ భాగంగా ఉంది. ఈ సమావేశంలో సద్భావనతో పాల్గొనాల్సిందిగాను, ఈ కృషికి ఫలప్రద తోడ్పాటును అందించాల్సిందిగాను ఆహ్వానించిన పక్షాలన్నిటికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం.  మేం ‘‘పరమాణు ఆయుధాల జాడే ఉండని క్షేత్రాలకు సంబంధించిన అన్ని అంశాలపైనా సమగ్ర అధ్యయనం’’ పేరిట ఐరాస సాధారణ సభ చేసిన 79/241వ తీర్మానం ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నాం.

అంతరిక్ష వ్యవస్థలను,  అలాగే అంతరిక్ష శాస్త్ర, సాంకేతికతల విజయాలను శాంతియుత  ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. ప్రపంచ భద్రత కోసం చర్చల ద్వారా చట్టపరమైన బహుపాక్షిక విధానాన్ని స్వీకరించడం సహా బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక సుస్థిరతకు, బాహ్య అంతరిక్షంలో ఆయుధ పోటీని (పిఎఆర్ఒఎస్),  ఆయుధీకరణను నిరోధించడానికి, అలాగే అంతరిక్షంలోకి పంపిన వస్తువులకు బెదిరింపులు లేదా బల ప్రయోగాన్ని అడ్డుకోవడానికి  మా మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం.  అంతరిక్షంలో ఆయుధాల మోహరింపును నివారించడానికి,  అంతరింక్షం లోని వస్తువులకు ముప్పు లేదా బలప్రయోగాన్ని అరికట్టడానికి నవీకరించిన ముసాయిదా ఒప్పందాన్ని (పీపీడబ్ల్యూటీ)  2014లో జరిగిన నిరాయుధీకరణ సదస్సుకు సమర్పించడాన్ని ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తిస్తున్నాం. పారదర్శకత, నమ్మకాన్ని పెంచడం వంటి (టీసీబీఎంఎస్) చర్యలు,  ఆచరణాత్మకమైన,  అయినా చట్టపరంగా బలవంతం లేని కట్టుబాట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నియమ నిబంధనలు, సూత్రాలు కూడా అంతరిక్షంలో ఆయుధ పోటీని  నివారించడంలో తోడ్పడగలవని మేం స్పష్టం చేస్తున్నాం.  ఆయుధ పోటీ నివారణకు చట్టబద్ధమైన వ్యవస్థపై గణనీయమైన అంశాలతో సహా, ఇప్పటికే ఉన్న విజయాల ఆధారంగా, అటువంటి ప్రయోజనాన్ని అందించే సుసంఘటిత, సమగ్రమైన,  ప్రభావవంతమైన చర్చలను ప్రారంభించడానికి అందరికీ అందుబాటులో ఉండే అధ్యయన బృందాన్ని (ఓపెన్ ఎండెడ్ వర్కింగ్ గ్రూప్)  ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో కొన్ని బ్రిక్స్ సభ్య దేశాలు చేసిన ప్రతిపాదనను మేం గుర్తించాం. ఈ ప్రక్రియలో నిర్మాణాత్మకంగా పాలుపంచుకోవడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం.

 

దేశాలలోనూ, దేశాల మధ్య పెరుగుతున్న డిజిటల్ వ్యత్యాసాలను తగ్గించడంలో సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికతల (ఐసీటీ) సామర్థ్యాన్ని అంగీకరిస్తున్నాం. అలాగే డిజిటల్ రంగం నుంచి,  డిజిటల్ రంగం లోపల ఉత్పన్నమయ్యే సవాళ్లు, ముప్పులను కూడా గుర్తించాం. బహిరంగ, సురక్షితమైన, సుస్థిరమైన, అందుబాటులో ఉండే, శాంతియుతమైన, పరస్పరం పని చేసే ఐసీటీ  వాతావరణాన్ని ప్రోత్సహించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.  ఐసీటీ వినియోగంలో భద్రతపై ఉమ్మడి అవగాహనను పెంపొందించడానికి నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించడంలోనూ, ఈ రంగంలో సార్వత్రిక చట్టపరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడంపై చర్చలలోనూ, ఐసీటీ వినియోగంలో దేశాల బాధ్యతాయుత పాత్ర కోసం సార్వత్రిక ఆమోదం పొందిన నియమనిబంధనలు,  సూత్రాలను మరింత అభివృద్ధి చేయడంలోనూ, వాటిని అమలు చేయడంలోనూ ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్రను ధ్రువీకరిస్తున్నాం.  ఐసిటి ఉత్పత్తులు,  వ్యవస్థల అభివృద్ధి,  భద్రతకు సమగ్రమైన, సమతుల్యమైన, నిష్పక్షపాత దృష్టికోణాన్ని ఆశిస్తున్నాం. అలాగే సరఫరా వ్యవస్థల భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన సాధారణ నియమాలు,  ప్రమాణాల అభివృద్ధిని , అమలును కూడా మేం కోరుతున్నాం. 2021-2025 కాలంలో ఐసీటీ వినియోగ భద్రతపై ఐక్యరాజ్యసమితి ఓపెన్-ఎండెడ్ వర్కింగ్ గ్రూప్ చేపట్టిన కార్యాచరణను, ఇది ఒకే విధంగా ప్రపంచ,  సమ్మిళిత యంత్రాంగంగా కొనసాగుతున్న తీరును అభినందిస్తున్నాం. ఈ జూలైలో ఈ పనిని విజయవంతంగా కొలిక్కి తీసుకురావాలన్న మా ఉమ్మడి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో జనరల్ అసెంబ్లీ మొదటి కమిటీకి నివేదించే ఈ అంశంపై ఏకాభిప్రాయంతో, ఒకే మార్గంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో,శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.  భవిష్యత్ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడంతో పాటు దాని ద్వారా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఏకాభిప్రాయ సూత్రం ఆవశ్యకతను కూడా మేం గుర్తిస్తున్నాం. ఐసీటీ వినియోగంలో భద్రతపై బ్రిక్స్ అధ్యయన బృందం ద్వారా విధానాల మార్పిడి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ (సీఈఆర్టీ) మధ్య సహకారం, చట్టాన్ని అమలు చేయడంలో  సహకారం,  ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి వంటి రంగాలలో సాధించిన పురోగతిని కూడా గుర్తించాం.

 

ఈ విషయంలో, చట్టాల అమలులో సహకారం, సీఈఆర్టీల మధ్య బహుపాక్షిక సహకారంపై బ్రిక్స్ అవగాహన ఒప్పందాల చర్చలను స్వాగతిస్తున్నాం. పరస్పర మార్పిడి కార్యక్రమాలకు అవకాశాలపై విద్యారంగ సహకారాన్ని బలోపేతం చేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది ఐసిటి వినియోగంలో భద్రతకు సంబంధించిన ఆచరణాత్మక సహకార ప్రణాళికకు, దాని ప్రగతి నివేదికకు అనుగుణంగా ఉండాలి.

 

ఐక్యరాజ్యసమితి సైబర్ నేరాల నిరోధక ఒప్పందాన్ని జనరల్ అసెంబ్లీ ఆమోదించడాన్ని బహుపాక్షిక విజయంగా అభినందిస్తున్నాం. ఇది సైబర్ నేరాలను నిరోధించడంలో, ఎదుర్కోవడంలో,  ఐసీటీ వ్యవస్థల ద్వారా జరిగే ఏవైనా తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆధారాలను ఎలక్ట్రానిక్ రూపంలో సకాలంలో చట్టబద్ధంగా సేకరించడంలో, పంచుకోవడంలో అంతర్జాతీయ సహకారానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థగా, చట్టపరంగా అవసరమైన యంత్రాంగంగా పని చేస్తుంది. ఈ ఒప్పందం ప్రతిపాదన దశ నుంచి ఆమోదం వరకు బ్రిక్స్ దేశాలు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయం. అన్ని దేశాలు తొలి అవకాశంగా తీసుకుని తమ దేశీయ చట్టాలు, ప్రక్రియలు విధానాలకు అనుగుణంగా ఈ ఏడాది హనాయ్‌లో ఈ ఒప్పందంపై సంతకం చేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ ఒప్పందం వేగంగా అమల్లోకి వస్తుంది. జనరల్ అసెంబ్లీ తీర్మానాలు 74/247,  75/282 కు అనుగుణంగా అడ్ హాక్ కమిటీలో పాల్గొని, అవసరమైతే అదనపు నేరాలకు కూడా వర్తించే అనుబంధ ఒప్పందం ముసాయిదా పై చర్చలను కొనసాగించాలని కూడా ప్రతిపాదిస్తున్నాం.

 

అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక సహకారం మరింత బలోపేతం

 

2025 బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య  వ్యూహం ఫలితాలను స్వాగతిస్తున్నాం. ఈ వ్యూహం సభ్య దేశాల మధ్య రంగాల వారీ అభివృద్ధి,  వ్యూహాలు, కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై సహకారం, భాగస్వామ్యాలకు దిశానిర్దేశాన్ని, దృక్కోణాన్ని అందించింది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ, డిజిటల్ ఎకానమీ, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక సహకారం వాణిజ్యం, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై బ్రిక్స్ సహకారానికి ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించిన బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్యం 2030 వ్యూహం ఖరారు, అమలు కోసం మేం ఎదురుచూస్తున్నాం.

 

బ్రిక్స్ వాణిజ్య, సుస్థిర అభివృద్ధి ప్రణాళిక ఆమోదాన్ని మేము ప్రశంసిస్తున్నాం. సమ్మిళిత వృద్ధిని,  సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వాణిజ్యంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. వాణిజ్యం,  సుస్థిర అభివృద్ధి విధానాలు పరస్పరం సహాయకారిగా,  డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం.

 

 

మారకం రేటు నష్టాన్ని తగ్గించడం,  వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సిద్ధం చేయడం, ప్రాజెక్టుల అమలు సన్నద్ధతను మెరుగుపరచడం,  ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలపైన, మౌలిక సదుపాయాలపైన బ్రిక్స్ టాస్క్ ఫోర్స్ జరుపుతున్న చర్చలను స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా, సహకారాన్ని పెంపొందించగల,  సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచగల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఒక సమాచార వ్యవస్థ ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చలను మేం స్వాగతిస్తున్నాం. ఈ చొరవ పై మరింత దృష్టి పెట్టాలని టాస్క్ ఫోర్స్‌ను కోరుతున్నాం.

 

న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) తన రెండో స్వర్ణ దశాబ్దపు ఉన్నత నాణ్యతా అభివృద్ధి యాత్రను ప్రారంభించబోతున్న ఈ సందర్భంలో, గ్లోబల్ సౌత్‌లో అభివృద్ధి,  ఆధునికీకరణకు బలమైన వ్యూహాత్మక ప్రతినిధిగా దాని పెరుగుతున్న పాత్రను మేం గుర్తించి, మద్దతు ఇస్తున్నాం. నిధుల సమీకరణకు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్థానిక కరెన్సీ ఆర్థిక సహాయాన్ని విస్తరించడానికి, నిధుల వనరులను వైవిధ్యపరచడానికి, సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకువెడుతూ, అసమానత తగ్గింపుతో పాటు  మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ఆర్థిక సమగ్రతను  ప్రోత్సహించే ప్రభావవంతమైన ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే  బ్యాంకు స్థిరమైన సామర్థ్య విస్తరణను మేం స్వాగతిస్తున్నాం. అలాగే, బ్యాంకు తన లక్ష్యాలను, విధులను న్యాయంగా, వివక్షరహితంగా అమలు చేసేందుకు అవసరమైన సంస్థాగత సుస్థిరత, నిర్వహణా సామర్ధ్యాన్ని పెంపొందించే విధంగా, సభ్యత్వ విస్తరణను,  పాలనాత్మక వ్యవస్థ బలోపేతాన్ని కొనసాగిస్తున్నందుకు గుర్తింపును, మద్దతును ప్రకటిస్తున్నాం. ఎన్డీబీ  సాధారణ వ్యూహం, సంబంధిత విధానాలకు అనుగుణంగా, సభ్యత్వాన్ని మరింత విస్తరించడం, ఆసక్తి ఉన్న బ్రిక్స్ దేశాల దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించడం పట్ల కూడా గట్టి మద్దతు తెలుపుతున్నాం. బ్యాంకు ప్రెసిడెంట్ దిల్మా రూసెఫ్ నాయకత్వానికి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఆమె పునర్నియామకానికి అన్ని సభ్య దేశాల నుంచి  గట్టి మద్దతు లభించింది. అభివృద్ధి,  స్థిరత్వానికి గ్లోబల్ సంస్థగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకునే దిశలో బ్యాంకు దృఢమైన పురోగతిని మేం స్వాగతిస్తున్నాం. ఈ దిశ గ్లోబల్ సౌత్‌లో సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న మన ఉమ్మడి కట్టుబాటును ప్రతిబింబిస్తోంది. విద్యావేత్తలు,  విధాన నిర్ణేతలు,  అగ్రశ్రేణి పరిశోధకుల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో బ్రిక్స్ ఆర్థిక అంశాల మేదోవర్గ వ్యవస్థ (థింక్ ట్యాంక్ నెట్‌వర్క్ ఫర్ ఫైనాన్స్ - బీటీటీఎన్ఎఫ్) అందిస్తున్న విలువైన సహకారాన్ని మేం అభినందిస్తున్నాం. అలాగే, ఆ బృందం నిర్వచించిన కార్యాచరణ ప్రణాళికను,  ప్రాధాన్యతలను కూడా స్వాగతిస్తున్నాం.

 

న్యూ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్ఫామ్ (ఎన్ఐపీ) భావనపై 2025 మొదటి సెమిస్టర్లో నిర్మాణాత్మక చర్చలను మేం స్వాగతిస్తున్నాం. అలాగే బ్రెజిల్ అధ్యక్ష కాలంలో సాధించిన పురోగతిని మేం గుర్తించాం. 2025 రెండవ సెమిస్టర్లో ఆర్థిక మంత్రిత్వ శాఖలు,  కేంద్ర బ్యాంకుల భాగస్వామ్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై మరింత చర్చించి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి సాంకేతిక స్థాయి ప్రయత్నాలు కొనసాగాలని మేము ఎదురుచూస్తున్నాం. ఈ కొనసాగుతున్న చర్చలు మరింత స్థిరమైన,  అర్ధవంతమైన పురోగతికి మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నాం.

 

మా ఆర్థిక సుస్థిరతను మరింత బలోపేతం చేసుకోవడానికి, మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించడానికి మేం  ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, బ్రిక్స్ బహుపాక్షిక హామీల (బ్రిక్స్ మల్టీలేటరల్ గ్యారంటీస్ - బీఎంజీ) ను అందించడంపై  మేం చర్చలు ప్రారంభించాం.


వ్యూహాత్మక పెట్టుబడుల నష్టాన్ని తగ్గించడానికి, బ్రిక్స్ లోనూ, గ్లోబల్ సౌత్‌లోనూ రుణయోగ్యతను మెరుగుపరచడానికి ప్రత్యేకమైన హామీలను అందించాలని బీఎంజీ లక్ష్యంగా పెట్టుకుంది.

అంతర్జాతీయ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా, అదనపు మూలధన కేటాయింపులు లేకుండా, ముందుగా తన  సభ్యులతో ఒక ప్రయోగాత్మక  చొరవగా బీఎంజీని ఎన్డిబీ  లో చేర్చేమార్గదర్శకాలను మేం అంగీకరించాం. ఈ ప్రయోగాత్మక  చొరవను 2025 అంతటా అభివృద్ధి చేసి దీని పురోగతిని 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నివేదించే ఉద్దేశంతో ఉన్నాం.


స్థానిక కరెన్సీలలో ఆర్థిక సహాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాలను కనుగొనడం సహా ప్రాజెక్టులు,  కార్యక్రమాల కోసం వినూత్న ఆర్థిక పద్ధతులు, విధానాలను సులభతరం చేయడం,  విస్తరించడంపై బ్రిక్స్ ఇంటర్ బ్యాంక్ కోఆపరేషన్ మెకానిజం (ఐసీఎం) దృష్టి సారించడం అభినందనీయం. ఐసీఎం, ఎన్డిబీ  మధ్య చర్చలు కొనసాగడాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.

బ్రిక్స్ సీమాంతర చెల్లింపుల అంశంపై తగిన విధంగా చర్చలను కొనసాగించే బాధ్యతను మా ఆర్థిక  మంత్రులు,  కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు  అప్పగిస్తున్నాం. బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థల మధ్య మరింత పరస్పర అనుసంధానానికి ఉన్న అవకాశాలపై చర్చలను కొనసాగించడానికి సాధ్యమయ్యే మార్గాలను గుర్తించడంలో బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) సాధించిన పురోగతిని కూడా మేము గుర్తించాం.ఈ విషయంలో, సభ్య దేశాల ప్రాధాన్యతలను ప్రతిబింబించే బ్రిక్స్ సీమాంతర చెల్లింపుల వ్యవస్థ సాంకేతిక నివేదికను మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాలు,  ఇతర దేశాల మధ్య వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, మరింత అందుబాటులో ఉండే, సమర్థవంతమైన, పారదర్శకమైన, సురక్షితమైన సీమాంతర చెల్లింపులను సులభతరం చేయడానికి మా ప్రయత్నాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వాణిజ్యం,  పెట్టుబడులకు మరింత మద్దతు ఇస్తుంది.

మా ఆర్థిక మంత్రులు ఆమోదించిన టాస్క్ ఫోర్స్ ద్వారా, బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ నుంచి వచ్చిన సంబంధిత వాటాదారుల, రీఇన్సూరెన్స్ కంపెనీల స్వచ్ఛంద భాగస్వామ్యంతో బ్రిక్స్ సభ్య దేశాల (రీ)ఇన్సూరెన్స్ సామర్థ్యాన్ని పెంచడానికి జరిగే చర్చలను మేం స్వాగతిస్తున్నాం. సంబంధిత వాటాదారుల మధ్య సెటిల్‌మెంట్, డిపాజిటరీ మౌలిక సదుపాయాలపై మరింత సాంకేతిక చర్చ కోసం తగిన విధానాలను అన్వేషించే చర్చలను కూడా మేం ప్రోత్సహిస్తాం.

సమాచార భద్రత, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానంలో సాధారణ ప్రాధాన్యతలపై బ్రిక్స్  రాపిడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ చానెల్ (బీఆర్ఐఎస్సీ) కింద కొనసాగుతున్న సహకారాన్ని మేం గుర్తిస్తున్నాం. అలాగే, ఆర్థిక ఆవిష్కరణలు,  కొత్త సాంకేతికతల బాధ్యతాయుతమైన వాడకంపై సహకారాన్ని పెంపొందించడంలో బ్రిక్స్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ హబ్ పాత్రను కూడా గుర్తిస్తున్నాం.

సవరించిన ఒప్పందం,  నియమావళి కోసం ప్రతిపాదనపై సాంకేతిక బృందం సాధించిన ఏకాభిప్రాయంతో సహా కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) పై సాధించిన పురోగతిని మేం స్వాగతిస్తున్న్నాం. ముఖ్యంగా అర్హత గల చెల్లింపు కరెన్సీలను చేర్చడం,  మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ ద్వారా సీఆర్ఏ సరళతను, ప్రభావాన్ని పెంచడానికి చేసే ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాం.  బ్రిక్స్ లో కొత్తగా చేరిన దేశాలు సీఆర్ఏలో చేరడానికి ఆసక్తి చూపడాన్ని కూడా మేము గౌరవిస్తాం. వారిని స్వచ్ఛందంగా, దేశానుసారమైన పరిస్థితులకు అనుగుణంగా చేర్చుకోవడానికి మేం  కట్టుబడి ఉన్నాం.


అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, మా జాతీయ సుస్థిర అభివృద్ధి వ్యూహాలకు అనుగుణంగా, సామర్థ్యం, పారదర్శకత, ఆధునికీకరణ, సమ్మిళితత్వం,  సుస్థిరత వంటి సూత్రాలతో సరఫరా వ్యవస్థల సుస్థిరతకు మేం  కట్టుబడి ఉన్నాం. ప్రైవేట్ రంగం క్రియాశీలక భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడం, సూక్ష్మ, చిన్న,  మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి, ప్రోత్సాహానికి మద్దతు ఇవ్వడం, అలాగే మరింత సుస్థిర, విలక్షణ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను పెంపొందించడం అవసరమని మేం భావిస్తున్నాం. వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేసే డిజిటల్ సర్వీసులు,  ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సహా, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడంలో ఉత్తమ అనుభవాల మార్పిడి మరింతగా జరగాలని మేం ఉద్దేశిస్తున్నాం. బ్రెజిల్  అధ్యక్ష కాలంలో విజ్ఞాన మార్పిడి,  అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఒక వేదికగా బ్రిక్స్ సస్టైనబుల్ గవర్నమెంట్ ప్రోక్యూర్‌మెంట్ సెమినార్‌ను ప్రారంభించడాన్ని మేం స్వాగతిస్తున్నాం.

ఆర్థిక,  వాణిజ్య సహకారాన్ని సులభతరం చేయడం, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం, పారిశ్రామిక విధానానికి మద్దతు ఇవ్వడం, సమ్మిళిత వృద్ధిని ప్రేరేపించడం వంటి ప్రభుత్వ సేకరణ విధానం వ్యూహాత్మక పాత్రను మేం గుర్తిస్తున్నాం.  సేకరణను ఒక అభివృద్ధి సాధనంగా ఉపయోగించడంలో జాతీయ అనుభవాలు, విధాన ఆవిష్కరణలు, సవాళ్లను పంచుకునే బ్రిక్స్, భాగస్వామి దేశాల సహకారాన్ని మేం ప్రశంస తో గుర్తిస్తున్నాం. భవిష్యత్తు అధ్యక్ష హయాంలలో కూడా ఈ చర్చలు కొనసాగించాలని కోరుతున్నాం.

ఒక ఏకైక ప్రపంచ అంతర్ ప్రభుత్వ ధ్రువీకరణ పథకంగా, ముడి వజ్రాల వాణిజ్యాన్ని నియంత్రించే కింబర్లీ ప్రాసెస్ (కీపీ)కి మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. వివాదాస్పద వజ్రాలు మార్కెట్లలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కూడా మా నిబద్ధతను  స్పష్టం చేస్తున్నాం.  2025లో కింబర్లీ ప్రాసెస్‌కు సంరక్షక అధ్యక్ష హోదాలో యూఏఈ  చేస్తున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. ప్రపంచ వజ్రాల పరిశ్రమ సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాం. వజ్రాలు,  విలువైన లోహాల వ్యాపారాన్ని బ్రిక్స్ దేశాలలోనూ,  ప్రపంచ మార్కెట్‌లోనూ ప్రోత్సహించడానికి సాధ్యమయ్యే యంత్రాంగాలను పరిశీలించడం కొనసాగిస్తాం.

వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఆసక్తులు, సవాళ్లు, అవకాశాలను గుర్తించడం,  పరిశ్రమలో సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కొత్త పారిశ్రామిక విప్లవ భాగస్వామ్యం (పీఏఆర్టిఎన్ఐఆర్)  మార్గదర్శక వేదికగా పని చేస్తోందని గుర్తించాం. అలాగే, స్థిరమైన సహకారం కోసం నిర్మాణాత్మక ప్రణాళిక ద్వారా బ్రిక్స్ పారిశ్రామిక సహకారాన్ని కొనసాగించడానికి ఇది మద్దతు ఇస్తుంది. ఈ విషయంలో, ఇంటెలిజెంట్ మాన్యుఫ్యాక్చరింగ్,  రోబోటిక్స్ వర్కింగ్ గ్రూప్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్,  చిన్న,  మధ్య తరహా సంస్థల వర్కింగ్ గ్రూప్ ల కోసం నిబంధనావళి ఆమోదం పొందడాన్ని అభినందిస్తున్నాం. 2025–2030 సంవత్సరాలకు సంబంధించి తొలి బ్రిక్స్ చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) వర్కింగ్ గ్రూప్ కార్యాచరణ ప్రణాళిక ఆమోదాన్ని మేం అభినందిస్తున్నాం. ఇది బ్రిక్స్  దేశాల మధ్య ఎస్ఎంఈ రంగంలో నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బ్రిక్స్ దేశాల మధ్య పరిశ్రమ 4.0 నైపుణ్యాల అభివృద్ధికి సంయుక్తంగా మద్దతు ఇవ్వడానికి,  నూతన పారిశ్రామిక విప్లవంలో భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి,  ఉత్పాదకతను పెంచడానికి ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) సహకారంతో బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్ (బీసీఐసీ) ను ప్రారంభించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. తదుపరి భాగస్వామ్యాల కోసం కంపెనీలను ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయడం సహా బ్రిక్స్ కార్యకలాపాలలో పాల్గొనడానికి బ్రిక్స్ లో చేరేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తున్నాం. అలాగే, చైనా సెంటర్ ఫర్ బ్రిక్స్ ఇండస్ట్రియల్ కాంపీటెన్సెస్ సీసీబీఐసీ) ఏర్పాటును కూడా మేం స్వాగతిస్తున్నాం. గత 5 సంవత్సరాలలో బ్రిక్స్ ఫోరమ్ ఆన్ పార్ట్ఎన్ఐఆర్, బ్రిక్స్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ కాంటెస్ట్, బ్రిక్స్ న్యూ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎగ్జిబిషన్, బీపీఐసీ శిక్షణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన బ్రిక్స్ పార్ట్ఎన్ఐఆర్ ఇన్నోవేషన్ సెంటర్ (బీపీఐసీ) ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. అలాగే, బీపీఐసీ శిక్షణ కార్యక్రమాల కోసం స్కాలర్షిప్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. బ్రెజిల్ అధ్యక్ష కాలంలో  చైనా సహ ఆతిథ్యంలో చైనా- బ్రిక్స్ కృత్రిమ మేధ అభివృద్ధి సహకార కేంద్రం బ్రిక్స్ కృత్రిమ మేధస్సు ఉన్నత స్థాయి ఫోరంను 9వ బ్రిక్స్ పరిశ్రమ మంత్రుల సమావేశం సందర్భంగా బ్రెసిలియాలో నిర్వహించడాన్ని మేం గుర్తించాం. 2025 జనవరిలో, భారతదేశం నాయకత్వంలో, బ్రిక్స్ స్టార్టప్ ఫోరంను ప్రారంభించడంతో సహా, బ్రిక్స్ ఇన్నోవేషన్ కార్యాచరణ ప్రణాళిక 2021-2024 ను అమలు చేయడంలో సాధించిన పురోగతిని మేం గుర్తించాం. బ్రిక్స్ దేశాల స్టార్టప్ వ్యవస్థల మధ్య సహకారం,  లోతైన అనుసంధానాన్ని పెంపొందించడానికి బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్ ను ప్రారంభించడాన్ని కూడా ప్రశంసిస్తున్నాం.

అనువైన, సమ్మిళిత, సురక్షితమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించవలసిన ప్రాముఖ్యతను మేం గుర్తించాం. డిజిటల్ కనెక్టివిటీ అనేది డిజిటల్ మార్పులకు, అలాగే సామాజిక, ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన అవసరం అని కూడా మేం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో, బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. స్థిరమైన, సురక్షితమైన, సమ్మిళితమైన, పరస్పరం అనుసంధానితమైన డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో సేవలను అందించే,  అందరికీ సామాజిక, ఆర్థిక అవకాశాలను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మేం గుర్తించాం.

ఇంటర్నెట్ విచ్చిన్నాన్ని నివారించడం,  భద్రతతో సహా వినియోగానికి సంబంధించిన ఏ అంశాల గురించైనా జాతీయ చట్టాల పరిధిని గౌరవిస్తూ, ఇంటర్నెట్ జాతీయ భాగాల సమగ్రత, కార్యాచరణ,  స్థిరత్వం భద్రత కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఉమ్మడి చర్యల అవకాశాన్ని అన్వేషించాలని మేం బ్రిక్స్ సభ్యులను కోరుతున్నాం.

డిజిటల్ మార్పు, అర్థవంతమైన అనుసంధానం పై వెబ్‌నార్ ను నిర్వహించడంలో బ్రెజిల్ అధ్యక్ష హయాంలో జరిగిన ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. వ్యవసాయం, తయారీ, రవాణా, ఆరోగ్యం, విద్య,  ఫైనాన్సింగ్ వంటి వివిధ రంగాలలో, ప్రతి దేశ వేర్వేరు అవసరాలకు అనుగుణంగా, సమ్మిళిత, సులభంగా అందుబాటులో ఉండే డిజిటల్ సేవల కోసం ఐసీటీల స్వీకరణను సులభతరం చేయడానికి విజ్ఞాన భాగస్వామ్యం,  విధాన మార్పిడిని కొనసాగించాలని కోరుతున్నాం. బ్రిక్స్ సదస్సులో భాగంగా డిజిటల్ మార్పుపై సామర్థ్య పెంపు సెషన్‌లను నిర్వహించడంలో భారతదేశం చేసిన ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. బ్రిక్స్ సభ్య దేశాలు ఇలాంటి సైడ్ ఈవెంట్‌లను కొనసాగిస్తూ ప్రోత్సహించాలని సూచిస్తున్నాం.

2025లో బ్రిక్స్ ఫ్యూచర్ నెట్వర్క్స్ ఇన్నోవేషన్ ఫోరమ్ కు చైనా,  బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వడాన్ని మేం గుర్తించాం. అలాగే బ్రిక్స్ ఫ్యూచర్ నెట్వర్క్స్ ఇనిస్టిట్యూట్ కౌన్సిల్ కృత్రిమ మేధ, తదుపరి తరం కమ్యూనికేషన్లు , ఇండస్ట్రీ 4.0 లో ఇంటర్నెట్ అన్వయం, ఈఎంఎఫ్ ఎక్స్‌పోజర్ పై అధ్యయన బృందాల నిబంధనలను ఆమోదించడాన్ని, వాటి చైర్మన్,  వైస్ చైర్మన్‌ల నియామకాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం. ఈ బీఐఎఫ్ఎన్ అధ్యయన బృందాల నుంచి స్పష్టమైన ఫలితాలు వచ్చే దిశగా మేం ఎదురుచూస్తున్నాం. అలాగే, ఆన్‌లైన్ ద్వారా బాలల సంరక్షణ అంశంలో, సభ్య దేశాల మధ్య విజ్ఞానం,  ఉత్తమ అనుభవాల మార్పిడి ద్వారా సహకారాన్ని పెంపొందించే కొత్త యంత్రాంగాలను అభివృద్ధి చేసి సాధించిన పురోగతిని మేం గుర్తిస్తున్నాం. డిజిటల్ బ్రిక్స్ ఫోరమ్ సందర్భంగా డిజిటల్ పబ్లిక్ గూడ్స్,  డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై ప్యానల్ చర్చను నిర్వహించడంలో అధ్యక్ష హోదాలో  బ్రెజిల్ చేసిన ప్రయత్నాలను  అభినందిస్తున్నాం. అలాగే నిరంతర విజ్ఞాన,  విధాన మార్పిడి కొనసాగాలని కోరుతున్నాం. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ గ్రూప్ సమావేశం నిర్వహించడాన్ని గుర్తించడంతో పాటు దాని నిబంధనల ఆమోదాన్ని  స్వాగతిస్తున్నాం.  

స్పెక్ట్రమ్,  సంబంధిత ఉపగ్రహ కక్ష్యలను హేతుబద్ధంగా, సమర్థవంతంగా, సమానంగా, సక్రమంగా,  న్యాయంగా, ప్రభావవంతంగా ఆర్థికంగా ఉపయోగించడంలో సమష్టి ప్రయత్నాలు చేయాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. అంతరిక్ష సుస్థిరతపై సహకారాన్ని సులభతరం చేయడానికి బ్రిక్స్ సభ్యుల మధ్య మరింత సహకారాన్ని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో సుస్థిర అంతరిక్ష అనుసంధాన వనరులపై పని చేయడానికి పరిశీలన, కార్యాచరణ కోసం బ్రిక్స్ కు ప్రతిపాదనలతో కూడిన నివేదికను బ్రెజిల్ అందించగలదని ఆశిస్తున్నాం. అంతరిక్ష టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల సాంకేతిక పరిధి ఎప్పుడూ దేశ సార్వభౌమాధికారాన్ని రాష్ట్ర మించి ఉండకూడదని మేం స్పష్టం చేస్తున్నాం.  అంతరిక్ష టెలికమ్యూనికేషన్  వ్యవస్థల సాంకేతిక పరిధి ఏ సందర్భంలోనూ దేశ సార్వభౌమత్వాన్ని దాటకూడదని, ఒక దేశ భూభాగంలో ఉపగ్రహ సేవలను ఆ దేశం అనుమతితోనే అందించాలని మేం స్పష్టం చేస్తున్నాం. సుస్థిర అంతరిక్ష కనెక్టివిటీ వనరులపై బ్రిక్స్ శ్వేతపత్రం తయారీని మేం స్వాగతిస్తున్నాం.

బాహ్య అంతరిక్షాన్ని శాంతియుతంగా అన్వేషించడం,  వినియోగించడంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను మేం గుర్తిస్తున్నాం. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న అంతరిక్ష సామర్థ్య అసమానతలను తగ్గించాలన్న మా కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాం.  అంతరిక్ష కార్యకలాపాలలో డేటా, నైపుణ్యం, ఉత్తమ అనుభవాల మార్పిడిని బలోపేతం చేయడం మన అంతరిక్ష సంస్థల మధ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ, సుస్థిర పురోగతిని పెంపొందించడంలోనూ ఒక ముఖ్యమైన అంశమని మేం గుర్తిస్తున్నాం.  సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి సామర్థ్యవృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఒక సంయుక్త సమాచార లేఖ ప్రతిపాదనను ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం. అంతరిక్ష కార్యకలాపాల రంగంలో సహకారాన్ని మరింత సులభతరం చేయడానికి బ్రిక్స్ స్పేస్ కౌన్సిల్‌ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించి, దాని నిబంధనలపై పనిచేయడం కొనసాగించేందుకు మేం అంగీకరించాం.  యూ ఎన్ఎఫ్సీసీసీ సీఓపీ30కు మద్దతుగా సంయుక్త పరిశీలనా ప్రక్రియపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏజెన్సీలు అంగీకరించిన విషయాన్ని కూడా మేం గుర్తించాం.

అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన అంతర్జాతీయ వేదికగా జీ20 పోషిస్తున్న కీలక పాత్రను మేం ప్రత్యేకంగా గుర్తించాం. అభివృద్ధి చెందిన,  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సమానమైన, పరస్పర ప్రయోజనకరమైన స్థితిలో చర్చలు జరపడానికి ఇది ఒక వేదికను అందిస్తోంది. ప్రపంచ సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలను అన్వేషించడం, బహుళధ్రువ ప్రపంచాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఏకాభిప్రాయం ఆధారంగా ఫలితాల ఆధారిత అంశాలపై దృష్టి సారించిన జీ20 నిరంతర,  ఉత్పాదక కార్యకలాపాల ప్రాముఖ్యతను మేం గుర్తించాం.

 

దక్షిణాఫ్రికా అధ్యక్షత్వానికి మా బలమైన మద్దతును మరొకసారి వ్యక్తం చేస్తూ, 2025 నవంబర్‌లో జొహానెస్‌బర్గ్‌లో జరిగే జీ 20 నేతల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక పాలనా వ్యవస్థలో సమ్మిళితత్వాన్ని పెంచడానికి,  గ్లోబల్ సౌత్ గళాన్ని విస్తరించడానికి, మా స్థానాలను సమన్వయం చేసుకోవడానికి సుముఖతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉద్భవిస్తున్న మార్కెట్,  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల (ఈఎండిఈ) పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది తగిన విధంగా ప్రతిబింబిస్తుంది. 2022–2025 కాలంలోనూ, ఆ తర్వాత కూడా, బ్రిక్స్ సభ్యదేశాలైన ఇండోనేసియా, భారత్, బ్రెజిల్ దక్షిణాఫ్రికా వరుసగా చేపట్టే జీ20 అధ్యక్ష బాధ్యతల ద్వారా, వారి ప్రాధాన్యతలను జీ20 అజెండాలో మరింత సమగ్రంగా చేర్చడానికి కట్టుబడిఉన్నాం. .2023 లో భారతదేశం జి 20 అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఆఫ్రికన్ యూనియన్ విలీనం ద్వారా,  బ్రెజిల్,  దక్షిణాఫ్రికా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఎన్డీబీని ఎన్డిబిని ఆహ్వానించడం ద్వారా మరింత సన్నిహిత పరస్పర చర్య,  సమన్వయంతో జి20లో ఈఎండిఈల స్వరం బలపడినందుకు అభివాదం చేస్తున్నాం.

 

ముఖ్యంగా కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల ఆర్థిక, ద్రవ్య విధానాల్లో హెచ్చుతగ్గులు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణంలో సహజంగా ఉండే సమస్యల వల్ల బయటి నుంచి ఎదురయ్యే అవాంతరాల పరోక్ష ప్రభావం కారణంగా తీవ్రమైన ప్రస్తుత అభివృద్ధి సవాళ్లను అధిగమించేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు కొన్ని దేశాల్లో భారీగా రుణభారం కారణంగా తగ్గిపోవడాన్ని మేం గుర్తించాం. అధిక వడ్డీ రేట్లు, కఠినమైన ఆర్థిక పరిస్థితులు అనేక దేశాల్లో రుణభారాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రతి దేశంలోని చట్టాలు, అంతర్గత విధానాలతోపాటు మోయదగ్గ బయటి రుణాలు, ఆర్థిక విచక్షణను పరిగణనలోకి తీసుకుని.. అంతర్జాతీయంగా రుణాలను సముచిత, సమగ్ర పద్ధతిలో పరిష్కరించడం ద్వారా ఆర్థిక పునరుద్ధరణకు, సుస్థిరాభివృద్ధికి సహకరించాల్సిన ఆవశ్యకత ఉందని మేం విశ్వసిస్తున్నాం. దిగువ, మధ్య ఆదాయ దేశాలు రెండింటిలోనూ రుణ భారాన్ని సమర్థంగా, సమగ్రంగా, క్రమబద్ధంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. ‘రుణ నిర్వహణ కోసం జీ20 ఉమ్మడి చట్రా’న్ని అంచనా వేయదగిన రీతిలో, క్రమబద్ధంగా, సకాలంలో, సమన్వయంతో అమలు చేయడం భారీ రుణ భారాన్ని సమష్టిగా పరిష్కరించగల ఇతర సాధనాల్లో ఒకటి. ఉమ్మడి కార్యాచరణ, న్యాయబద్ధమైన రుణ భాగస్వామ్యం సూత్రానికి అనుగుణంగా అధికారిక ద్వైపాక్షిక రుణదాతలు, ప్రైవేటు రుణదాతలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (ఎండీబీ) ఇందులో భాగస్వాములు కావాలి. అభివృద్ధి కాంక్షతో న్యాయబద్ధమైన, నిర్మాణాత్మక మార్గంలో రుణ సమస్యలను పరిష్కరించుకోవడంలో కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు (ఈఎండీఈ) చేయూతనిస్తున్నాం. ఈ దిశగా రుణగ్రస్తులకు - అధికారిక ద్వైపాక్షిక, బహుపాక్షిక, ప్రైవేటు రుణదాతలకు మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో మేం నిమగ్నమై ఉన్నాం.

ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిలో, సముచిత - సమ్మిళిత ప్రజా విధానాల రూపకల్పనలో ఆధునిక జీవితానికి ఉత్ప్రేరకంగా డేటా పాత్ర అత్యంత కీలకమైనదని మేం గుర్తించాం. డేటాపై దేశాలకు సంపూర్ణ అధికారం, సమర్థత, సౌలభ్యం, భద్రత, పరస్పర అంగీకారంతోనే దేశాల మధ్య డేటా మార్పిడి, డేటాను నైతికంగా ఉపయోగించుకోవడం, అలాగే డేటా సేకరణ, నమోదు, నిల్వ, వ్యవస్థీకరణ, ప్రాసెసింగ్, బదిలీ కోసం సూత్రాలను నిర్దేశించడం, వ్యక్తిగత గోప్యతతోపాటు వ్యక్తిగత సమాచార హక్కులూ ప్రయోజనాల పరిరక్షణ, జాతీయ డేటా విధాన నిబంధనల్లో పరస్పర కార్యాచరణను ప్రోత్సహించడం, డేటాతో లభించే ద్రవ్య, ద్రవ్యేతర ప్రయోజనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలూ వాటి ప్రజలకు అందించడం.. – డేటా నిర్వహణ (డేటా గవర్నెన్స్) కోసం కొన్ని సూత్రాల ప్రాతిపదికన, ఈ అంశాలన్నింటితో కూడిన, పరస్పర కార్యాచరణకు అనుకూలమైన ఉమ్మడి వ్యవస్థాగత ఏర్పాటును నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ దిశగా బ్రిక్స్‌లో డేటా నిర్వహణపై సానుకూల ప్రభావం చూపే ప్రణాళికగా ‘డేటా నిర్వహణపై బ్రిక్స్ పరిపాలన ఒప్పందం (బ్రిక్స్ డేటా ఎకానమీ గవర్నెన్స్ అండర్‌స్టాండింగ్)’ ఖరారవడాన్ని మేం స్వాగతిస్తున్నాం. దీంతో సురక్షిత విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడానికి, అలాగే వ్యక్తిగత - జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, పరిశ్రమలు - సేవల డిజిటలీకరణను ప్రోత్సహించేందుకు, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి అవకాశం లభిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వికాసానికి ఇ-కామర్స్ ఓ ముఖ్య చోదక శక్తిగా మారిందనీ, అది వస్తువులు, సేవల్లో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించి విదేశీ పెట్టుబడులు పెరిగేలా భరోసానిస్తుందని, ఆవిష్కరణలను సులభతరం చేస్తుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం. వినియోగదారుల హక్కుల రక్షణకు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించే రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం, ఆన్‌లైన్ వివాద పరిష్కార సాధనాలపై పరిశోధన, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించేలా వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, దేశాల మధ్య ఇ-కామర్స్ ద్వారా తక్కువ విలువ కలిగిన ఉత్పత్తుల వాణిజ్యంపై చర్చలు... మొదలైన చర్యల ద్వారా ఇ-కామర్స్‌పై నమ్మకాన్ని మరింత పెంచాలని, ఇ-కామర్స్ సంస్థల హక్కులను పూర్తి స్థాయిలో పరిరక్షించాలని మేం నిశ్చయించాం.

ఆర్థిక వ్యవస్థలోని హైటెక్ రంగాలైన ఐటీ, ఐటీ ఆధారిత సేవలతోపాటు పర్యాటకం, ఓడరేవులు, రవాణా మౌలిక సదుపాయాలు, సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి- వాణిజ్యీకరణ, కొత్త తరహా విలువ ఆధారిత ఉత్పత్తులు సహా... వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, తయారీ సౌలభ్యం కోసం సువ్యవస్థితమైన యంత్రాంగంగా బ్రిక్స్ దేశాల ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజెడ్) ప్రభావాన్ని మేం ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నాం. ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమున్న రంగాల్లో అదనపు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లు అపారమైన అవకాశాలను అందిస్తాయని కూడా మేం అంగీకరిస్తున్నాం. ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి, ముఖ్యంగా హైటెక్, మౌలిక సదుపాయాల రంగాల్లోనూ ఇతర రంగాల్లోనూ కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సమర్థమైన సాధనాలుగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను మేం గుర్తిస్తున్నాం.

ప్రపంచ ఆహారోత్పత్తిలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, తద్వారా వ్యవసాయ ఉత్పాదకత, సుస్థిరతలను పెంపొందించడంలో, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకూ పోషకాహారానికీ భరోసానివ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మేం గుర్తించాం. చిన్నకారు రైతులు, పశుపోషకులు, చేతివృత్తులవారు, చిన్న తరహా మత్స్యకారులు, చేపలూ రొయ్యల ఉత్పత్తిదారులు, దేశాల్లోని ప్రజలూ స్థానిక సమాజాలూ, మహిళలు, యువత సహా వ్యవసాయ కుటుంబాలను వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో కీలక భాగస్వాములుగా మేం గుర్తించాం. సుస్థిర పద్ధతిలో నూనె గింజల రంగంలో నిలకడ, సమ్మిళితత్వం, సమానమైన మార్కెట్ లభ్యతలను ప్రోత్సహించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. చిన్న రైతులకు మద్దతివ్వాలని, న్యాయబద్ధంగా ధరలు నిర్ధారించాలని, అలాగే వ్యవసాయంతో ముడిపడి ఉన్న కార్యకలాపాలన్నింటినీ క్రియాశీలంగా నిర్వహిస్తూ, అంతరాయాలను తొలగించాలని.. ఆ దిశగా బ్రిక్స్ దేశాలు, భాగస్వాముల మధ్య నిరంతర సహకారం ఉండాలని పిలుపునిస్తున్నాం. చిన్న తరహా వ్యవసాయంలో పని భారాన్ని తగ్గించడంతోపాటు ఉత్పాదకతనూ ఆదాయాన్నీ పెంచడానికి, క్రియాశీలతను మెరుగుపరచి పర్యావరణ హిత పద్ధతుల దిశగా వేగంగా పరివర్తన చెందడానికి.. యాంత్రీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు వ్యూహాత్మక అవకాశాలుగా మేం గుర్తించాం. సమాచారం, డిజిటల్ ఆవిష్కరణలూ ఇందులో భాగంగా ఉంటాయి.

ఆహార భద్రత, పోషకాహారం విషయాల్లో భరోసా, తీవ్రమైన ఆహార ధరల అస్థిరత ప్రభావాన్నీ, అలాగే ఆకస్మిక సరఫరా సంక్షోభాలను (ఎరువుల కొరత సహా) తగ్గించాల్సిన ఆవశ్యకతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. ఈ దిశగా, బ్రిక్స్‌లో (బ్రిక్స్ ధాన్యాల వినిమయం) వాణిజ్య వేదికను నెలకొల్పే చర్యలను నిరంతరం విస్తరింపజేయడం, అనంతర పరిణామాలు, ఇతర వ్యవసాయోత్పత్తులు, వస్తువులకూ ఆ కార్యక్రమాన్ని వర్తింపజేయడం అత్యంత ప్రధానమైన అంశమని మేం గుర్తించాం.

ఆహార లభ్యత, అందుబాటు, వినియోగం, సుస్థిరత, ఆర్థిక స్థోమతలను మెరుగుపరిచేలా, అలాగే సరఫరా అంతరాయాలను ఎదుర్కొనేలా జాతీయ ఆహార నిల్వ వ్యవస్థల వంటి జాతీయ సామర్థ్యాల బలోపేతం సహా బ్రిక్స్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంబంధిత వ్యవసాయ, ఆహారోత్పత్తి అంశాల్లో జాతీయ విధానాలు, అంతర్జాతీయ సమన్వయంపై మరిన్ని చర్చలకు మేం మద్దతిస్తున్నాం. సరఫరా కొరత లేదా ఆహార ధరల్లో తీవ్రమైన పెరుగుదల వల్ల ఏదైనా బ్రిక్స్ సభ్యదేశం ప్రభావితమైతే, ఆ అసాధారణ పరిస్థితుల్లో.. జాతీయ ప్రాధాన్యం నేపథ్యంలో, ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు అనుగుణంగా చేపట్టే సహకార కార్యక్రమాల వల్ల అత్యవసర ప్రతిస్పందన, ప్రకృతి విపత్తుల నిర్వహణ సులభతరమవుతుందని మేం గుర్తించాం. వాటి ఏకైక ఉద్దేశం అంతర్జాతీయ సంఘీభావం ద్వారా ఆహార భద్రతకు, పోషకాహారం కోసం మద్దతివ్వడమే కాబట్టి, ఈ చర్యలేవీ అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఉల్లంఘనలకు దారితీయకూడదు. ఆహార నష్టాన్ని, వృథాను తగ్గించడం, అలాగే ప్రమాదకరమైన వ్యాధులను, తెగుళ్ళను ఉమ్మడిగా నివారించడం, నియంత్రించడం ద్వారా జంతువులు, మొక్కల ఆరోగ్యాన్ని పరిరక్షించడం అత్యావశ్యకమని మేం గుర్తించాం. జంతువులు, మొక్కల ఉత్పత్తులకు ఏకీకృత ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ వ్యవస్థతో ఆహారం, దాణా తరలింపులో పారదర్శకతను పెంచడమన్నది ఈ దిశగా ముఖ్య సాధనంగా ఉండాలి.

సాంకేతికతలూ ఆవిష్కరణల అమలుతో ఆహార భద్రతకు భరోసానివ్వడంతోపాటు చిన్న తరహా, వ్యవసాయ కుటుంబాలు, మత్స్య - ఆక్వాకల్చర్ కార్మికుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరల్లో యంత్రాలు, పరికరాలను స్థానికంగా ఉత్పత్తి చేసేలా పెట్టుబడులను ప్రోత్సహించాలని మేం పిలుపునిస్తున్నాం. తద్వారా ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడం, అన్ని రకాల పోషకాహార లోపాలను తొలగించడం, సుస్థిర వ్యవసాయం- గ్రామీణాభివృద్ధికి ప్రోత్సాహం లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ దిశగా వ్యవసాయం, మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో మరింత సహకారం అవసరం. ఆహార భద్రత, పోషకాహారంపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాల ఆధారంగా.. ‘ఆకలి - పేదరికానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కూటమి’ అన్నది అంతర్జాతీయ సహకారం దిశగా ఓ ముఖ్య ఏర్పాటుగా మేం గుర్తించాం. వ్యవసాయోత్పత్తులు, వ్యవసాయ - ఆహార ఉత్పాదకాలకు సంబంధించి బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడం, అలాగే అన్ని దశల్లోనూ కార్యకలాపాల మెరుగుదల, పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులపై కూడా చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషి చేస్తున్నాం. న్యాయబద్ధమైన వ్యవసాయ వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం, క్రియాశీల - సుస్థిర వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సిన ఆవశ్యకతను మేం పునరుద్ఘాటిస్తున్నాం. దేశాల మధ్య ఆహారం, వ్యవసాయోత్పత్తికి ఆవశ్యకమైన ఉత్పాదకాల తరలింపు సజావుగా జరగాలన్న లక్ష్యంతో.. వ్యవసాయం, ఎరువుల విషయంలో అంతరాయాలను తగ్గించడం కోసం నిర్దిష్ట నియమాల ప్రాతిపదికన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మేం కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ ఎగుమతుల విషయంలో.. డబ్ల్యూటీవో నియమాలకు విరుద్ధంగా ఉన్న అనవసర నియంత్రణ ఆర్థిక చర్యల నుంచి (వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులను; వ్యాపార సేవలను ప్రభావితం చేసేవి సహా) వీటిని మినహాయించాలి. యూఎన్‌సీసీడీ ఫ్రేమ్‌వర్క్,  ఆకలి - పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ కూటమి ఏర్పాటులో సహకారంపై మొదటి బ్రిక్స్ ఏడబ్ల్యూజీ నివేదికకు అనుగుణంగా.. ‘బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం’ ప్రారంభమవడాన్ని మేం స్వాగతిస్తున్నాం.

మార్కెట్ల స్థిరమైన అభివృద్ధి, పోటీ వ్యతిరేక సీమాంతర విధానాలను సమర్థంగా ఎదుర్కోవడం, ఆరోగ్యకరమైన మార్కెట్ వాతావరణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా.. బ్రిక్స్ దేశాల మధ్య పోటీ చట్టం, విధాన రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. వైజ్ఞానిక ఆవిష్కరణలు, ‘బ్రిక్స్ కాంపిటీషన్’ దేశాల మధ్య వైజ్ఞానిక భాగస్వామ్యంలో ‘బ్రిక్స్ అంతర్జాతీయ పోటీ చట్టం, విధాన కేంద్రం’ కార్యకలాపాల పాత్రను మేం గుర్తించాం. అలాగే, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల పోటీ చట్టం అభివృద్ధికి, సామాజికంగా ముఖ్యమైన మార్కెట్లలో గుత్తాధిపత్య అవరోధాలను తొలగించే దిశగా పనిచేయడానికి అత్యంత అనుకూల పరిస్థితులను కల్పించాల్సిన ఆవశ్యకతనూ గుర్తించాం. 2025లో దక్షిణాఫ్రికాలో తొమ్మిదో బ్రిక్స్ అంతర్జాతీయ పోటీ సదస్సు నిర్వహణను మేం స్వాగతిస్తున్నాం.

‘బ్రిక్స్ జాతీయ ప్రామాణీకరణ సంస్థల అధిపతుల సమావేశం’లోని ‘బ్రెసిలియా డిక్లరేషన్‌’ను మేం స్వాగతిస్తున్నాం. ఆర్థిక సంబంధాలనూ వాణిజ్యాన్నీ సులభతరం చేయడం, వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడం సహా.. ఈ రంగంలో సహకారం వల్ల కలిగే విశేష ప్రయోజనాలను ఈ సమావేశం గుర్తిస్తోంది. ప్రామాణీకరణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందానికి సంబంధించిన చర్చలను సకాలంలో పూర్తిచేయాలని కోరుతున్నాం. వాణిజ్యానికి అవరోధాలను తొలగించడంలో, దేశాల మధ్య వస్తువులూ సేవల సరఫరాను సులభతరం చేయడంలో ప్రభావవంతమైన సాధనాలుగా ఉన్న ప్రామాణీకరణ, నాణ్యతలను పెంపొందించే దిశగా కీలక మైలురాయిగా  దీనిని పరిగణించవచ్చు.

బ్రిక్స్ దేశాల అత్యున్నత ఆడిట్ సంస్థల మధ్య అత్యుత్తమ విధానాల నిరంతర పరస్పర వినిమయం ప్రశంసనీయం. సుపరిపాలన, ప్రభావవంతమైన ప్రజా విధానాలను ప్రోత్సహించడంలో ఆ సంస్థల పాత్రను పరిగణనలోకి తీసుకుని.. అవి తమ కార్యకలాపాల్లో ఏఐ వంటి డిజిటల్ సాంకేతికతల వల్ల లభించే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడం (అదే సమయంలో వీటితో ఎదురవగల సంకటాలను తగ్గించుకుంటూ) అత్యావశ్యకమని మేం గుర్తించాం.

సమర్థంగా నిర్ణయం తీసుకోవడంలో అధికారిక గణాంకాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ.. బ్రిక్స్‌లో గణాంక సహకారాన్ని పెంపొందించేందుకు మద్దతు తెలుపుతున్నాం. ఏటా బ్రిక్స్ ఉమ్మడి గణాంక ప్రచురణను, బ్రిక్స్ ఉమ్మడి గణాంక ప్రచురణ సంక్షిప్త చిత్రణను విడుదల చేయడం, అలాగే బ్రిక్స్ దేశాల నడుమ అధికారిక గణాంక రంగాలలో ఉత్తమ విధానాల పరస్పర వినిమయం గణాంక సహకారంలో భాగంగా ఉంటాయి.

21వ శతాబ్దానికి తగిన న్యాయబద్ధ, సమ్మిళిత, స్థిరమైన, సమర్థమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థను ప్రోత్సహించేలా మేం సహకరిస్తుంటాం. పన్నుల పారదర్శకతను, ప్రభావవంతమైన- న్యాయబద్ధమైన పన్నులపై అంతర్జాతీయ చర్చలను ప్రోత్సహించడానికి, అలాగే పురోగతిని పెంచుతూ అసమానతలను తగ్గించే చర్యలకూ దోహదపడడంలో మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. పన్ను ప్రాధికార సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, దేశీయ ఆదాయ సమీకరణ, పన్ను హక్కులను న్యాయబద్ధంగా కేటాయించడం, పన్ను ఎగవేత - పన్ను సంబంధిత అక్రమ ఆర్థిక చర్యలను మరింత మెరుగ్గా ఎదుర్కోవడం మా లక్ష్యం. ఈ విషయంలో ‘అంతర్జాతీయ పన్ను సహకారంపై ఐక్యరాజ్యసమితి విధాన ఒడంబడిక’కు మద్దతుగా బ్రిక్స్ ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. ఐరాస ఒడంబడిక, దాని నిబంధనలపై చర్చల్లో నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాం. కస్టమ్స్ సహకారంలో పురోగతిని, ముఖ్యంగా ఆధీకృత ఆర్థిక నిర్వాహక కార్యక్రమాల పరస్పర గుర్తింపు దిశగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం. ద్వైపాక్షికంగా అంగీకరించిన మినహాయింపులు, మార్పులు లేదా ఆమోదాల మేరకు ఆ కార్యక్రమాలు ఉంటాయి. బ్రిక్స్ ‘కస్టమ్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు, సుంకాల నిర్వహణలో అధునాతన సాంకేతికత వినియోగం పెరగడం.. సుంకాలపై సహకారంలో కీలక పరిణామం. వీటిని నిరంతరం ప్రోత్సహిస్తాం.

మేధోసంపత్తి (ఐపీ) కార్యాలయాల ద్వారా ఐపీ బ్రిక్స్ కింద ఫలప్రదంగా కొనసాగుతున్న సహకారాన్ని మేం గుర్తిస్తున్నాం. నిర్వాహక మార్గనిర్దేశక వ్యవస్థల ద్వారా మేధోసంపత్తిపై అవగాహనకు ప్రోత్సాహం, ఆర్థిక - సామాజిక అభివృద్ధి దిశగా మేధోసంపత్తికి బలంగా తోడ్పాటును అందించడం వంటి 8 సహకార విభాగాల్లో మరింత ఆచరణీయ ఫలితాల సాధనకు మేం చేయూతనిస్తాం. మేధోసంపత్తి, జన్యు వనరులు, అనుబంధ సంప్రదాయ విజ్ఞానంపై విపో ఒప్పందం; రియాద్ డిజైన్ చట్టాల ఒప్పందాల ఆమోదాన్ని మేం స్వాగతిస్తున్నాం. విశేష ప్రయోజనాలను అందించడంతోపాటు.. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని అవి మెరుగుపరుస్తాయి. కృత్రిమ మేధ శిక్షణ కోసం సహా డిజిటల్ వాతావరణంలో ఉపయోగించే మేధోసంపత్తి హక్కులను గౌరవించే దిశగా సహకారం, అలాగే హక్కుదారులకు న్యాయబద్ధమైన ప్రతిఫలం ప్రాధాన్యాన్ని మేం గుర్తిస్తున్నాం. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలూ ప్రాధాన్యాలను గౌరవిస్తున్నాం. ఏఐ వినియోగం పెరగడం వల్ల- డేటా సెట్లు, ఏఐ మోడళ్లలో తగినంత ప్రాతినిధ్యం లేని విజ్ఞానం, వారసత్వం, సాంస్కృతిక విలువల సంబంధిత సమాచారాన్ని దుర్వినియోగం చేయగల, తప్పుడు వ్యాఖ్యానాలు చేయగల దుష్పరిణామాలకు అవకాశం ఉందని కూడా మేం గుర్తిస్తున్నాం.

విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతికత, ఆవిష్కరణల్లో (ఎస్టీఐ) సహకారంపై 2015లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినప్పటి నుంచి సాధించిన గొప్ప విజయాలను.. ఆ రంగాల్లో సహకారం పదేళ్ల మైలురాయిని చేరుకున్న ఈ విశేష సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాం. ప్రవేశ నియమాల (యాక్సెషన్ ప్రొటోకాల్) ద్వారా ఈ ఒప్పందంలో కొత్త సభ్యులను చేర్చుకునేలా కొనసాగుతున్న ప్రక్రియను మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాల అభివృద్ధికి కొత్త ఉత్పాదక శక్తులను అందించడం, సహకారంతో కూడిన భాగస్వామ్యం ద్వారా ఆ మూడు రంగాల్లో సుస్థిరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, బ్రిక్స్ దేశాల మధ్య స్నేహం, పరస్పర అవగాహన, శాంతియుత సంబంధాలను బలోపేతం చేసేందుకు తోడ్పాటునివ్వడమే ఎస్టీఐ రంగాల్లో బ్రిక్స్ సహకారానికి ప్రాతిపదికలని మేం పునరుద్ఘాటిస్తున్నాం.

బ్రిక్స్ ఎస్టీఐ వర్కింగ్ గ్రూపుల కృషిని మేం ప్రశంసిస్తున్నాం. కొత్త సాంకేతికతలు, దేశాల్లో పారిశ్రామిక పునరుద్ధరణ ప్రక్రియల్లో పురోగతి వేగవంతమైన సరికొత్త నేపథ్యంలో.. 2025లో కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికత, పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రాధాన్యాలుగా పరిగణించాలన్న బ్రెజిల్ ప్రతిపాదనను మేం అభినందిస్తున్నాం. ఆవిష్కరణల కోసం బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక 2025–2030ని, పరిశోధన ప్రాజెక్టుల కోసం ఏడో ఉమ్మడి సమావేశం, ఆవిష్కరణ ప్రాజెక్టుల కోసం మొదటి ఉమ్మడి సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య జలాంతర్గామి కేబుళ్ల ద్వారా అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం 2025లో ‘సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం’ చేపట్టడంపై చర్చించాలన్న బ్రెజిల్ ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం. ఈ ఏడాది పదో ఎడిషన్‌ పూర్తవబోతున్న ‘యంగ్ సైంటిస్ట్స్ ఫోరం’, ‘యంగ్ ఇన్నోవేటర్స్ ప్రైజ్’ వంటి కార్యక్రమాల ద్వారా యువ శాస్త్రవేత్తలు, అంకుర సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేలా బ్రిక్స్ సభ్యులను ప్రోత్సహిస్తున్నాం. సముద్ర లోతుల్లో ఉమ్మడి పరిశోధన దిశగా సహకార ఎజెండాను ముందుకు తీసుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం. ‘సముద్ర లోతుల్లో వనరుల పరిశోధనపై బ్రిక్స్ అంతర్జాతీయ కేంద్రం’ ఏర్పాటును పూర్తి చేసేలా ఉల్లేఖన నిబంధనల విస్తరణ కూడా ఇందులో భాగంగా ఉంది. మానవీయ శాస్త్రాల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. 2025లో రష్యాలో సామాజిక, మానవీయ శాస్త్రాల్లో పరిశోధనలపై వేదికను నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం.

పర్యాటక రంగంలో బ్రిక్స్ దేశాలకు అపారమైన సామర్థ్యం ఉందని, పర్యావరణ పర్యాటకం సహా సుస్థిర - క్రియాశీల పర్యాటక అభివృద్ధి ఆశాజనకమైన అవకాశాలున్నాయని అంగీకరిస్తున్నాం. 2024లో సభ్యత్వ విస్తరణ ద్వారా ఈ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి, ప్రయాణాన్ని పెంచడానికి ఇది కొత్త అవకాశాలను అందించింది. పర్యాటక వర్కింగ్ గ్రూపు ఫలితాలను మేం స్వాగతిస్తున్నాం. సభ్య దేశాల మధ్య సమన్వయాన్నీ సంబంధాలనూ బలోపేతం చేసేలా ప్రాంతీయ పర్యాటక వ్యూహాలను ప్రోత్సహించడం, అలాగే సుస్థిర, క్రియాశీల, పునరుత్పాదక పర్యాటకాన్ని ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనే సాధనంగా రూపొందించడం, స్థానిక అభివృద్ధి - సాంస్కృతిక వినిమయ మాధ్యమంగా డిజిటల్ పర్యటనల సమర్థతను ఉపయోగించుకునే వ్యూహాత్మక మార్గదర్శకాలను రూపొందించడం ఇందులో అతి ముఖ్యమైనవి. బ్రిక్స్ సహకారాన్ని విస్తరించుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పర్యాటకం అర్థవంతంగా దోహదపడేలా చూసుకోవడానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తున్నాం.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడం - సుస్థిర, న్యాయబద్ధ, సమ్మిళిత అభివృద్ధికి ప్రోత్సాహం

మన భూమి, ఉమ్మడి భవిష్యత్తుకు ముప్పును వాటిల్లజేసే వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షికతను బలోపేతం చేయాలన్న మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. పారిస్ ఒప్పంద ఉద్దేశాలు, లక్ష్యాలను, యూఎన్ఎఫ్‌సీసీసీ లక్ష్యాలను సాధించడంలో ఐక్యంగా ఉండాలని మేం నిర్ణయించుకున్నాం. యూఎన్ఎఫ్‌సీసీసీ, దాని పారిస్ ఒప్పందంలో భాగస్వామ్య దేశాలుగా ప్రస్తుత నిబద్ధతను నిలబెట్టుకోవాలని, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలను కొనసాగించాలని, ఆ ప్రయత్నాలను మరింత పెంచాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నాం. యూఎన్ఎఫ్‌సీసీసీ లక్ష్యాల సాధనకూ, అలాగే పారిస్ ఒప్పందాన్ని సంపూర్ణంగా, ప్రభావవంతంగా అమలు చేసి బలోపేతం చేయడం ద్వారా వాతావరణ మార్పు సమస్యలను పరిష్కరించడానికి స్థిరంగా కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. వాతావరణ మార్పులను మితీకరించే నిబంధనలు, అలాగే సమానతనూ ‘దేశాల మధ్య వైవిధ్యంతో కూడిన ఉమ్మడి బాధ్యతల’ సూత్రాన్నీ, వివిధ జాతీయ పరిణామాల నేపథ్యంలో వివిధ సామర్థ్యాలను ప్రతిబింబించేలా అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం వాటిని అమలు చేసే మార్గాలను సూచించడం ఇందులో భాగంగా ఉంటుంది. ఈ విషయంలో బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలో జరగనున్న ‘వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా ఒడంబడిక (యూఎన్ఎఫ్ సీసీసీ)’ సీవోపీ-30 అధ్యక్షతకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రతి దేశ సభ్యత్వం, దానికున్న బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని వర్తించే విధంగా.. యూఎన్ఎఫ్ సీసీసీకి మూల ప్రాతిపదికలైన అన్ని అంశాల్లోనూ కార్యాచరణ, సహకారం ఆవశ్యకతను పునరుద్ఘాటిస్తున్నాం. యూఎన్ఎఫ్ సీసీసీ, దాని పారిస్ ఒప్పందం అమలులో పురోగతిని వేగవంతం చేసి, సీవోపీ 30ని విజయవంతం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేస్తున్నాం. 2028లో సీవోపీ 33 నిర్వహణ కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నాం.

సుస్థిర ప్రగతి, పేదరిక నిర్మూలనకు సంబంధించి వాతావరణ మార్పుపై అంతర్జాతీయ ప్రతిస్పందన మరింత బలోపేతం కావాలని కోరుతున్నాం. వాతావరణ మార్పు ఆవశ్యకతను అవగతం చేసుకుంటూ, ఈ అంశంపై ‘బ్రిక్స్‌’ నాయకత్వ కార్యక్రమానికి ఆమోదం తెలుపుతున్నాం. పరస్పర సాధికారత ద్వారా సమష్టి నాయకత్వంపై మా సంకల్పాన్ని ఇది చాటుతుంది. తదనుగుణంగా బ్రిక్స్‌ దేశాల అభివృద్ధి, అవసరాలు, ప్రాథమ్యాలకు తగిన పరిష్కారాలకు మద్దతిస్తాం. దీంతోపాటు సహకారం మరింత వేగంగా విస్తరించేందుకు కృషి చేస్తాం. దీనివల్ల ‘యూఎన్‌ఎఫ్‌సీసీసీ', పారిస్ ఒప్పందం సంపూర్ణ అమలు సాధ్యమవుతుంది. ఈ పరిణామంతో బహుళపాక్షికత ప్రయోజకత్వం స్పష్టమవుతుంది. అంతేగాక వర్ధమాన దేశాల మధ్య సహకారం ఎంత ప్రభావశీలమైనదో విదితం కాగలదు. మరింత మెరుగైన భవిష్యత్తు దిశగా సమగ్ర, సుస్థిర పాలనకు అది రూపమివ్వగలదు.


వాతావరణ కార్యాచరణను సుస్థిర ప్రగతితో జోడించే నిష్పాక్షిక, పరిణామశీల మార్గాల దిశగా వర్ధమాన దేశాలకు సకాలంలో, సముచిత ఆర్థిక సహాయం అందుబాటులో ఉండటం అత్యంత కీలకమన్నది మా నిశ్చితాభిప్రాయం. ‘యూఎన్‌ఎఫ్‌సీసీసీ', పారిస్ ఒప్పందం ప్రకారం వనరుల కేటాయింపు, సమీకరణకు బాధ్యత వహించడం వర్ధమాన దేశాల పట్ల అభివృద్ధి చెందిన దేశాల కర్తవ్యమని స్పష్టీకరిస్తున్నాం. బహుళపాక్షికత, అంతర్జాతీయ సహకారానికి కట్టుబడి నిష్పాక్షిక, సుస్థిర అంతర్జాతీయ ద్రవ్య-ఆర్థిక వ్యవస్థ కోసం ప్రపంచ దేశాల ఏకీకరణకు నాయకత్వం వహించాలని నిశ్చయించుకున్నాం. ఆ మేరకు వాతావరణ మార్పుపై నిధుల సమీకరణ సంబంధిత నాయకత్వ ముసాయిదా ప్రకటనను ఆమోదించాం. మా ఆర్థిక శక్తి, ఆవిష్కరణ సామర్థ్యం ద్వారా ఆకాంక్షాత్మక వాతావరణ కార్యాచరణ ప్రణాళిక అమలుతో ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు, మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని నిరూపించగలం. ‘యూఎన్‌ఎఫ్‌సీసీసీ' లక్ష్యాలు, సూత్రాలు, నిబంధనలు, క్యోటో సదస్సు తీర్మానాలు సహా పారిస్ ఒప్పందం నిర్దేశిత విధివిధానాలనూ గౌరవించాలని మరింత స్పష్టంగా పునరుద్ఘాటిస్తున్నాం. ముఖ్యంగా విభిన్న జాతీయ పరిస్థితుల దృష్ట్యా వాటిలో ప్రతిపాదించిన సమానత్వం, ఉమ్మడి-విడివిడి బాధ్యతలు, సామర్థ్యాలను సముచిత రీతిలో పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం.


భూతాప కారక వాయు ఉద్గారాల మదింపు నిమిత్తం పరస్పర ఆమోదిత పద్ధతులు-ప్రమాణాల వినియోగం సముచితమని అంగీకరిస్తున్నాం. కర్బన అకౌంటింగ్ ఆధారిత వ్యవస్థలు, ప్రమాణాలు-పద్ధతుల రూపకల్పనకు మార్గనిర్దేశం చేయగల సమతుల అంతర్జాతీయ విధానం కోసం బ్రిక్స్‌ సూత్రాలు, ఉత్పత్తి-సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని అభినందిస్తున్నాం. విజ్ఞాన అంతరాలను గుర్తించడం, అదనపు కృషి ద్వారా వాటిని సరిదిద్దడం ఎంత అవసరమో మేం స్పష్టంగా పేర్కొన్నాం. నిర్దిష్ట రంగాల్లో, అన్నిరకాల భూతాప కారక వాయువుల విషయంలో ఈ సూత్రాలను సందర్భోచితంగా వినియోగించడం, కర్బన అకౌంటింగ్‌ సహిత విధాన చట్రాలకు మద్దతివ్వడంలో వాటి సామర్థ్యాన్ని అంచనా వేయడం అవశ్యమని విశదం చేశాం. మేధా సంపత్తి అంశంపై బ్రిక్స్ నివేదికకు ఆమోదాన్ని హర్షిస్తున్నాం. వాతావరణంపై సహకార ఒప్పందాల ఖరారులో ఇది మెరుగైన ఉపకరణం కాగలదు. దీన్ని బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సమీక్షించే అవకాశం కూడా ఉంది. సాంకేతికత అభివృద్ధికి మద్దతుతోపాటు పరిజ్ఞానాల బదిలీని వేగిరపరచడమే వాస్తవ లక్ష్యం. మొత్తం మీద ఇది వాతావరణ కార్యాచరణకు కీలక దోహదకారి కాగలదు.


సార్వత్రిక, సహకారాత్మక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సృష్టికి ప్రోత్సాహం దిశగా విస్తృత సహకారం అవసరమన్నది మా నిశ్చితాభిప్రాయం. తద్వారా సుస్థిర వృద్ధి, అభివృద్ధికి కొత్త బాటలు పడతాయి. ప్రత్యేకించి వర్ధమాన దేశాలు వాతావరణ మార్పు సమస్యలను చక్కగా పరిష్కరించుకునే వీలు కలుగుతుంది. వాతావరణ మార్పుపై చర్యల్లో వివక్షకు తావుండరాదని కూడా స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఏకపక్ష చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి నిర్హేతుక లేదా అసంబద్ధ ఆటంకాలు కారాదన్నది మా ఉద్దేశం. వాణిజ్యం, పర్యావరణం రెండింటికీ సంబంధించిన మిశ్రమ చట్టబద్ధ చర్యల వల్ల అటు అవకాశాలు... ఇటు సవాళ్లు కూడా ఉంటాయి. పర్యావరణ లక్ష్యాల సాధన దిశగా ఏకపక్ష వాణిజ్య ఆంక్షల ప్రయోగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్రిక్స్ సభ్యదేశాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. అందుకే వాణిజ్యం, వాతావరణ మార్పు, సుస్థిర ప్రగతి లక్ష్యంగా ‘బ్రిక్స్ ప్రయోగశాల’ను ఏర్పాటు చేశాయి. ఇది వాణిజ్య, పర్యావరణ విధానాల్లో పరస్పర చేయూతను ప్రోత్సహిస్తుంది. ఈ సహకారంతో బ్రిక్స్ దేశాలు మెరుగైన వాణిజ్య ప్రయోజనాలు పొందవచ్చు... ఏకపక్ష చర్యలను సమష్టిగా ఎదుర్కొనవచ్చు. ప్రపంచ వాతావరణ మార్పు సంబంధిత కార్యక్రమాలకు తమవంతుగా తోడ్పడవచ్చు.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ వాతావరణ పరిశోధన వేదిక నిబంధనలకు ఆమోదాన్ని హర్షిస్తున్నాం. బ్రిక్స్ సభ్యదేశాల శాస్త్రవేత్తలు-నిపుణుల మధ్య అభిప్రాయాలు, విజ్ఞానం, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం పెరగడంలో ఇది అర్థవంతంగా తోడ్పడుతుందని గుర్తించాం.


సుస్థిర ప్రగతి, పర్యావరణ సమగ్రతకు ఊతమిస్తూ ఆకాంక్షాత్మక వాతావరణ ఉపశమన చర్యలను ప్రోత్సహించే కీలక ఉపకరణంగా పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6ను మేం గుర్తించాం. ఈ కృషికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులను సమీకరించే మార్గాలను కూడా ఇది సూచిస్తుంది. ఈ విధానాల బలోపేతం ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి ఉత్ప్రేరకం కాగలదు. దీంతోపాటు సాంకేతిక పరిజ్ఞాన బదిలీని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మనం జతచేయవచ్చు. బ్రిక్స్ కర్బన మార్కెట్ల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం నిబంధనలను, సహకారాన్ని ప్రోత్సహించడంలో దాని ప్రాధాన్యాన్ని మేం గుర్తించాం. దీంతోపాటు సామర్థ్య వికాసం, అనుభవాల ఆదానప్రదానంపైనా ఇది ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఉపశమన చర్యల అమలుకు తోడ్పాటు సహా అవసరమైన వనరుల సమీకరణ, సభ్యదేశాల కార్యాచరణ వ్యూహాలకు మద్దతిచ్చే సహకార విధానంగా ఇది అమలు కావాలని ఆకాంక్షిస్తున్నాం.


అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా లేని ఏకపక్ష, శిక్షాత్మక, వివక్షపూరిత స్వీయ-రక్షణాత్మక చర్యలను తిరస్కరిస్తున్నాం. అలాగే పర్యావరణ సమస్యల సాకుతో ఏకపక్ష, వివక్షపూరిత కర్బన సరిహద్దు సర్దుబాటు విధానాలను (సీబీఏఎం), అటవీ నిర్మూలన నియంత్రణ, వివేచనాత్మక నిబంధనలు, పన్నుల విధింపు వంటి ఇతరత్రా చర్యలను కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ మేరకు వాతావరణం లేదా పర్యావరణం ప్రాతిపదికన ఏకపక్ష వాణిజ్య ఆంక్షలను నిరసింంచాలన్న ‘కాప్‌28’ పిలుపును పూర్తిస్థాయిలో సమర్థిస్తున్నాం. ప్రపంచ సరఫరా-ఉత్పత్తి శ్రేణులను ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేసే, పోటీతత్వాన్ని వక్రీకరించే ఏకపక్ష స్వీయ-రక్షణాత్మక చర్యలను కూడా నిరాకరిస్తున్నాం.


ఇంధన ఉత్పాదన-వినియోగం రెండింటిలోనూ ప్రధాన పాత్రధారులుగా మా సమష్టి బాధ్యతను గుర్తించాం. ఈ నేపథ్యంలో జాతీయ పరిస్థితులను బట్టి నిష్పాక్షిక, సార్వజనీన ఇంధనం వైపు మళ్లడంపై మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం. దీంతోపాటు సుస్థిర ప్రగతి లక్ష్యం 7 (ఎస్‌డీజీ)కు అనుగుణంగా అందరికీ అందుబాటులో, ఆధునిక ఇంధన సార్వత్రిక లభ్యతకు భరోసా ఇస్తున్నాం. ఈ లక్ష్యం దిశగా ప్రగతిని వేగిరపరచడం కోసం బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం విస్తృతం కావాలన్నది మా ఆకాంక్ష. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ బ్రిక్స్ సీనియర్ ఇంధన అధికారుల కమిటీ, బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదికల విస్తృత కృషిని అభినందిస్తున్నాం. బ్రిక్స్ ఇంధన సహకారం 2025–2030 దిశగా నవీకరించిన ప్రణాళికను, ఇంధన సేవలు సహా నవ్య-సుస్థిర ఇంధన లభ్యతపై ప్రస్తుత వివరణను గుర్తించాం. అలాగే జూన్ 9, 10 తేదీల్లో బ్రెసీలియాలో నిర్వహించిన 7వ బ్రిక్స్ యువశక్తి శిఖరాగ్ర సదస్సు తీర్మానాలపైనా దృష్టి సారించాం.


అన్ని దేశాల సంక్షేమం, జాతీయ భద్రత సహా సామాజిక, రాజకీయ, ఆర్థికాభివృద్ధికి ఇంధన భద్రతే కీలక పునాది. అందుకే ఇంధన భద్రత ఇనుమడించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాం. ఈ దిశగా ఇంధన మార్కెట్ స్థిరత్వం, భిన్న వనరుల నుంచి నిరంతర ఉత్పాదన, విలువ శ్రేణుల బలోపేతం, పునరుత్థాన-కీలక ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ, సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై దృష్టి సారించడం అవశ్యం. ప్రపంచ ఇంధన మిశ్రమంలో శిలాజ ఇంధనాలు... ముఖ్యంగా వర్ధమాన విపణులు, ఆర్థిక వ్యవస్థలలో ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తుండటం వాస్తవం. అందువల్ల నిష్పాక్షిక, క్రమబద్ధ, సమాన, సార్వజనీన ఇంధన మార్పిడిని ప్రోత్సహించడంతోపాటు భూతాప కారక ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా మన వాతావరణ లక్ష్యాలను, ‘ఎస్‌డీజీ7, సాంకేతిక పరిజ్ఞాన తటస్థత సూత్రాలు, జాతీయ పరిస్థితులు, అవసరాలు-ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. సార్వత్రిక-విభిన్న బాధ్యతలు, సామర్థ్యాలకు అనుగుణంగా ఇది కొనసాగాలి. వాతావరణ మార్పులకు పరిష్కారం, ఇంధన మార్పిడికి ప్రోత్సాహం మధ్యగల పరస్పర సంబంధాన్ని మేం గుర్తించాం. ఆ మేరకు ‘యూఎన్‌ఎఫ్‌సీసీసీ’, పారిస్ ఒప్పందం, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా స్థిరమైన మార్గంలో ఆర్థికాభివృద్ధిపై మా సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.


ఇంధన మార్పిడి కార్యక్రమాలకు నిధుల సమీకరణలో అంతరం తగ్గించే దిశగా ఆర్థిక సహాయం లభ్యతలో సహకారానికి ప్రోత్సాహం, పెట్టుబడుల పెంపు అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. అలాగే పారిస్‌ ఒప్పందం నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా నిష్పాక్షిక, సమ్మిళిత ఇంధన మార్పిడి కోసం అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు తగినన్ని నిధులు సమకూరాలి. ఈ ఆర్థిక సహాయం కూడా సకాలంలో, సముచిత షరతులు-రాయితీలతో అందాలి. సుస్థిర అభివృద్ధి కోసం మార్కెట్‌ లభ్యత, సాంకేతికత, తక్కువ వడ్డీతో రుణ సౌలభ్యం వంటివి వివక్షరహితంగా అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేస్తున్నాం.


శూన్య-స్వల్ప (1) స్థాయి ఉద్గార సాంకేతికతల రూపకల్పన, ఇంధన భద్రతతోపాటు ఇంధన సరఫరా శ్రేణుల పునరుత్థానంలో కీలక ఖనిజాల ప్రధాన పాత్రను మేం గుర్తించాం. వీటి లభ్యత దిశగా విశ్వసనీయ, బాధ్యతాయుత, వైవిధ్యభరిత, పునరుత్థాన, సముచిత, సుస్థిర, నిష్పాక్షిక సరఫరా వ్యవస్థలను ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టీకరిస్తున్నాం. సమృద్ధ వనరులున్న దేశాల్లో ప్రయోజనాల భాగస్వామ్యానికి హామీ, విలువ జోడింపు, ఆర్థిక వైవిధ్యీకరణకు ఇది తోడ్పడుతుంది. అలాగే ఖనిజ వనరుల నిర్వహణ సహా చట్టబద్ధ విధానాల అమలు, లక్ష్యాల సాధనకు చర్యలు చేపట్టడంపై ఆయా దేశాల హక్కుల సంపూర్ణ రక్షణకు భరోసా లభిస్తుంది.


అన్ని దేశాలకూ సుస్థిర భవిష్యత్తు, సమాన-నిష్పాక్షిక ఇంధన మార్పిడి దిశగా ప్రపంచవ్యాప్త కృషికి బ్రిక్స్‌ నుంచి, దేశాల మధ్య సహకారం ప్రధానమని ప్రకటిస్తున్నాం. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, సాధారణ వనరుల వినిమయంతో లభించే ప్రయోజనాలను న్యాయంగా-సమానంగా పంచుకోవడం, జీవ వైవిధ్యంపై తీర్మానంతోపాటు విధివిధానాలను పాటించడంలో నిబద్ధత అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. అలాగే కున్మింగ్-మాంట్రియల్ అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులు నిర్దేశించిన చట్రం సమర్థ అమలు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నాం. కున్మింగ్ జీవవైవిధ్య నిధి ఏర్పాటు, దానికి చైనా ప్రభుత్వం తనవంతు వాటా సమకూర్చడాన్ని అభినందిస్తున్నాం. మరోవైపు వర్ధమాన దేశాల్లో జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతు దిశగా చైనా కీలక పాత్రను, కున్మింగ్-మాంట్రియల్ చట్రం అమలులో సహకారాన్ని కొనియాడుతున్నాం. ‘కాప్‌16’ చర్చల్లో... ముఖ్యంగా వనరుల సమీకరణను ముమ్మరం చేయడంలో బ్రిక్స్ దేశాల క్రియాశీల పాత్రను మేం గుర్తించాం. వర్ధమాన దేశాలకు తగు పరిమాణంలో, సకాలంలో, అంచనాల మేరకు, సమర్థ రీతిలో ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరుతున్నాం. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, జీవ వైవిధ్య వాడకంతో లభించే ప్రయోజనాల్లో సముచిత, సమాన భాగస్వామ్యం దిశగా సామర్థ్య వికాసం, సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పన-బదిలీలో సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవవైవిధ్య పరిరక్షణ, జల పరీవాహకాలు-భూసార సంరక్షణ, ఆర్థిక రంగాలకు అధికమూల్యంగల కలప, కలపేతర అటవీ ఉత్పత్తుల సరఫరా, జలసంబంధ ఆవర్తన నియంత్రణ, ఎడారీకరణ నిరోధం, కీలక కర్బన సంగ్రహణ మూలాలుగా ఉష్ణమండల అడవులు సహా అన్నిరకాల అడవుల కీలక పాత్ర వగైరాలను స్పష్టంగా వివరించాం. ముఖ్యమైన ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ- పునరుద్ధరణను ప్రోత్సహించే “యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్స్” కార్యక్రమాన్ని అభినందిస్తున్నాం. అరుదైన జంతుజాతుల సంరక్షణలో మన దేశాల కృషికి అభినందనలు తెలుపుతూ- అదే సమయంలో పులులు, సింహాల మనుగడకు ముప్పును గుర్తించాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ‘బిగ్ క్యాట్స్ అలయన్స్‌’ ఏర్పాటు, ఇందులో బ్రిక్స్ దేశాల పాత్రకు ప్రోత్సాహం దిశగా భారత్‌ చొరవను కూటమి ప్రశంసిస్తోంది.


బెలమ్‌లో ‘కాప్‌30’ సందర్భంగా ‘ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ’ని ప్రారంభించే ప్రణాళిక హర్షణీయం. ఉష్ణమండల అటవీ సంరక్షణ దిశగా దీర్ఘకాలిక, ఫలితాధారిత ఆర్థిక సహాయ సమీకరణకు రూపొందించిన ఒక వినూత్న విధానంగా దీన్ని గుర్తించాం. ఇందుకు అవసరమైన పెట్టుబడుల సేకరణ, సకాలంలో దీన్ని ప్రారంభించే కార్యాచరణపై భరోసా దిశగా ప్రతిష్ఠాత్మక సహకార చర్యలను ప్రకటించాల్సిందిగా విరాళ ప్రదాన దేశాలను అభ్యర్థిస్తున్నాం.


శాస్త్రీయ పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక నైపుణ్య వినియోగం ద్వారా సుస్థిర అటవీ నిర్వహణ-నియంత్రణలో బ్రిక్స్ దేశాలకు అపార అనుభవం ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఆ మేరకు అడవులు, అటవీ సంబంధ సవాళ్ల పరిష్కారం, లక్ష్యాల సాధనకు సంబంధించి అనుభవాల ఆదానప్రదానం, పరిశోధనల నిర్వహణలో బ్రిక్స్ సహకారం పెంపును ప్రోత్సహిస్తాం.


బ్రిక్స్ పర్యావరణ విభాగం కింద రూపుదిద్దుకున్న పర్యావరణ సహకారంపై అవగాహన ఒప్పందంతోపాటు ఇతర సహకార విధానాల తోడ్పాటుతో ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాం. ఇందులో “బ్రిక్స్ ఎన్విరాన్‌మెంటల్లీ సౌండ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్’ (బెస్ట్), “బ్రిక్స్‌ క్లీన్ రివర్స్”, “బ్రిక్స్ పార్టనర్‌షిప్ ఫర్ అర్బన్ ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబిలిటీ” వంటివి అంతర్భాగంగా ఉండాలి. పర్యావరణ సమస్యల పరిష్కారంలో సమాజంలోని వివిధ వర్గాల భాగస్వామ్య ప్రాధాన్యాన్ని గుర్తించాం. ఆ మేరకు “బ్రిక్స్ యూత్ ఎన్విరాన్‌మెంటల్ నెట్‌వర్క్” ఏర్పాటు అవకాశాలను మరింత లోతుగా అన్వేషించాలని భావిస్తున్నాం.
ఎడారీకరణ, భూమి క్షీణత, కరువు సహా ఇసుక-దుమ్ము తుపానులు ప్రజల శ్రేయస్సుకు... ముఖ్యంగా స్థానికులు, సమాజాలు సహా దుర్బల పరిస్థితుల్లో గలవారి జీవనోపాధికి తీవ్ర ముప్పుగా మారడాన్ని గుర్తించాం. తీవ్ర కరువులు లేదా ఎడారీకరణతో సతమతమయ్యే దేశాల్లో... ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో ఆ ముప్పు నివారణ దిశగా ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని తగురీతిలో అమలు చేయడం కోసం ఆర్థిక వనరులను పెంచాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరుతున్నాం. అలాగే సుస్థిర ప్రగతి లక్ష్యం 15.3 నిర్దేశిత భూక్షీణ తటస్థత దిశగా వర్ధమాన దేశాలకు మద్దతును మరింత బలోపేతం చేయాలి.
ప్లాస్టిక్ కాలుష్య పరిష్కారం ద్వారా ద్వారా పర్యావరణ పునరుత్థాన శక్తిని పెంచడంలో బ్రిక్స్‌ దేశాలు కీలక పాత్ర పోషించగలవని గుర్తించాం. ఈ అంశంపై నిష్పాక్షిక, ప్రభావశీల, సమతుల, చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందం అవశ్యమనే దృక్కోణంలో సహకారం, ఏకాభిప్రాయ సాధన స్ఫూర్తి, సంఘీభావంతో ఈ చర్చల్లో మేం కొనసాగుతాం. అదే సమయంలో సముద్రావరణం సహా ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ తీర్మానం 5/14 ప్రకారం- దాని అమలుకు తగిన వనరులపై దృష్టి సారిస్తూ, వర్ధమాన దేశాల అవసరాలు-ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుంటాం. సామర్థ్య వికాసం, విజ్ఞానం-సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల అత్యుత్తమ నిర్వహణపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి. దీంతోపాటు ప్రతి దేశంలోని స్థానిక పరిస్థితులు, సామర్థ్యాలు, నిబద్ధతలను ఈ అంతర్జాతీయ ఒప్పంద పత్రం పరిగణనలోకి తీసుకుంటుంది.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ప్రగతి సాధనలో సహకార విస్తృతికి, బహుళపాక్షికతను సమర్థిస్తూ అంతర్జాతీయ పర్యావరణ విధానాల బలోపేతానికి మా నిబద్ధతను బ్రిక్స్‌ చట్రంలో పునరుద్ఘాటించాం. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, కాలుష్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఏకపక్ష చర్యలు సహా అన్నిరకాల చర్యలూ సంబంధిత బహుళపాక్షిక పర్యావరణ- వాణిజ్య సంబంధిత ఒప్పందాల సూత్రాలు, నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించి అమలు చేయాలి. అయితే, అంతర్జాతీయ వాణిజ్యంపై ఏకపక్ష-అసంబద్ధ వివక్ష లేదా ప్రచ్ఛన్న పరిమితులు విధించేందుకు ఇదొక ఉపకరణం కాకుండా చూడాలి.


వర్ధమాన దేశాలకు మరింత సమతుల, సమానమైన ప్రాతినిధ్యానికి భరోసా ఇస్తూ అవి అనుసరిస్తున్న సహజ మూలధన విలువకు అనుగుణంగా ‘గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ’ విధానాల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మేం గుర్తించాం. ఇందులో భాగంగా విధానాలు-వనరుల లభ్యత సరళీకరణ, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, సుస్థిర వినియోగంలో ప్రత్యక్ష భాగస్వామ్యం సహా ఆయా దేశాల్లోని ప్రజలు, సమాజాలను కూడా మేం సమర్థిస్తాం. తద్వారా వారి గళానికి ప్రాధాన్యంతోపాటు ఓటింగ్‌ విధానాలు మెరుగుపడటం ద్వారా వర్ధమాన దేశాలకు విధాన నిర్ణయాల్లో సమాన హక్కు ఉంటుంది.


బ్రెసీలియాలో 2025 మే 14 నాటి బ్రిక్స్ రవాణా మంత్రుల రెండో సమావేశం తీర్మానాలను మేం స్వాగతిస్తున్నాం. తదనుగుణంగా భాగస్వాముల డిమాండ్లను తీర్చడంతోపాటు బ్రిక్స్ దేశాల రవాణా సామర్థ్యం పెంపు లక్ష్యంగా చర్చలను మరింత ప్రోత్సహించాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో రవాణారంగ సహకారం కొనసాగిస్తూ సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆర్థిక వృద్ధి, అనుసంధానం, పర్యావరణ స్థిరత్వంలో బ్రిక్స్ కీలక పాత్రను గుర్తిస్తూ, సుస్థిర-పునరుత్థాన రవాణా మౌలిక సదుపాయాలు కల్పించడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. మరింత సమాన, నివాసయోగ్య, ఆరోగ్యకర, అనుకూల, స్వల్ప రద్దీగల పట్టణ వాతావరణ సృష్టికిగల ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాం. దీనికి అనుగుణంగా పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయడంతోపాటు క్రియాశీల రవాణాను ప్రోత్సహించడానికిగల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తున్నాం. పట్టణ రవాణాలో శూన్య-స్వల్ప ఉద్గార వాహన వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా మేం గుర్తించాం. ఇందులో భాగంగా విమానయానం, సముద్ర రవాణాలో కర్బన ఉద్గారాలను తగ్గించే అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ప్రాధాన్యాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. అంతర్జాతీయ విమానయానంలో కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా సుస్థిర ఇంధనాలు, స్వల్ప కర్బన ఉద్గార ఇంధనాలు, ఇతర కాలుష్య రహిత ఇంధనాలకుగల ప్రాముఖ్యాన్ని కూడా గుర్తించాం. వీటితోపాటు అనుబంధ సాంకేతికతల రూపకల్పన-విస్తరణలో జాతీయ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ బ్రిక్స్‌ దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహిస్తాం. వైమానిక, నౌకా రవాణా అనుసంధానం మెరుగుదలతోపాటు సముద్ర రవాణాలో శిలాజేతర ఇంధన వినియోగానికి ప్రోత్సాహం, రవాణా సాధనాల ఆవిష్కరణ-ఏకీకరణ కార్యక్రమాల బలోపేతంలోనూ సహకార విస్తృతికిగల ప్రాధాన్యాన్ని మేం స్పష్టం చేస్తున్నాం.
 

మానవ, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి ప్రోత్సాహానికి భాగస్వామ్యాలు

జనాభా విషయంలో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే నిరంతరం మార్పులకు లోనయ్యే జనాభా వయసు తీరు సామాజిక ఆర్థికాభివృద్ధిలో సవాళ్లతో పాటు అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు, యువత పురోగతి, ఉపాధి, పని భవిష్యత్తు, పట్టణీకరణ, వలసలు, వృద్ధ్యాప్యం తదితర అంశాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది.

సమానత్వం, పరస్పర గౌరవం సూత్రాల ఆధారంగా మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి, అన్ని రూపాల్లోని వివక్షను ఎదుర్కోవడానికి దేశాలన్నీ సహకరించుకోవాల్సిన అవసరాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అభివృద్ధి హక్కుతో సహా అన్ని మానవ హక్కులను న్యాయమైన, సమాన రీతిలో, ఒకే ప్రాతిపదికన, ఒకే ప్రాధాన్యంతో కొనసాగించడానికి మేం అంగీకరిస్తున్నాం. ఈ సందర్భంగా, బ్రిక్స్‌ కూటమి లోపల, ఇతర బహుపాక్షిక వేదికల్లో ఉమ్మడి ఆసక్తులకు సంబంధించిన అంశాలపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరిస్తున్నాం. అలాగే పక్షపాత ధోరణి లేని, రాజకీయాలకు అతీతంగా, నిర్మాణాత్మక పద్ధతిలో, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, విస్తృత చర్చలు, సహకారంతో మానవ హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించి, నెరవేర్చాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజాస్వామ్యం, మానవ హక్కులను గౌరవించాలని మేం పిలుపునిస్తున్నాం. అంతర్జాతీయ, జాతీయ పాలనా స్థాయుల్లో వాటిని అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాం. పరస్పర ప్రయోజనకరమైన సహకారం ఆధారంగా అంతర్జాతీయ సమాజానికి ఉజ్వలమైన ఉమ్మడి భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ప్రోత్సహించి, పరిరక్షించడంలో మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకారం, జాతి వివక్ష, జావివివక్షా భయం, ఇతర విద్వేషాలతో పాటు మతం, విశ్వాసం, నమ్మకం ఆధారంగా చూపించే వివక్ష, వాటి సమకాలీన రూపాలన్నింటికీ వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాం. వీటిలో పెరుగుతున్న ద్వేష పూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం తదితర ఆందోళనకర ధోరణులు కూడా ఉన్నాయి. ఆఫ్రికన్ సంతతి ప్రజల కోసం రెండో అంతర్జాతీయ దశాబ్దం (2025 – 2034)గా నిర్ణయిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. అలాగే 2025ను ‘‘పరిహారాల ద్వారా ఆఫ్రికన్లు, ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు న్యాయం’’ ’ ఏడాదిగా ప్రకటించాలనే ఆఫ్రికన్ యూనియన్ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వలసవాదం, బానిస వ్యాపారానికి సంబంధించిన విధ్వంసక విధానంపై పోరాడేందుకు ఆఫ్రికన్ యూనియన్ చేపడుతున్న ప్రయత్నాలను గుర్తించాం.

బీజింగ్ డిక్లరేషన్, ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా.. అన్ని రంగాల్లోనూ మహిళల హక్కులు, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా చిత్తశుద్ధిని మరోసారి తెలియజేస్తున్నాం. మహిళా సాధికారతకు, విద్య, వాణిజ్యాలతో సహా అన్ని రంగాల్లో వారికి సంపూర్ణమైన, సమానమైన, అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించడానికి ఉన్న ప్రాధ్యాన్యాన్ని తెలియజేస్తున్నాం. సమానత్వం, అభివృద్ధి, శాంతిని సాధించడానికి ప్రాథమికమైన నిర్ణయాత్మక ప్రక్రియల్లో మహిళల చురుకైన సహకార ప్రాముఖ్యాన్ని కూడా వివరిస్తున్నాం. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో సుస్థిరాభివృద్ధిలో, వాతావరణ మార్పులపై ప్రణాళిక, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో మహిళలు, బాలికల పాత్రను స్పష్టం చేస్తున్నాం. ఆన్‌లైన్లో స్త్రీలపై సాగే పురుషాధిక్య వ్యాఖ్యలు, తప్పుడు సమాచార వ్యాప్తి వల్ల ఎదురయ్యే ప్రభావాలకు సంబంధించి బ్రెజిల్ అధ్యక్షతన జరిగిన చర్చలను అంగీకరిస్తున్నాం.

డిజిటల్ అంతరం, స్త్రీపురుషల పరంగా ఉన్న డిజిటల్ అంతరాలను తొలగించడంతోపాటు మహిళలకు భద్రత కల్పిస్తూ.. వారి అభిప్రాయం, చురుకైన భాగస్వామ్య అవసరాన్ని తెలియజేస్తున్నాం. అందుబాటులో చిన్నారుల సంరక్షణ, స్టెమ్ రంగాల్లో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పని ప్రదేశాల్లో వివక్ష, అన్ని రూపాల్లోని హింస నుంచి మహిళలకు చట్టపరమైన రక్షణను బలోపేతం చేయడం వంటి విధాన చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణమైన, సమానమైన మహిళా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం.

2025, జూన్ 17న బ్రెజీలియాలో జరిగిన 15వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశంలో సాధించిన పురోగతిని, ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయాలను మేం ప్రశంసిస్తున్నాం.బ్రిక్స్‌ దేశాల ఆరోగ్య సంస్థల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్ ఆర్ అండ్ డీ స్టాక్, బ్రిక్స్ టీబీ రీసెర్చి నెట్వర్క్ కార్యకలాపాలతో సహా బ్రిక్స్ ఆర్ అండ్ డీ వ్యాక్సిన్ సెంటర్ చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నాం. అలాగే ఆరోగ్య వ్యవస్థల్లో నైతికమైన, సమర్థవంతమైన కృత్రిమ మేధ వినియోగం, విస్తృతమైన డేటా గవర్నెన్స్‌ కార్యకలాపాలకు సైతం తోడ్పాటు అందిస్తున్నాం. సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజీతో పాటు సరైన సమయంలో అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తదితర ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి స్థిరమైన, న్యాయమైన, సమ్మిళిత, ఆరోగ్య వ్యవస్థలను ప్రోత్సహించే ఈ కార్యకలాపాల ప్రాధాన్యతను తెలియజేస్తున్నాం. టీబీ, ఏఎంఆర్‌లను ఎదుర్కోవడంలో, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులను నియంత్రించే సామర్థ్యాలను బలోపేతం చేయడంలో బ్రిక్స్ సహకారాన్ని గుర్తించాం. అలాగే సంప్రదాయ వైద్య విధానాలు, డిజిటల్ హెల్త్‌ సహా ఇతర ఆరోగ్య అంశాలపై అనుభవాన్ని పంచుకొనేలా చేపడుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు గొప్ప సహకారం అందిస్తోందని తెలియజేస్తున్నాం. బ్రిక్స్ దేశాల్లో ఉన్నత స్థాయి ప్రజా ఆరోగ్య సంస్థల మధ్య సహకారానికి బ్రిక్స్ నెట్వర్క్ ఆఫ్ రీసెర్చి ఇన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్‌‌ను ముఖ్యమైన వేదికగా మేం గుర్తించాం. బ్రిక్స్ న్యూక్లియర్ మెడిసిన్ వర్కింగ్ గ్రూపులో న్యూక్లియర్ ఔషధ, రేడియో ఫార్మసీ రంగాల్లో సహకరించుకోవాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. బ్రిక్స్ మెడికల్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీస్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద నియంత్రణ ఏకీకరణను ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాముఖ్యాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం.

సామాజికంగా నిర్వచించిన వ్యాధుల నిర్మూలనకు భాగస్వామ్యాలను అభివృద్ధి చేసే దిశగా చేపట్టిన ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. ఆరోగ్య సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ప్రపంచ ఆరోగ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించే కీలకాంశంగా ఈ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. సమగ్రమైన, బహుళ రంగాల ప్రయత్నాలకు ప్రాధాన్యమిస్తూ.. పేదరికం, సామాజిక బహిష్కరణ లాంటి ఆరోగ్య అసమానతలకు మూల కారణాలను పరిష్కరించడమే లక్ష్యంగా అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి సహకార విస్తరణ, వనరుల సమీకరణ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం.

సార్వత్రిక ఆరోగ్య కవరేజికి, ఆరోగ్య వ్యవస్థ స్థిరత్వానికి అలాగే ప్రజారోగ్యంలో అత్యసవర పరిస్థితుల నివారణ, స్పందనలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పోషిస్తున్న ప్రాథమిక పాత్రను మేం గుర్తించాం. అసాంక్రమిక (1) వ్యాధుల నివారణ-నియంత్రణ, మానసిక ఆరోగ్య శ్రేయస్సును పెంపొందించడంపై ఐక్యారాజ్యసమితి సాధారణ అసెంబ్లీ నాలుగో అత్యున్నత స్థాయి సమావేశం విజయవంతంగా జరగాలని ఎదురుచూస్తున్నాం. ఇది ఈ వ్యాధుల నివారణ, గుర్తించడం, చికిత్సకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చిస్తుంది.

బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో బ్రిక్స్ సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ) సహకార కూటమి చార్టర్ ను స్వీకరించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. మా దేశాల్లో సుస్థిరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో, సామాజిక సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించడంలో వ్యూహాత్మక ప్రాధాన్యంగా కొనసాగుతున్న సాంకేతిక, వృత్తి విద్యను విస్తరించేలా మా ఉమ్మడి నిబద్ధతను ఈ చార్టర్ పునరుద్ఘాటిస్తుంది. బ్రిక్స్ నెట్వర్క్ విశ్వవిద్యాలయం (బ్రిక్స్ - ఎన్‌యూ) సంస్థాగతంగా బలోపేతమవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. సభ్య దేశాల నుంచి పాల్గొనే సంస్థల సంఖ్య పెరగడం, కొత్త సభ్య దేశాల భాగస్వామ్యం, సహకారం కోసం వైవిధ్యమైన రంగాల నేపథ్యంతో ఈ విశ్వవిద్యాలయం పదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది. మా విద్యాసంస్థల మధ్య ప్రత్యక్ష చర్చలను ప్రోత్సహించడంలో బ్రిక్స్-ఎన్‌యూ అందిస్తున్న ముఖ్యమైన సహకారాన్ని గుర్తించాం. అలాగే భవిష్యత్తులో ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం. బ్రిక్స్ విశ్వవిద్యాలయాల కోసం సమగ్ర నాణ్యతా అంచనా వ్యవస్థను అన్వేషించడానికి, బ్రిక్స్‌లో ఈ వ్యవస్థ గుర్తింపు కోసం నాణ్యమైన విద్యను అందించడానికి మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తున్నాం.

సంస్కృతిపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులో సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, సృజనాధారిత ఆర్థిక వ్యవస్థపై బ్రిక్స్ వేదికను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే బ్రిక్స్ సభ్య దేశాల సాంస్కృతిక, సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలకు మద్దతు, ప్రోత్సాహం అందించే కార్యక్రమాలను రూపొందించేలా సభ్యులను, వారి సంబంధిత సాంస్కృతిక సంస్థలు, ఆర్థిక సంస్థలను ప్రోత్సహిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ప్రాధాన్యం, తోడ్పాటును గుర్తిస్తున్నాం.సాంస్కృతిక, వారసత్వాన్ని వాటి సొంత దేశాలకు తిరిగి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనుఆధిపత్య ధోరణి లేనిసహకార ఆధారమైన అంతర్జాతీయ సంబంధాలను పునర్నించడంలో దాని సామర్థ్యాన్ని మేం తెలియజేస్తున్నాంఅలాగే సామాజిక సమైక్యతసాంస్కృతికచారిత్రక న్యాయంసమన్వయంసామాజిక చరిత్రను ప్రోత్సహించే ప్రయాణంలో ఈ అంశంపై మరింత దృఢమైన అంతర్జాతీయ వ్యవస్థ అవసరాన్ని మేం గుర్తించాం.

సమకాలీన సవాళ్లు, మార్పుల సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకొని విద్య, సైన్స్, సంస్కృతి, కమ్యూనికేషన్, సమాచార రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో మా చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో యునెస్కో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల అన్వయాన్ని, సమానత్వం, చర్చలు, తప్పనిసరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఏకాభ్రిప్రాయ స్ఫూర్తి ఆధారంగా ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా సహకారాన్ని, శాంతిని పెంపొందించాలనే ఆదేశాన్ని గమనించాలి. సాంస్కృతిక వారసత్వం, సంస్కృతిని పరిరక్షించే రంగాల్లో బ్రిక్స్ సహకారానికి ఉన్న ప్రాముఖ్యాన్ని మేం వివరిస్తున్నాం. సాంస్కృతిక విధానాలు, సుస్థిరాభివృద్ధిపై యునెస్కో ప్రపంచ సదస్సు, న్యూఢిల్లీలో జరిగిన జీ20, రియో డి జనీరో నాయకుల ప్రకటనలను గుర్తు చేసుకుంటూ.. సృజనాత్మకత, ఆవిష్కరణ, సమ్మిళిత ఆర్థికాభివృద్ధితో సహా సమగ్రాభివృద్దికి ఉత్ప్రేరకంగా సంస్కృతి ప్రదర్శించే శక్తిని మేం గుర్తించాం. అలాగే అన్ని ధృవాలు, కోణాల నుంచి ఏకాభిప్రాయం, చర్చలు, భాగస్వామ్యం, సహకారం పెంపొందించడంలో దాని సహజ విలువను కూడా మేం గుర్తించాం.

అన్ని బ్రిక్స్ దేశాలు గొప్ప సంప్రదాయ క్రీడా సంస్కృతిని కలిగి ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ, స్థానిక, దేశీయ క్రీడలను ప్రోత్సహించడంలో ఒకరికొకరు సహకరించుకోవడానికి అంగీకరిస్తున్నామని మేం స్పష్టం చేస్తున్నాం. జాతీయ, సంప్రదాయ, ఒలింపికేతర క్రీడల అభివృద్ధితో పాటు వివిధ క్రీడా విభాగాల్లో సహకార విస్తరణ, బ్రిక్స్ దేశాల పరిధిలో జరిగే అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించడం,శారీరక దారుఢ్య సంస్కృతి, క్రీడా రంగాల్లో ఉమ్మడి అంశాలపై అభిప్రాయాను పంచుకోవడం ప్రాధాన్యం గురించి మేం చెబుతున్నాం. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో శారీరక దారుఢ్య సంస్కృతి, క్రీడా రంగాల్లో సహకారానికి అవగాహనా ఒప్పందాన్ని ఆమోదించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే దాని అమలుకు మద్దతు ఇచ్చేలా బ్రిక్స్ దేశాల క్రీడా సహకార వ్యవస్థ అవసరాన్ని మేం అంగీకరిస్తున్నాం.

సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత, మానవ(1) కేంద్రక శ్రామిక మార్కెట్ల ద్వారా అత్యంత నాణ్యమైన, సంపూర్ణమైన, ఉత్పాదకత కలిగిన ఉపాధిని ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాలు సాధించిన ప్రగతిని అభినందిస్తున్నాం. కృత్రిమ మేధ.. కార్మిక సంబంధాలను మారుస్తుందని, నూతన ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని గుర్తించాం. అలాగే ఉద్యోగాల్లో కోతలు, అసమానతల వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని గమనించాం. ముఖ్యంగా మహిళలు, యువత, వయసు పైబడిన కార్మికులు, దివ్యాంగులు, వెనకబడిన పరిస్థితుల్లో ఉన్న ఇతర వ్యక్తులు డిజిటల్ మార్పుల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో.. ఏఐ వల్ల అందరికీ మేలు జరిగేలా, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించుకొనే సమ్మిళిత విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో డిజిటల్ నైపుణ్యాలను అనునిత్యం పెంపొందించుకోవడానికి, సామాజిక భద్రతను, కార్మికుల హక్కులను బలోపేతం చేయడానికి, మానవ కేంద్రక విధానాన్ని పరిరక్షించడానికి జాతీయ విధానాలను, నిబంధలను, వర్తించే అంతర్జాతీయ ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటాం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించడం, అసంఘటిత ఆర్థిక వ్యవస్థతో సహా అన్ని రంగాల్లో న్యాయపరమైన మార్పులను సాధించే అంశంలో కీలక భాగస్వాముల మధ్య చురుగ్గా సామాజిక చర్చలు నిర్వహించడం, తగినంత పనిని కల్పించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాం.

బ్రిక్స్ దేశాల్లో ప్రజా సంబంధాల మధ్య పరస్పర అవగాహన, స్నేహం, సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం. మా సమాజాలను బలోపేతం చేయడంలో, మా ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ప్రజా (1) సంబంధాలు పోషిస్తున్న పాత్రను గుర్తించాం. అలాగే పార్లమెంటరీ ఫోరం, బిజినెస్ కౌన్సిల్, విమెన్స్ బిజినెస్ అలయన్స్, యూత్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ ఫోరం, థింక్ ట్యాంక్ కౌన్సిల్, అకడమిక్ ఫోరం, డీన్స్ ఫోరం, పౌర మండలి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫోరం, నగరాలు, మున్సిపాలిటీల సంఘం, సుప్రీం ఆడిట్ సంస్థలు, లీగల్ ఫోరం, బ్రిక్స్ సుప్రీం కోర్టు అధ్యక్షుల సమావేశం, బ్రిక్స్ ప్రాసిక్యూషన్ సేవల అధిపతులు సమావేశం సహా 2025లో బ్రెజిల్ అధ్యక్షతన సాధించిన పురోగతిని అభినందిస్తున్నాం. సంస్కృతుల వైవిధ్యాన్ని గౌరవించడానికి, వారసత్వం, ఆవిష్కరణ, సృజనాత్మకతకు అధిక విలువను ఇవ్వడానికి, అంతర్జాతీయంగా ప్రజల మధ్య సంబంధాలు, సహకారాన్ని సంయుక్తంగా సమర్థించడానికి, ‘‘ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్’’ అనే యూఎన్‌జీఏ తీర్మానంఎ/ఆర్ఈఎస్/78/286 ఆమోదాన్ని గుర్తించాలని పిలుపునిస్తున్నాం.

2025 జూన్ 3 నుంచి 5 వరకు బ్రెసిలియాలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం, అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఛైర్‌పర్సన్‌ల సమావేశంతో సహా విజయవంతంగా నిర్వహించిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంను ప్రశంసిస్తున్నాం. మా సమష్టి ప్రయత్నాల్లో పార్లమెంటరీ దౌత్యం, అంతర పార్లమెంటరీ సహకారం కీలకమైన అంశాలు. ఇవి పరస్పర అవగాహనను, దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడానికి, సమ్మిళిత్వం, ఏకత్వం, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడానికి సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకొనేలా మద్దతిచ్చే ప్రత్యేకమైన మార్గంగా పనిచేస్తాయి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నిర్మాణాత్మక నిధుల తోడ్పాటు, నమ్మకమైన సమాచారం, ఉత్తమ పద్ధతులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మా దేశాల్లో యువజన విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మేం పునరుద్ఘాటిస్తున్నాం. సహకారానికి సంబంధించిన సమగ్ర రంగాల్లో యువత నేతృత్వంలోని వేదికలు, చర్చలు, కార్యక్రమాలు జోడించే విలువను గుర్తించాం. అలాగే విద్యానంతర ఉపాధికి, వృత్తి విద్య శిక్షణను మరింత విస్తరించడానికి యువతకు తోడ్పడే సమ్మిళిత ఉపాధి విధానాలను మేం ప్రోత్సహిస్తాం. బ్రిక్స్ అజెండాలో యువతను భాగం చేయడానికి, జ్ఞాన సముపార్జన చేయడానికి, బ్రిక్స్ చేపట్టే కార్యక్రమాల్లో వారి ఆసక్తులు ప్రతిబింబింబించాలని పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా, 2025 జూన్‌లో బ్రెజీలియాలో జరిగిన 11వ బ్రిక్స్ యువజన సదస్సును మేం స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమంలో యువ సహకారంపై నూతన అవగాహన ఒప్పందాన్ని ఆమోదించారు.

బ్రిక్స్ దేశాలు చౌకగా గృహ నిర్మాణంలో సాధించిన పురోగతిని, అసమానతను తగ్గించడంపై దృష్టి సారించి సముచితమైన, స్థిరమైన పట్టణీకరణను ప్రోత్సహించే దిశగా ఉపశమనం, అనుసరణ విధానాల్లో ముందుకు సాగుతున్న విధానాన్ని మేం అభినందిస్తున్నాం. అలాగేసుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడంలో, ఎస్డీజీల ప్రాంతీయీకరణను ప్రోత్సహించడంలో అన్ని బ్రిక్స్ దేశాల్లో.. ప్రభుత్వం, సమాజాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం చేసిన కృషిని ప్రశంసిస్తున్నాం.

విధాన సిఫార్సులు ద్వారా బ్రిక్స్ 2025 అజెండాకు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ (బీబీసీ) అందించిన సహకారాన్ని మేం ప్రశంసిస్తున్నాం. ముఖ్యంగా డిజిటలైజేషన్, నియంత్రణా సహకారం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, వినూత్న ఆర్థిక సాధనాల విస్తరణ, రవాణా వసతులను మెరుగుపరచడం, బ్రిక్స్ దేశాల మధ్య విమాన మార్గాలను విస్తరించడం, ఇంధన మార్పులకు తోడ్పాటు ఇవ్వడం, ఆహార భద్రతను పెంపొందించే, మెరుగైన పోషకాహారాన్ని అందించే స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించడం, స్థిరమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యం ఉండేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై సిఫార్సులు చేసింది. ఈ రంగాల్లో ప్రభుత్వాలు చర్యలను చేపట్టేలా ప్రభావితం చేయడంతో పాటు, బ్రిక్స్ బిజినెస్ ఫోరం, బ్రిక్స్ సొల్యూషన్స్ పురస్కారాలను విజయవంతంగా నిర్వహించిన బీబీసీ స్పందన ఆధారిత చర్యలను మేం అభినందిస్తున్నాం.

స్థిరమైన వృద్ధిని సాధించడంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి ఉన్న కీలక పాత్రను మేం గుర్తించాం. ముఖ్యంగా రుణాలు పొందడం, విద్య, ఆరోగ్య సేవల్లో ఎదురవుతున్న నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరించడానికి విమెన్ బిజినెస్ అలయన్స్ (డబ్ల్యూబీఏ) చేసిన ప్రతిపాదనలను అభినందిస్తున్నాం. వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల భాగస్వామ్యాన్ని, స్థిరమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమాన అవకాశాలను అందించాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. వ్యాపార ప్రోత్సాహక సమావేశాలు, స్టార్టప్ పోటీలు, బ్రిక్స్ మహిళాభివృద్ధి నివేదిక సహా నిరంతర ప్రయత్నాలు చేపట్టి మహిళా నేతృత్వంలో వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి డబ్ల్యూబీఏ చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తున్నాం. మహిళలకు తోడ్పాటు, బడ్జెట్‌ను పెంచడానికి, అధికారిక, సామాజిక రక్షణ చర్యల ద్వారా అసంఘటిత రంగంలోని మహిళల్లో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు కూడా మేం కట్టుబడి ఉన్నాం.

విపత్తు ముప్పును తగ్గించడానికి నిధులను పెంచడం, పాలనను బలోపేతం చేయడం, ఐకమత్యం, స్థిరత్వాన్ని పెంపొందించడంలో మా నిబద్దతను పునరుద్ఘాటిస్తున్నాం. 2015 నుంచి కీలకమైన ప్రకటనలు, సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా సహకారంలో పురోగతులను సాధించాం. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ మార్పులతో సహా విపత్తు ప్రమాదాల సంక్లిష్టత పెరుగుతుందని మేం గుర్తించాం. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, విపత్తుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మౌలిక వ్యవస్థలు అధిక ప్రభావానికి గురయ్యాయి. ఇది ఆర్థిక అవాంతరాలకు, ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావానికి దారి తీసింది. అందుకే, విపత్తుల వల్ల ఎదురయ్యే నష్టాన్ని తగ్గించడానికి, మౌలిక వసతులు, ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని రక్షించడానికి జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు వ్యవస్థలను, వాటి సామర్థ్యాలను పెంచడంలో మేం సహకరించుకుంటాం. అలాగే తగినన్ని నిధులు సమకూర్చుకోవడానికి, మౌలికసదుపాయాల సమగ్రాభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను పెంపొందించుకుంటాం. అసమానతలను పరిష్కరించడం, నష్టాలను తగ్గించడం, దృఢమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ముందస్తు ప్రతిస్పందన సామర్థ్యాలు, స్థిరమైన మౌలిక వసతులు, వైవిధ్యమైన విజ్ఞాన వ్యవస్థలను ఏకీకరించడంపై దృష్టి సారించిన, సమానత్వాన్ని, స్థిరత్వాన్ని సాధించడంలో మా చిత్తశుద్ధిని స్పష్టం చేసే 2025–2028 కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తున్నాం. ప్రమాద పర్యవేక్షణ, విపత్తులను, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను ముందుగానే అంచనా వేసే వ్యవస్థలను అభివృద్ధికి జరిపే విస్తృత చర్చలకు మద్దతు ఇస్తాం.

రియో సదస్సులో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, విమెన్స్ బిజినెస్ అలయన్స్ తో పాటు మొదటిసారిగా జరిగిన బ్రిక్స్ సివిల్ కౌన్సిల్ నుంచి వచ్చిన నివేదికల సమర్పణలను మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్ ప్రభుత్వాలు, పౌరసమాజం మధ్య విస్తృత చర్చల ప్రాధాన్యాన్ని మేం స్పష్టం చేస్తున్నాం. బ్రిక్స్ షెర్పాలు, బ్రిక్స్ ప్రజా సంబంధాల ప్రతినిధులు, మధ్య ప్రత్యక్ష కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు బ్రెజిలియన్ అధ్యక్షత వహించిన చొరవను కూడా స్వాగతిస్తున్నాము.

దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన బిక్ర్స్ సదస్సులో స్వీకరించిన బ్రిక్స్ సభ్యదేశాల విస్తరణకు మార్గదర్శక సూత్రాలు, నియమాలు, నిబంధనలు, పద్ధతులకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పరస్పర గౌరవం, అవగాహన, సార్వభౌమ సమానత్వం, ఏకత్వం, ప్రజాస్వామ్యం, నిజాయతీ, సమ్మిళిత్వం, సహకారం, కొనసాగింపు, పూర్తి సంప్రదింపులు, ఏకాభిప్రాయం అనే సమూహ స్ఫూర్తితో బ్రిక్స్‌ను ఏకం చేయడానికి, బలోపేతం చేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో స్వీకరించిన బ్రిక్స్ భాగస్వామ్య దేశం కేటగిరీ పద్ధతులకు అనుగుణంగా బ్రిక్స్ సహకారంలో భాగస్వామ్య దేశాల తోడ్పాటు ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాం. అలాగే బ్రెజిల్ అధ్యక్షతన జరిగిన వివిధ మంత్రిత్వ, సాంకేతిక స్థాయి సమావేశాల్లో వారి భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం. పెరుగుతున్న బ్రిక్స్ సభ్యత్వాన్ని గుర్తించాం. అలాగే నేపథ్య ఎజెండాలో గ్రూపు పని విధానాలకు తగినట్లుగా మార్పులు అవసరమని అంగీకరిస్తున్నాం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ నిబంధనలను నవీకరించడానికి చేపడుతున్న చర్యలను గుర్తించాం. ఈ ప్రక్రియ ముందుకు సాగాలని ప్రోత్సహిస్తున్నాం. బ్రిక్స్ కూటమి ప్రభావవంతంగా, సమర్థంగా, ప్రతిస్పందించేలా, సమ్మిళిత్వంతో, ఏకాభిప్రాయంతో కొనసాగేలా పాత పద్దతులను మెరుగుపరిచేందుకు మద్దతు ఇస్తున్నాం. కూటమి అవసరాలు, ప్రాధాన్యాలను ప్రతిబింబించే సంస్థాగత అభివృద్ధి.. నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పునరుద్ఘాటిస్తున్నాం. బ్రిక్స్ చర్చల విస్తరణ, ఈఎండీసీలతో భాగస్వామ్యం అందరికీ ప్రయోజనం కలిగేలా ఐక్యమత్య స్ఫూర్తిని, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయని మేం బలంగా విశ్వసిస్తున్నాం. సంబంధిత పత్రాలు, నేపథ్య సమాచారాన్ని పొందేందుకు వీలుగా బ్రిక్స్ డేటాబేస్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం.

2025లో బ్రిక్స్‌కు బ్రెజిల్ అధ్యక్షతన మేము అభినందిస్తున్నాం. రియో డి జనీరో నగరంలో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినందుకు బ్రెజిల్ ప్రభుత్వానికి, ప్రజలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

2026లో బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహించడానికి, భారత్‌లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి మేం పూర్తి మద్దతును అందిస్తున్నాం.

 

 

**** 


(Release ID: 2160348) Visitor Counter : 6