ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 23 AUG 2025 9:44PM by PIB Hyderabad

వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతంఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నానుఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించానుఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

ప్రపంచ పరిస్థితులు.. భౌగోళిక-ఆర్థిక అంశాలపై ఈ వేదికలో విస్తృత చర్చలు జరిగాయిప్రపంచ కోణంలో చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని తెలుసుకోవచ్చుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందిత్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందిప్రపంచ వృద్ధికి భారత్ అందిస్తున్న సహకారం సమీప భవిష్యత్తులో దాదాపు 20 శాతానికి చేరుకుంటుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయిగత దశాబ్దంలో సాధించిన స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత వృద్ధి, ఆర్థిక సుస్థిరతే కారణంకోవిడ్-19 మహమ్మారి వంటి తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక లోటులో 4.4 శాతం తగ్గుదలను అంచనా వేశాంభారతీయ కంపెనీలు మూలధన మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో నిధులను సేకరిస్తున్నాయిభారతీయ బ్యాంకులు గతంలో కంటే బలంగా ఉన్నాయిఅలాగే ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది.. వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయిభారత కరెంట్ ఖాతా లోటు నియంత్రణలో ఉంది.. ఫారెక్స్ నిల్వలూ బలంగా ఉన్నాయిప్రతి నెలా లక్షలాది దేశీయ పెట్టుబడిదారులు క్రమానుగత పెట్టుబడి ప్రణాళికల (ఎస్ఐపీలద్వారా మార్కెట్‌లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.

మిత్రులారా,

ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నప్పుడే దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తుందని మీకు కూడా తెలుసుస్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దీని గురించి నేను వివరంగా చర్చించానుఆ అంశాలను పునరావృతం చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత జరిగిన పరిణామాలు భారత వృద్ధి తీరుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి.

మిత్రులారా,

తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఒక జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ డేటాబేస్‌లో 22 లక్షల ఉద్యోగాలు అధికారికంగా నమోదయ్యాయిఇది ఇప్పటివరకు ఏదైనా నెలలో నమోదైన వాటి కంటే అత్యధికం. 2017 తర్వాత భారత రిటైల్ ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయిలో ఉందిభారత విదేశీ మారక నిల్వలు అన్ని కాలాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2014లో భారతదేశ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్లుగా ఉండగా.. తాజా గణాంకాల ప్రకారం ఈ సామర్థ్యం ఇప్పుడు 100 గిగావాట్లకు చేరిందిఢిల్లీ విమానాశ్రయం ప్రపంచ విమానాశ్రయాల ఎలైట్ హండ్రెడ్-మిలియన్-ప్లస్ క్లబ్‌లో చేరడంతో పాటు దాని వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం ఇప్పుడు 100 మిలియన్లను దాటిందిప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక సమూహంలో ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటిగా నిలిచింది.

మిత్రులారా,

ఇటీవల వార్తల్లో ఒక అంశం చర్చనీయంగా ఉందిఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ భారత క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేశాయిదాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇది సాధ్యమైందిదీని అర్థం భారత్ తన అద్భుత సామర్థ్యం.. బలం ద్వారా ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోంది.

మిత్రులారా,

సాధారణంగా అవకాశాలను అందిపుచ్చుకోనప్పుడు అవి ఎలా చేదాటిపోతాయో వివరించేందుకు "బస్సును అందుకోలేకపోయినఉదాహరణను మనం చెప్పుకుంటాందేశంలోని మునుపటి ప్రభుత్వాలు సాంకేతికతపారిశ్రామిక రంగాల్లో అనేక అవకాశాలను చేజేతులా వదులుకున్నాయిఅయితే నేను ఎవరినీ విమర్శించడం లేదుప్రజాస్వామ్యంలో తులనాత్మక విశ్లేషణ తరచుగా పరిస్థితిని మరింత సమర్థంగా స్పష్టం చేయడానికి సహాయపడుతుంది.

మిత్రులారా,

గత ప్రభుత్వాలు దేశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో అస్తవ్యస్తంగా మార్చాయిఎన్నికలకు మించి ఆలోచించే దృక్పథం వారికి లేదుఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యమని వారు భావించారుఅవసరమైనప్పుడు దానిని దిగుమతి చేసుకోవచ్చనే నమ్మకంతో ఆ ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయిఈ మనస్తత్వం కారణంగానే భారత్ అనేక దేశాల కంటే సంవత్సరాలుగా వెనుకబడిందిపదేపదే కీలకమైన అవకాశాలను కోల్పోయిన క్రమంలో అభివృద్ధి బస్సును వారు అందుకోలేకపోయారుకమ్యూనికేషన్ రంగం దీనికి మంచి ఉదాహరణప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యుగం ప్రారంభమైన సమయంలో నాటి ప్రభుత్వం అనిశ్చితంగా ఉంది. 2జీ యుగంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవేభారత్ ఆ బస్సును కూడా నాడు అందుకోలేకపోయింది. 2జీ3జీ4జీ సాంకేతికతల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడేదిఇలాంటి పరిస్థితి ఎంతకాలం కొనసాగగలదు2014 తర్వాత భారత్ తన విధానాన్ని పూర్తిగా మార్చుకుందిబస్సును అందుకోవడం కాకుండా.. ఏకంగా బస్సును నడిపే స్థానం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుందిభారత్ తన మొత్తం 5జీ స్టాక్‌ను దేశీయంగానే అభివృద్ధి చేసిందిమేడ్-ఇన్-ఇండియా 5జీని రూపొందించడమే కాకుండా దానిని దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా అమలు చేసిందిభారత్ ఇప్పుడు మేడ్-ఇన్-ఇండియా 6జీ సాంకేతికత దిశగా వేగంగా కృషి చేస్తోంది.

అలాగే మిత్రులారా,

50-60 సంవత్సరాల కిందటే సెమీ కండక్టర్ల తయారీని భారత్ ప్రారంభించాల్సి ఉండగా.. ఆ బస్సును కూడా అప్పుడు అందుకోలేకపోయిందిచాలా సంవత్సరాలు అదే పరిస్థితి కొనసాగిందిఅయితే ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిందిదేశంలో సెమీ కండక్టర్ల సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభమైందిఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

మిత్రులారా,

జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలుఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 2014కి ముందు భారత అంతరిక్ష మిషన్ల సంఖ్యపరిధి పరిమితంగా ఉండేది. 21వ శతాబ్దంలో ప్రతి ప్రధాన దేశం అంతరిక్ష అవకాశాలను అన్వేషిస్తున్నప్పుడు భారత్ వెనుకబడి ఉండలేకపోయిందిఅంతరిక్ష రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం.. ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి అనుమతించడం వంటి చర్యలను మా ప్రభుత్వం చేపట్టింది. 1979 నుంచి 2014 వరకు భారత్35 సంవత్సరాల్లో కేవలం 42 అంతరిక్ష మిషన్లు మాత్రమే నిర్వహించిందిగత పదకొండు సంవత్సరాల్లోనే భారత్ అరవైకి పైగా మిషన్లను పూర్తి చేయడం గర్వకారణంరాబోయే కాలంలో చేపట్టనున్న అనేక మిషన్లు వరుసలో ఉన్నాయిఈ సంవత్సరం భారత్ స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని సాధించిందిభవిష్యత్ మిషన్ల కోసం ఇది కీలకం కానుందిగగన్‌యాన్ మిషన్ కింద భారత్ తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతోందిగ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అనుభవం ఈ ప్రయత్నంలో గొప్ప సహాయకారిగా ఉంటుంది.

మిత్రులారా,

అంతరిక్ష రంగానికి కొత్త శక్తిని అందించడం కోసం దానిని అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేయడం చాలా అవసరంఅంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం మొదటిసారిగా స్పష్టమైన నియమాలు రూపొందించాంఈ రంగంలో విదేశీ పెట్టుబడులను మొదటిసారిగా సరళీకరించడంతో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపును తొలిసారిగా పారదర్శకంగా పూర్తి చేశాంఈ సంవత్సరం బడ్జెట్‌లో అంతరిక్ష రంగ అంకురసంస్థల కోసం ప్రత్యేకంగా రూ 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ చేర్చాం.

మిత్రులారా,

చేపట్టిన సంస్కరణల విజయాన్ని భారత అంతరిక్ష రంగం ఇప్పుడు చూస్తోంది. 2014లో దేశంలో ఒకే ఒక అంతరిక్ష రంగ అంకురసంస్థ ఉండగా.. నేడు వాటి సంఖ్య 300కి పైగా ఉందికక్ష్యలో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండే రోజు ఎంతో దూరంలో లేదు.

మిత్రులారా,

ఒక్కో అడుగేస్తూ నిదానంగా సాధించే మార్పు భారత లక్ష్యం కాదుఅత్యంత వేగంగా దూసుకెళ్తూ మార్పును సాధించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందిదేశంలో అమలు చేస్తున్న సంస్కరణలు తప్పనిసరి పరిస్థితులు.. సంక్షోభాల నివారణ కోసం చేపడుతున్నవి కాదుభారత్ నిబద్ధతదృఢ నిశ్చయానికి ఈ సంస్కరణలు ప్రతిబింబాలుప్రతీ రంగం గురించి విడిగా లోతైన సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తోందిఆయా రంగాల్లో సంస్కరణలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.

మిత్రులారా,

ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సంస్కరణల కొనసాగింపును ప్రతిబింబిస్తున్నాయిప్రతిపక్షాలు అనేక ఆటంకాలు కలిగించినప్పటికీ ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉందిజన్ విశ్వాస్ 2.0 కార్యక్రమం విశ్వాస ఆధారితమైనప్రజానుకూలమైన పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన సంస్కరణజన్ విశ్వాస్ మొదటి ఎడిషన్ కింద దాదాపు 200 చిన్నపాటి నేరాలను నేరాల జాబితా నుంచి తొలగించాంరెండో ఎడిషన్‌లోనూ 300కి పైగా చిన్నపాటి నేరాలనూ తాజాగా నేరాల జాబితా నుంచి తొలగించాం. 60 సంవత్సరాలుగా మారకుండా ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఈ సమావేశాల సందర్భంగా సంస్కరించాంఈ చట్టం ఇప్పుడు ఎంతో సరళీకృతం అయిందిగతంలో చట్టంలోని భాష న్యాయవాదులు.. చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలిగేలా ఉండేదిఇప్పుడుఆదాయపు పన్ను బిల్లు సాధారణ పన్ను చెల్లింపుదారులకు కూడా సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించాంఇది పౌరుల ప్రయోజనాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,

గనుల చట్టాల వంటి అనేక చట్టాలకు గణనీయ సవరణలు చేసిన ఇటీవలి వర్షాకాల సమావేశాల్లోనే.. బ్రిటీష్ పాలకుల కాలం నాటి నౌకాయానంఓడరేవుల నియంత్రణ చట్టాలను కూడా సవరించాంఈ సంస్కరణలు భారత జల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయిఅలాగే నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధినీ ప్రోత్సహిస్తాయిక్రీడా రంగంలోనూ నూతన సంస్కరణలు ప్రవేశపెట్టాంప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణకూ భారత్ సిద్ధమవుతోందిసమగ్ర క్రీడా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాంఈ దార్శనికతకు మద్దతుగా ప్రభుత్వం ఖేలో భారత్ నీతి పేరుతో నూతన జాతీయ క్రీడా విధానాన్ని ప్రారంభించింది.

మిత్రులారా,

ఇప్పటికే సాధించిన లక్ష్యాలతో సంతృప్తి చెందడం నా స్వభావం కాదుసంస్కరణలకు కూడా ఇదే విధానం వర్తిస్తుందిమా ప్రభుత్వం ఈ మార్గంలో మరింత ముందుకు సాగాలని నిశ్చయించుకుందిసంస్కరణల ఆయుధాలను సమగ్రంగా సిద్ధం చేస్తున్నాంఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి బహుళ రంగాల్లో కృషి జరుగుతోందిఅనవసరమైన చట్టాలను రద్దు చేయడంనిబంధనలు.. విధానాలను సరళీకరించడం వంటి కీలక చర్యలు చేపడుతున్నాం.. విధానాలుఆమోదాలను డిజిటలైజ్ చేస్తున్నాం.. అనేక నిబంధనలనూ నేరరహితం చేస్తున్నాంజీఎస్టీ విధానంలో ఒక పెద్ద సంస్కరణ చేపట్టనున్నాం.. ఈ ప్రక్రియ దీపావళి నాటికి పూర్తవుతుందిదీని ద్వారా జీఎస్టీ వ్యవస్థ మరింత సరళతరం అవుతుంది... ధరలు కూడా తగ్గుతాయి.

మిత్రులారా,

ఈ తదుపరి తరం సంస్కరణలు.... తయారీ రంగంలో పెనుమార్పులు తెస్తాయిమార్కెట్ డిమాండ్ పెరుగుతోంది.. పరిశ్రమలు కొత్త శక్తిని పొందుతాయిఈ సంస్కరణల ఫలితంగా జీవన సౌలభ్యం.. వ్యాపార సౌలభ్యం రెండూ మెరుగుపడతాయి.. కొత్త ఉపాధి అవకాశాలూ అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి పూర్తిగా కట్టుబడి ఉందిస్వయంసమృద్ధ భారత్.. అభివృద్ధి చెందిన భారత్ కోసం పునాది అవుతుందిఆత్మనిర్భర్ భారత్‌ను వేగంస్థాయిపరిధి అనే మూడు కీలక అంశాల ఆధారంగా అంచనా వేయాలిమహమ్మారి సమయంలో భారత్ ఈ వేగంస్థాయిపరిధి అనే మూడింటినీ ప్రదర్శించిందిఅవసరమైన వస్తువులకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిన తీరు.. ప్రపంచ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిన విధానం మీకు గుర్తుండే ఉంటుందిఅటువంటి సమయంలో అవసరమైన వస్తువులను దేశీయంగా తయారు చేయడానికి భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందిభారత్ అత్యంత వేగంగా పెద్ద మొత్తంలో పరీక్షా కిట్లువెంటిలేటర్లను ఉత్పత్తి చేసిందిదేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి భారత్ వేగాన్ని ప్రదర్శించిందిదేశంలోని ప్రతి మూలలో గల పౌరులకు భారత్‌లో తయారైన 220 కోట్లకు పైగా టీకాలను ఉచితంగా అందించడం భారత్ తన సామర్ధ్యాన్ని ప్రదర్శించిందిలక్షలాది మందికి వేగంగా టీకాలు అందించడం కోసం భారత్ కో-విన్ ను అభివృద్ధి చేసిందిఇది భారత పరిధిని ప్రతిబింబించిందిప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక వ్యవస్థ అయిన కో-విన్ కారణంగానే భారత్ తన టీకా డ్రైవ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేయగలిగింది.

మిత్రులారా,

ఇంధన రంగంలోనూ భారత్ వేగంస్థాయిపరిధిని ప్రపంచమంతా చూస్తోంది. 2030 నాటికి తన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయడమే భారత్ లక్ష్యంఅయితే 2025లోనే అంటే షెడ్యూలు కంటే అయిదు సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని మనం సాధించాం.

మిత్రులారా,

గతంలోని విధానాలు దిగుమతులపైనే ఎక్కువగా దృష్టి సారించాయిస్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణంనేడు స్వావలంబన సాధించిన భారత్ ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోందిగత సంవత్సరంలో భారత్ రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసిందిగత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన 800 కోట్ల టీకా డోసుల్లో 400 కోట్లు భారత్‌లోనే తయారయ్యాయిస్వాతంత్య్రం వచ్చిన తరువాతి ఆరున్నర దశాబ్దాల్లో భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు రూ. 35,000 కోట్లకు చేరుకున్నాయిఅయితే నేడు ఈ ఎగుమతుల విలువ సుమారు రూ. 3.25 లక్షల కోట్లకు పెరిగింది.

మిత్రులారా,

2014 వరకు భారత ఆటోమొబైల్ ఎగుమతులు సంవత్సరానికి సుమారు రూ. 50,000 కోట్లుగా ఉన్నాయినేడు ఒకే సంవత్సరంలో రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్స్‌ను భారత్ ఎగుమతి చేస్తోందిమెట్రో కోచ్‌లురైలు కోచ్‌లురైలింజన్లను కూడా భారత్ ఎగుమతి చేయడం ప్రారంభించింది. 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా భారత్ మరో కీలక విజయాన్ని సాధించబోతోందిఈ విజయానికి సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం ఈనెల 26న జరగనుంది.

మిత్రులారా,

దేశ పురోగతికి పరిశోధన మూలస్తంభందిగుమతి చేసుకున్న పరిశోధనలు మనుగడకు సరిపోవచ్చుకానీ అవి భారత ఆకాంక్షలను నెరవేర్చలేవుపరిశోధన రంగంలో అవసరంకేంద్రీకృత దృక్పథం ముఖ్యం. పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వేగంగా కృషి చేస్తూ.. అవసరమైన విధానాలువేదికలను నిరంతరం అభివృద్ధి చేసింది. 2014తో పోలిస్తే పరిశోధనాభివృద్ధిపై ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా ఉందిదాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య 2014 నుంచి 17 రెట్లు పెరిగిందిసుమారు 6,000 ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనాభివృద్ధి విభాగాలను స్థాపించాం'ఒకే దేశం-ఒకే సబ్‌స్క్రిప్షన్కార్యక్రమం ద్వారా ప్రపంచ పరిశోధన పత్రికలు మన విద్యార్థులకు మరింత అందుబాటులోకి వచ్చాయిరూ. 50,000 కోట్ల బడ్జెట్‌తో జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రూ.1 లక్ష కోట్ల విలువైన పరిశోధన..అభివృద్ధి..ఆవిష్కరణ పథకానికి కూడా ఆమోదం తెలిపాంప్రైవేట్ రంగంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నవ్యూహాత్మక రంగాల్లో కొత్త పరిశోధనలకు మద్దతు ఇవ్వడం మా ప్రభుత్వ లక్ష్యం.

మిత్రులారా,

ఈ సదస్సుకు ఎందరో ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారుప్రస్తుత కాలంలో పారిశ్రామికప్రైవేట్ రంగాల నుంచి చురుకైన భాగస్వామ్యం అవసరంముఖ్యంగా క్లీన్ ఎనర్జీక్వాంటం టెక్నాలజీబ్యాటరీ స్టోరేజ్అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలుపెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉందిఇటువంటి ప్రయత్నాలు వికసిత్ భారత్’ దార్శనికతకు కొత్త శక్తిని అందిస్తాయి.

మిత్రులారా,

సంస్కరణపనితీరుపరివర్తన అనే మంత్రం మార్గనిర్దేశంలో భారత్ ఇప్పుడు ప్రపంచ వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడే స్థితిలో ఉందిభారత్ నిలిచిన నీటిలో రాళ్ళు విసిరేందుకు ఇష్టపడదు.. వేగంగా ప్రవహించే ప్రవాహాలను మళ్లించే శక్తిని భారత్ కలిగి ఉందిఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా.. భారత్ ఇప్పుడు కాల గమనాన్ని కూడా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మిత్రులారా,

మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కల్పించిన ఎకనమిక్ టైమ్స్ వారికి నా కృతజ్ఞతలుఈ సదస్సుకు హాజరైన మీ అందరికీ నా కృతజ్ఞతలుఅలాగే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

 

***


(Release ID: 2160344)