ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ స్వరాజ్ పాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 AUG 2025 9:00AM by PIB Hyderabad
శ్రీ స్వరాజ్ పాల్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
యునైటెడ్ కింగ్ డమ్ లో పారిశ్రామిక, దాతృత్వ, ప్రజా సేవా రంగాల్లో శ్రీ స్వరాజ్ పాల్ చేసిన కృషిని ప్రధాని స్మరించుకున్నారు. భారత్ తో సన్నిహిత సంబంధాల పట్ల ఆయన అందించిన అచంచల మద్దతు ఎల్లప్పుడూ గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. అలాగే శ్రీ స్వరాజ్ పాల్ తో జరిపిన పలు సంభాషణలను కూడా శ్రీ మోదీ మననం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు తన సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఎక్స్' లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు;
"శ్రీ స్వరాజ్ పాల్ మృతి బాధాకరం. యూకేలో పారిశ్రామిక, దాతృత్వ, ప్రజా సేవా రంగాల్లో ఆయన చేసిన కృషి విస్మరించలేనిది. భారత్ తో సన్నిహిత సంబంధాలకు ఆయనిచ్చిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయనతో జరిపిన పలు సంభాషణలను స్మరించుకుంటున్నా. పాల్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి."
***
(Release ID: 2159743)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam