ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆన్ లైన్ గేముల ప్రోత్సాహక, నియంత్రణ బిల్లు-2025 ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి;


ఇ-స్పోర్ట్స్ ప్రోత్సాహానికి, సమాజ రక్షణకు ఈ బిల్లు దోహదం

Posted On: 21 AUG 2025 10:47PM by PIB Hyderabad

ఆన్ లైన్ గేముల ప్రోత్సాహక, నియంత్రణ బిల్లు-2025  పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందటాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

ఈ బిల్లు దేశాన్ని గేమింగ్ ఆవిష్కరణ, సృజనాత్మకతలకు కేంద్రంగా మార్చే దిశగా ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ బిల్లు ఇ-స్పోర్ట్స్, ఆన్ లైన్ సామాజిక క్రీడలను ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో ఆన్ లైన్ మనీ గేమ్స్ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి సమాజాన్ని రక్షిస్తుందని పేర్కొన్నారు.

ఆన్ లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ చేసిన 'ఎక్స్' పోస్టుకు స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు;

"పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఆన్ లైన్ గేమింగ్ బిల్లు దేశాన్ని గేమింగ్ ఆవిష్కరణ, సృజనాత్మకతలకు కేంద్రంగా మార్చే దిశగా ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది ఇ-స్పోర్ట్స్, ఆన్ లైన్ సామాజిక క్రీడలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, ఆన్ లైన్ మనీ గేమ్స్ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి సమాజాన్ని కాపాడుతుంది."

 

 

***

MJPS/ST


(Release ID: 2159737)