ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆగష్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని


గయలో 13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ

విద్యుత్, రోడ్డు, ఆరోగ్యం, పట్టణ అభివృద్ధి, నీటి పారుదల వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులు

ఉత్తర, దక్షిణ బిహార్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే గంగా నదిపై ఆంటా - సిమారియా వంతెన ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని

సిమారియా ధామ్ ప్రయాణాన్ని సులభం చేయడంతోపాటు భారీ వాహనాలకు 100 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని తగ్గించనున్న కొత్త వంతెన

గయ-ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌, వైశాలి-కోడెర్మా మధ్య బౌద్ధ సర్క్యూట్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్న మోదీ.

కోల్‌కతాలో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి

కోల్‌కతాలో కొత్తగా నిర్మించిన మార్గాలు మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని

Posted On: 20 AUG 2025 3:02PM by PIB Hyderabad

ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెను సందర్శించి ప్రారంభిస్తారు.

కోల్‌కతాలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్గాల్లో మెట్రో రైలు సేవలను సాయంత్రం 4:15 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు  జెస్సోర్ రోడ్డు మెట్రో స్టేషన్ నుంచి జై హింద్ బిమన్‌బందర్ వరకు మెట్రో ప్రయాణం చేయనంతరం. అనంతరం కోల్‌కతాలో రూ.5,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా  సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

మోదీ బిహార్ పర్యటన

అనుసంధానాన్ని మెరుగుపరచడంలో భాగంగా 31వ జాతీయ రహదారిపై  8.15 కి.మీ. పొడవైన ఆంట-సిమారియా వంతెన ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇందులో గంగా నదిపై రూ. 1,870 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 1.86 కి.మీ. పొడవైన 6 లైన్ల వంతెన కూడా ఉంది. ఇది పాట్నాలోని మోకామా - బెగుసరాయ్ మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది ప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరచడంపై మోదీ నిబద్దతకు నిదర్శనం పడుతోంది.

ఈ కొత్త వంతెనన శిథిలావస్థలో ఉన్న పాత 2 లైన్ల  రైలు కమ్ రోడ్డు వంతెన ‘రాజేంద్ర సేతు’కు ప్రత్నామ్నాయంగా నిర్మించారు. రాజేంద్ర సేతు వంతెన ప్రస్తుతం కూలిపోయే దశలో ఉండటం వల్ల భారీ వాహనాలు వేరే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  కొత్త వంతెనతో ఉత్తర బిహార్ (బెగుసరాయ్, సుపాల్, మధుబని, పూర్నియా, అరారియా మొదలైనవి), దక్షిణ బిహార్ ప్రాంతాల (షేఖ్‌పురా, నవాడా, లఖిసరాయ్ మొదలైనవి) మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. ఈ దారిలో ప్రయాణించే భారీ వాహనాలకు 100 కి.మీ. కంటే ఎక్కువ  ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ వాహనాలు వంతెన మీద వెళ్లడం వల్ల  ఇతర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్‌ల సమస్య తగ్గే అవకాశం ఉంది.

ఈ బ్రిడ్జి అవసరమైన ముడి పదార్థాల కోసం దక్షిణ బిహార్, జార్ఖండ్‌లపై ఆధారపడే ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ముఖ్యంగా  ఉత్తర బిహార్‌లో ఆర్థిక వృద్ధిని పెంచుతుంది.  ప్రసిద్ధ కవి దివంగత శ్రీ రాంధారి సింగ్ దిన్కర్ జన్మస్థలమైన సిమారియా ధామ్  ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి మెరుగైన అనుసంధానాన్ని కల్పిస్తుంది.

దాదాపు రూ. 1,900 కోట్లతో ఎన్ హెచ్ 3పై భక్తియార్ పూర్ నుంచి మోకామా వరకు నాలుగు లైన్ల రోడ్డు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇది రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. వాహనదారులను సరుకు రవాణాను పెంచుతుంది. అలాగే బిహర్‌లోని ఎన్ హెచ్120పై బిక్రామ్‌గంజ్-దావత్-నవానగర్-డుమ్రాన్ ప్రాంతంలో వెడల్పు పెంచి అభివృద్ది చేసిన  రెండు లేన్ల మార్గం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కనెక్టివిటీ పెరుగుతుంది. ఇది స్థానిక ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తుంది.

బిహార్‌లో విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూప్రధానమంత్రి  రూ. 6,880 కోట్ల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను (660x1MW) ప్రారంభించనున్నారు. ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుంది. ఇంధన భద్రతను మెరుగుపరచడంతోపాటు స్థానికంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చనుంది.

ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పెద్ద ఊతం ఇస్తూ ముజఫర్‌పూర్‌లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  ఈ ఆసుపత్రిలో అధునాతన ఆంకాలజీ ఓపీడీ, ఐపీడీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక ల్యాబ్, బ్లడ్ బ్యాంక్. 24 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, హై డిపెండెన్సీ యూనిట్ లు ఉన్నాయి. ఈ అత్యాధునిక సౌకర్యం బిహార్ తోపాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అధునాతన  క్యాన్సర్ చికిత్సను అందించడంతోపాటు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

స్వచ్ఛ భారత్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా గంగా నదికి అవిరళ, నిర్మల ధారను అందించేందుకు  ముంగేర్‌లో రూ.520 కోట్లతో నమామి గంగే కార్యక్రమంలో భాగంగా నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారం,మురుగునీటి నెట్‌వర్క్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది గంగా నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

దాదాపు రూ.1,260 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఔరంగాబాద్‌లోని దౌద్‌నగర్, జెహానాబాద్‌లో మురుగునీటి వ్యవస్థ, ఎస్‌టీపీ.. లఖిసరాయిలోని బరాహియా, జముయిలో ఎస్‌టీపీ, మళ్లింపు పనులు ఉన్నాయి. అమృత్‌ 2.0 కింద,  ఔరంగాబాద్, బోధగయ, జెహానాబాద్‌లలో నీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు స్వచ్ఛమైన తాగునీరు, ఆధునిక మురుగునీటి వ్యవస్థలు, మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాయి. వీటి ద్వారా ఈ ప్రాంతంలో ఆరోగ్య ప్రమాణాలు పెంచడంతోపాటు మెరుగైన జీవనానికి దోహదపడతాయి.

ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని పెంపొందించే ప్రక్రియలో భాగంగా ప్రధానమంత్రి రెండు రైళ్లకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో గయ, ఢిల్లీ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఒకటి. ఇది ఆధునిక సౌకర్యాలు, భద్రతతో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచేలా రూపొందించారు. మరోకటి వైశాలి- కోడెర్మ మధ్య బౌద్ధ సర్క్యూట్ రైలు.. ఇది ఈ ప్రాంతంలోని కీలకమైన బౌద్ధ ప్రదేశాలలో పర్యాటకం, మతపరమైన ప్రయాణాన్ని ప్రొత్సహించేందుకు సహకరిస్తుంది.

పీఎంఏవై-గ్రామీణ్ పరిధిలో 12,000 మంది లబ్ధిదారులకు.. పీఎమ్‌ఏవై-అర్బన్ పరిధిలో 4,260 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా కొంతమంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి మోదీ తాళాలను అందజేసి సొంత ఇంటిలో నివాసించాలనుకునే  వేలాది కుటుంబాల కలను సాకారం చేయనున్నారు.

ప్రధాని పశ్చిమ బెంగాల్‌ పర్యటన

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ,పట్టణీకరణను మెరుగుపరచాలనే తన నిబద్దతకు అనుగుణంగా ప్రధానమంత్రి కోల్‌కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించిన 13.61 కి.మీ. పొడవైన మెట్రో రైలు సేవలను ప్రారంభించనున్నారు. అనంతరం జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్‌ను సందర్శిస్తారు. అక్కడ  జెస్సోర్ రోడ్‌ నుంచి నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటితోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీల్దా-ఎస్ప్లానేడ్ మెట్రో సర్వీస్,  బెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో సర్వీస్‌ను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి జై హింద్ బిమన్‌బందర్ వరకు మెట్రోలో ప్రయాణం చేస్తారు.

హౌరా మెట్రో స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన సబ్‌వేతోపాటు పైన పేర్కొన్న మెట్రో విభాగాలను బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో సర్వీస్ విమానాశ్రయానికి త్వరగా చేరుకునేందుకు ఉపయోగపడనుంది. సీల్దా-ఎస్ప్లానేడ్ మెట్రో నిర్మాణం కారణంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 40 నిమిషాల నుంచి కేవలం 11 నిమిషాలకు తగ్గనుంది. బెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం ఐటీ హబ్‌తో కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెట్రో మార్గాలు కోల్‌కతాలోని అత్యంత రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలను కలుపుతూ వెళ్లడం ద్వారా  ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించడంతోపాటు మల్టీమోడల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నాయి. దీని ద్వారా రోజువారీగా ప్రయాణం చేసే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.

పైన పేర్కొన్న ప్రాంతాల్లో  రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా నిర్మించిన రూ.1,200 కోట్లదో  7.2 కి.మీ పొడవైన ఆరు లైన్ల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది హౌరా, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు, కోల్‌కతా మధ్య కనెక్టివిటీని పెంచనుంది. అలాగే ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించనుంది. దీంతో ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


(Release ID: 2158724)