ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చౌకగా లభ్యమయ్యే బ్రాడ్ బ్యాండ్, యూపీఐ, డిజిటల్ పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ వచ్చిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని మోదీ

प्रविष्टि तिथि: 20 AUG 2025 1:28PM by PIB Hyderabad

తక్కువ ఖర్చుతో లభించే బ్రాడ్ బ్యాండ్, యూపీఐ, డిజిటల్ పాలనలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానంగా  పేర్కొంటూ వచ్చిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

పైన పేర్కొన్న అంశాలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా రాసిన వ్యాసానికి స్పందిస్తూ ప్రధాన మంత్రి మోదీ ఇలా పేర్కొన్నారు.

“కేంద్ర మంత్రి @JM_Scindia పేర్కొన్నట్లు.. అందుబాటు ధరలో లభించే బ్రాడ్‌బ్యాండ్, ఆన్ లైన్  లావాదేవీలు, డిజిటల్ పాలనలో మన దేశం సాధించిన ప్రగతి నేడు ప్రపంచానికి ఓ  అధ్యయనంగా నిలిచింది. భవిష్యత్తులో 5జీ, ఏఐ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలను భారత్ ముందుండి నడిపించి ప్రామాణికంగా నిలుస్తుంది‘ అని ప్రధాని తెలిపారు.


(रिलीज़ आईडी: 2158425) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam