ప్రధాన మంత్రి కార్యాలయం
79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
Posted On:
16 AUG 2025 5:31PM by PIB Hyderabad
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉక్రెయిన్ అధ్యక్షుడి పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు:
" అధ్యక్షులు జెలెన్‌స్కీ మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్, ఉక్రెయిన్ మధ్య మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను నేను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ఉక్రెయిన్లోని మన స్నేహితుల భవిష్యత్తు శాంతి, పురోగతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని మేం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. “
‘ఎక్స్’లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చేసిన పోస్టుకు ఈ విధంగా స్పందించారు:
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధానమంత్రి నెతన్యాహుకు ధన్యవాదాలు. మన ప్రజలకు శాంతి, అభివృద్ధి, భద్రతను తీసుకొచ్చేలా భారతదేశం-ఇజ్రాయెల్ స్నేహం ఇలాగే కొనసాగాలి. రెండు దేశాలు ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. "
***
MJPS/SR
(Release ID: 2157254)
Read this release in:
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati