ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ ) దేశానికి లాభం చేకూర్చిన ఒక ముఖ్యమైన సంస్కరణ: 79వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసం జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు, ధరల హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం అనే మూడు మూల స్తంభాలపై ఆధారపడిన ముఖ్యమైన సంస్కరణలపై కేంద్రం దృష్టి: ప్రధాని

సమాజంలోని అన్ని వర్గాల, ముఖ్యంగా సామాన్య ప్రజలు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి, రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా తదుపరి తరం సంస్కరణల కోసం కీలక రంగాల గుర్తింపు

వర్గీకరణకు సంబంధించిన వివాదాలను తగ్గించడం, కొన్ని రంగాల్లో విలోమ సుంకాల లోటుపాట్లను సరిచేయడం, సుంకాల విధింపులో మరింత స్థిరత్వాన్ని కల్పించడం, అలాగే వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మరింత పెంచడం
కూడా సంస్కరణల లక్ష్యం

కీలక ఆర్థిక రంగాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక కార్యకలాపాల ప్రోత్సాహానికి, రంగాల విస్తరణకు దోహదపడనున్న జీఎస్టీ సంస్కరణలు

Posted On: 15 AUG 2025 10:51AM by PIB Hyderabad

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2017లో అమలు లోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీదేశానికి లాభాన్ని చేకూర్చిన ఒక ముఖ్యమైన సంస్కరణగా అభివర్ణించారు.

సామాన్య ప్రజలకురైతులకుమధ్యతరగతికి,  సూక్ష్మచిన్నమధ్య తరహా (ఎంఎస్ఎంఈపరిశ్రమలకు ఉపశమనం కలిగించే విధంగా జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణల అవసరాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.

ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసంకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో గణనీయమైన సంస్కరణలను ప్రతిపాదిస్తోందిఇవి మూడు స్తంభాలపై దృష్టి సారిస్తాయిఅవి

  1. నిర్మాణాత్మక సంస్కరణలు.

  2. పన్నుల హేతుబద్ధీకరణ.  

  3. జీవన సౌలభ్యం.  

జీఎస్టీ పన్నుల్లో హేతుబద్ధీకరణసంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జివోఎంపరిశీలనకు పంపింది.

పన్ను విధింపులో హేతుబద్ధీకరణతో సహా తదుపరి తరం సంస్కరణల కోసం గుర్తించిన ప్రధాన అంశాలు సమాజంలోని అన్ని వర్గాలకుముఖ్యంగా సామాన్య ప్రజలకుమహిళలకువిద్యార్థులకుమధ్యతరగతికి,  రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటాయి

వర్గీకరణకు సంబంధించిన వివాదాలను తగ్గించ డానికి కొన్ని రంగాల్లో అస్తవ్యస్తంగా ఉన్న సుంకాలను సరి చేయడానికిరేట్లలో మరింత స్థిరత్వానికిఅలాగే వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని మరింత పెంచడానికి కూడా సంస్కరణలు దోహదపడతాయిఈ చర్యలు ప్రధాన ఆర్థిక రంగాలను బలపరచిఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించిరంగాల విస్తరణకు వీలు కల్పిస్తాయి.

కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల కీలక స్తంభాలు

 1. నిర్మాణాత్మక సంస్కరణలు

1. సుంకాల లోటుపాట్ల సవరణఇన్‌పుట్అవుట్‌పుట్ పన్ను రేట్లను సరిచేసిఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అధికంగా పేరుకుపోవడాన్ని తగ్గించడంఇది దేశీయ విలువ జోడింపు (డొమెస్టిక్ వాల్యూ ఆడిషన్ను ప్రోత్సహిస్తుంది.

2. వర్గీకరణ సమస్యల పరిష్కారంరేట్ల విధానాన్ని సులభతరం చేయడంవివాదాలను తగ్గించడంషరతుల కట్టుబాటు ప్రక్రియలను సరళీకృతం చేయడంఅన్ని రంగాల్లో సమానత్వంస్థిరత్వం కోసం వర్గీకరణ సమస్యల పరిష్కారం

3. స్థిరత్వంఅంచనాపరిశ్రమ విశ్వాసాన్ని పెంపొందించడానికి,  మెరుగైన వ్యాపార ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి రేట్లు,  విధాన దిశపై దీర్ఘకాలిక స్పష్టతను అందించడం.
2: 
రేటు హేతుబద్ధీకరణ

1. సామాన్య ప్రజలు వాడే వస్తువులువారు ఆశించే వస్తువులపై పన్నుల తగ్గింపుఇది వాటి లభ్యతనువినియోగాన్ని పెంచుతుందిఅవసరమైన వస్తువులనుఆశించదగిన వస్తువులను మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేస్తుంది.

2. స్లాబ్ ల తగ్గింపుప్రామాణికంమెరిట్ అనే రెండు స్లాబ్ లతో సరళమైన పన్ను విధానంఎంపిక చేసిన కొన్ని వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు.

3. పరిహార సెస్పరిహార (కాంపెన్సేషన్సెస్ ముగియడం వల్ల ఆర్థిక వెసులుబాటు లభించిందిఇది జీఎస్టీ వ్యవస్థలో పన్ను రేట్లను హేతుబద్ధీకరించడానికిదీర్ఘకాలిక స్థిరత్వం కోసం వాటిని సర్దుబాటు చేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది.

 3: జీవన సౌలభ్యం  

1. రిజిస్ట్రేషన్ముఖ్యంగా చిన్న వ్యాపారాలుస్టార్టప్ లకు అంతరాయం లేనిసమయ పరిమిత నమోదు ప్రక్రియ.

2. రిటర్న్పన్ను రిటర్నులను ముందుగానే నింపి ఉంచడం ద్వారామాన్యువల్ గా చేసే పనిని తగ్గించితప్పులను నివారించడం.  

3. రిఫండ్ఎగుమతిదారులకుసుంకాల తీరు సరిగా (విలోమ పన్ను విధానంలేనివారికి వాపసు (రిఫండ్ప్రక్రియను వేగంగాస్వయం చాలన విధానంలో చేయడం.

పై మూడు మూలస్తంభాలపై ఆధారపడిన కేంద్ర ప్రతిపాదనను తదుపరి చర్చల కోసం జీఓఎంకు అందచేశారుభాగస్వాములందరి మధ్య నిర్మాణాత్మకసమగ్రఏకాభిప్రాయ ఆధారిత చర్చ కోసం కేంద్రం ఈ చొరవ తీసుకుంది.

సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న తదుపరి తరం సంస్కరణలను అమలు చేయడానికి రాబోయే వారాల్లో రాష్ట్రాలతో విస్తృత స్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్రం పనిచేస్తుంది.

జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో జీఓఎం సిఫార్సులపై చర్చిస్తుందిలక్ష్యంగా నిర్దేశించిన ప్రయోజనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గణనీయంగా సాధించడానికి వాటిని త్వరితగతిన అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

సరళమైనస్థిరమైనపారదర్శక పన్ను వ్యవస్థగా జీఎస్టీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించిందిఇది సమ్మిళిత వృద్ధికి మద్దతు ఇస్తుందిఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందిదేశవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (ఈఓడీబీపెంచడం లక్ష్యంగా కలిగి ఉంటుంది.

 

***


(Release ID: 2156781)