ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’ నిరుపేదలకు ఆర్థిక సేవల లభ్యతలో పెనుమార్పును తెచ్చిన వైనాన్ని వివరించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 05 AUG 2025 12:47PM by PIB Hyderabad

ఆర్థిక సేవలు అత్యంత పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ‘ప్రధానమంత్రి జన్  ధన్ యోజన’ తోడ్పడి ఎంతటి  పెనుమార్పును తెచ్చిందీ వివరించిన ఒక  వ్యాసాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ  పథకం బ్యాంకులకు, బ్యాంకుల సేవలకు నోచుకోని వారికి మధ్య ఏర్పడ్డ అంతరాన్ని భర్తీ చేసిందని, బ్యాంకింగ్ సదుపాయాలకు ఆమడ దూరంలోనే నిలిచిన వారిలో సైతం ఆత్మగౌరవాన్ని, స్వావలంబనను పెంచడంతో  పాటు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్థులను  చేసిందని కూడా శ్రీ  మోదీ అన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక  మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఇలా పేర్కొంది:

‘‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నిరుపేదలకు ఆర్థిక సేవల లభ్యతలో పెనుమార్పును తెచ్చింది. ఈ  పథకం బ్యాంకులకు, బ్యాంకుల సేవలకు నోచుకోని వారికి మధ్య ఏర్పడ్డ అంతరాన్ని భర్తీ చేసి, బ్యాంకింగ్ సదుపాయాలకు ఆమడ దూరంలోనే నిలిచిన వారిలో సైతం ఆత్మగౌరవాన్ని, స్వావలంబనను పెంచడంతో  పాటు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్థులను చేసింది. లోతైన ఆలోచనలను వ్యక్తం చేస్తూ హిమానీ సూద్ రాసిన ఈ వ్యాసాన్ని  తప్పక చదవండి’’

 

***


(Release ID: 2152594)