ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
04 AUG 2025 10:21AM by PIB Hyderabad
శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన తెగలు, పేదలు, అణగారిన వర్గాల వారిని సాధికార పరచడంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు.
ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘ప్రజల పట్ల చెక్కుచెదరని అంకితభావంతో ప్రజా జీవితంలో క్షేత్ర స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకుడు శ్రీ శిబు సోరెన్. ముఖ్యంగా గిరిజన తెగలు, పేదలు, అణగారిన వర్గాల వారికి సాధికారత కల్పించేందుకు కృషి చేశారు. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబం, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్‌తో మాట్లాడి నా సంతాపం తెలియజేశాను. ఓం శాంతి.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2152044)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam