ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలపై మీ సూచనలను పంచుకోవాలని పౌరుల్ని కోరిన ప్రధానమంత్రి
Posted On:
01 AUG 2025 8:52AM by PIB Hyderabad
మన దేశం త్వరలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 15న ఎర్రకోట నుంచి తాను ప్రసంగించేటపుడు ఏయే అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందో పౌరులంతా తమ తమ ఆలోచనలను, అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘మనం ఈ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవాన్ని త్వరలో నిర్వహించుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో నా తోటి భారతీయుల సూచనలను నేను తెలుసుకోవాలనుకుంటున్నా.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఏయే అంశాలపై నేను మాట్లాడితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు..
మీ మీ ఆలోచనలను మైగవ్ (MyGov)తో పాటు నమో యాప్ (NaMo App)లోని ఓపెన్ ఫోరాల ద్వారా నాతో పంచుకోండి...
(Release ID: 2151259)
Read this release in:
Tamil
,
Malayalam
,
Bengali-TR
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada