ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 28 JUL 2025 6:18PM by PIB Hyderabad

ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. “కోనేరు హంపి కూడా ఛాంపియన్‌షిప్‌లో అపార ప్రతిభ కనబరిచారు. భవిష్యత్ ప్రయత్నాల దిశగా వారిద్దరికీ శుభాకాంక్షలు అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఇద్దరు అత్యుత్తమ భారతీయ చెస్ క్రీడాకారులు పాల్గొన్న చరిత్రాత్మక ఫైనల్ ఇది! 

ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ను చూసి గర్వంగా ఉంది. అద్భుత విజయాన్ని సాధించిన ఆమెకు అభినందనలు. ఇది చాలా మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.

ఛాంపియన్‌షిప్‌లో కోనేరు  హంపి   కూడా అపార ప్రతిభను కనబరిచారు.

భవిష్యత్ ప్రయత్నాల దిశగా వారిద్దరికీ శుభాకాంక్షలు.’’

@DivyaDeshmukh05

@humpy_koneru 


(रिलीज़ आईडी: 2149554) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Odia , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada