ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 JUL 2025 9:40AM by PIB Hyderabad

సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని (రైజింగ్ డే) పురస్కరించుకొని సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా విధి, మనోధైర్యం, దృఢ నిబద్ధత విషయంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ముద్ర వేశారు" అని మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఈ విధంగా వ్యాఖ్యానించారు:

"సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అందరికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భద్రతా యంత్రాంగంలో, ముఖ్యంగా అంతర్గత భద్రతకు సవాలు విసిరిన సందర్భాల్లో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా విధి, ధైర్యం, దృఢ నిబద్ధత విషయంలో సీఆర్‌పీఎఫ్  సిబ్బంది తమ ముద్ర వేశారు. మానవతా దృక్పథంతో కూడిన సవాళ్లను అధిగమించడంలో వారు చేసిన కృషి కూడా ప్రశంసనీయం."

 


(रिलीज़ आईडी: 2149034) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam