ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాల్దీవుల అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ

Posted On: 25 JUL 2025 8:48PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారుప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారురెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్నిహృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది

తనతో పాటు తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ప్రధానమంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారుఆ దేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవంరెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శతాబ్దాలుగా నెలకొన్ని మానవ సంబంధాల ద్వారా బలోపేతమైన లోతైన స్నేహ బంధంవిశ్వాసం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. 2024 అక్టోబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా చేసుకున్న 'సమగ్ర ఆర్థికసముద్ర భద్రతా భాగస్వామ్యానికిసంబంధించిన భారత-మాల్దీవుల ఉమ్మడి దార్శనికత అమలులో పురోగతిని కూడా ఇరువురు తెలుసుకున్నారు. "ఇరుగుపొరుగు వారే మొదటి ప్రాధాన్యాత", మహాసాగర్ దార్శనికత విధానాలకు అనుగుణంగా మాల్దీవులతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారత్‌ నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి పునురుద్ఘాటించారుసంక్షోభం ఏదైనాదాన్ని ఎదుర్కోవడంలో మాల్దీవులకు సహాయపడే మొదటి దేశంగా ఉంటున్న భారత్ ‌కట్టుబాటును అధ్యక్షుడు ముయిజు ప్రశంసించారుఅభివృద్ధి భాగస్వామ్యంమౌలిక సదుపాయాల కల్పనకు సహాయంసామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవటంవాతావరణ విషయంలో చర్యలు తీసుకోవటంఆరోగ్యం వంటి రంగాలలో సహకారం గురించి ఇరు దేశాల నాయకులు చర్చించారురక్షణనౌకా వాణిజ్యం విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు అన్నారుఈ విషయంలో కొలంబో భద్రతా సమావేశం ప్రకారం రెండు దేశాల మధ్య సహకారాన్ని వారు గుర్తించారు.

రెండు దేశాల మధ్యనున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించారుప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారుడిజిటల్ ఆర్థిక వ్యవస్థను రెండు దేశాలూ సద్వినియోగం చేుకోవాలన్న ఆయన.. ముఖ్యంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికియూపీఐ అమలురూపే కార్డులను అంగీకరించటంస్థానిక కరెన్సీలో వ్యాపారం విషయంలో ఇటీవల రెండు దేశాల మధ్య వచ్చిన అవగాహనను ఆయన  స్వాగతించారుదేశాల మధ్య సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యం ఇప్పటికే బలంగా ఉన్న మానవ సంబంధాలకు మరో స్థాయికి తీసుకెళ్తాయని ఇరువురు ప్రధానంగా పేర్కొన్నారు

గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా భూమిదాని మీది ప్రజల ప్రయోజనాలను కాపాడేలా వాతావరణ మార్పుపునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంవిపత్తు సంబంధింత ప్రమాదాలను తగ్గించటంపర్యావరణ శాస్త్రం వంటి అంశాలపై పనిచేయటాన్ని కొనసాగిస్తామని రెండు దేశాల నేతలు తెలిపారు

పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకుఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు అధ్యక్షుడు ముయిజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

మత్స్యజలచరాల పెంపకం… పర్యావరణ శాస్త్రండిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలుయూపీఐభారత ఫార్మకోపియారాయితీతో కూడిన రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్వంటి వాటికి సంబంధించి అవగాహాన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారుఆ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిఇతర కార్యకలాపాలకు సహయం అందించే కొత్త రుణ పరిమితి రూ. 4850 కోట్లుగా (సుమారు 550 మిలియన్ల డాలర్లుఉందిఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించి సవరణ ఒప్పందం కూడా ఈ సందర్భంగా ఇరువురు ఇచ్చి పుచ్చుకున్నారుకొత్త రుణ పరిమితి ఆ దేశ వార్షిక రుణ చెల్లింపును 40% తగ్గిస్తుంది (51 మిలియన్ల డాలర్ల నుంచి 29 మిలియన్ల డాలర్లకు). ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను కూడా ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి

అడ్డూ నగరంలో రోడ్లుమురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులను.. ఇతర నగరాల్లో అత్యంత ప్రభావంగా పనిచేసే సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ఇరువురు వర్చువల్‌గా ప్రారంభించారుఆ దేశ జాతీయ రక్షణ దళాలతో పాటు విదేశాంగ అధికారులకు 3,300 గృహాలను, 72 వాహనాలను ప్రధాని మోదీ అందజేశారు.

ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ (భీష్మ్కింద రెండు మొబైల్ ఆస్పత్రులను ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారువీటిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయిఆరుగురు వైద్య సిబ్బందితో కూడిన సిబ్బంది 72 గంటల వరకు పనిచేసేలా సౌకర్యాలున్న ఈ ఆస్పత్రులు 200 మంది బాధితులకు వైద్య సహాయం అందించగలవు.

ప్రకృతి పరిరక్షణ పట్ల తమకున్న లోతైన నిబద్ధతకు అనుగుణంగా భారతదేశానికి చెందిన "తల్లి పేరు మీద ఒక చెట్టు", మాల్దీవులకు చెందిన "50 లక్షల చెట్లను పెంచే ప్రతిజ్ఞకార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు నాయకులు మామిడి మొక్కలను నాటారు.

ఆ దేశ అవసరాలుప్రాధాన్యతలకు అనుగుణంగా మాల్దీవులకుఆ దేశ ప్రజలకు సహయసహకారాలు అందించే విషయంలో భారత్ నిబద్ధతనను ప్రధాని మరోసారి తెలియజేశారుహిందూ మహాసముద్ర ప్రాంత శాంతిపురోగతిశ్రేయస్సుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.

 

***


(Release ID: 2148768)