మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2025’ నామినేషన్ల దాఖలుకు గడువు తేదీ ఆగస్టు 15 వరకు పొడిగింపు


*జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ

Posted On: 22 JUL 2025 5:02PM by PIB Hyderabad

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు (పీఎంఆర్‌బీఆర్‌పీఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించడానికి ఆఖరి తేదీని ఆగస్టు 15 వరకూ పొడిగించారుదరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in లో ఏప్రిల్ న ప్రారంభించారు.  ధైర్య సాహసాలుసామాజిక సేవపర్యావరణంక్రీడలుకళలుసాంస్కృతిక రంగంసైన్స్ అండ్ టెక్నాలజీలలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బాలలకు ఈ అవార్డులు ఇస్తారు.

ఈ నెల 31 నాటికి అయిదేళ్ల వయస్సు మించిన బాలలతో పాటు వయస్సు 18 ఏళ్లకు మించని భారతీయ పౌరులుభారత్‌లో నివసిస్తున్న వారు ఈ అవార్డులకు అర్హులు

దేశ పౌరుల్లో ఎవరైనా దాఖలు చేసే నామినేషన్లను ఒక్క జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ద్వారానే స్వీకరిస్తారుఈ అవార్డులకు సిఫారసులను లేదా స్వీయ నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేస్తేనే పరిశీలిస్తారుమరిన్ని  వివరాల కోసంజాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ను సందర్శించవచ్చు

 

***


(Release ID: 2147002)