గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 పురస్కారాలను ఈనెల 17న ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

ఈ సంవత్సరం 4 కేటగిరీల్లో మొత్తం 78 పురస్కారాలు
సర్వేలో పాల్గొన్న 14 కోట్ల మంది పౌరులు
పట్టణ పరిశుభ్రత, సేవలందిస్తున్న తీరు అంచనా కోసం 10 ప్రాధాన్య అంశాలతో

స్మార్ట్, నిర్మాణాత్మక విధానాన్ని అనుసరించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25

Posted On: 15 JUL 2025 12:50PM by PIB Hyderabad

గృహనిర్మాణపట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ఓహెచ్‌యూఏఈనెల 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే జాతీయ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 పురస్కారాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారుఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణపట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్సహాయమంత్రి శ్రీ టోకన్ సాహు పాల్గొంటారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే 9వ ఎడిషన్ఈ చారిత్రక కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బీఎమ్-యూ)ను ముందుకు నడిపిస్తున్న నగరాల అవిశ్రాంత కృషిని గుర్తిస్తూ.. దేశంలోని పరిశుభ్రమైన నగరాలను ఎంపిక చేస్తుందిఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఎసూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలు బి) 5 జనాభా వర్గాల నుంచి టాప్ పరిశుభ్ర నగరాలు సిప్రత్యేక వర్గంగంగా పట్టణాలుకంటోన్మెంట్ బోర్డులుసఫాయిమిత్ర సురక్షమహాకుంభ్ డిరాష్ట్ర స్థాయి పురస్కారాలు రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల్లోని అత్యంత పరిశుభ్రమైన నగరాలు అనే విభాగాల్లో ప్రదానం చేస్తారుమొత్తం 78 పురస్కారాలను అందించనున్నారు.

ఎస్‌బీఎమ్-యూ కింద చారిత్రక కార్యక్రమంగా స్వచ్ఛ సర్వేక్షణ్ (ఎస్ఎస్గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలోని పట్టణాలను పరిశుభ్రత దిశగా నడిపించే శక్తిగా మారిందిప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడంవారి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడంస్ఫూర్తిదాయకమైన చర్యల కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 2016లో 73 యూఎల్‌బీలతో ప్రారంభమగా.. ఈ సర్వే తాజా ఎడిషన్ 4,500 లకు పైగా నగరాలను కలిగి ఉందిఈ సంవత్సరం అగ్రశ్రేణి స్వచ్ఛ నగరాలకు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నగణనీయ పురోగతి సాధిస్తున్న చిన్న నగరాలకూ పురస్కారాలు అందించి ప్రోత్సహించనున్నారు.

తగ్గించడంమళ్లీ ఉపయోగించడంరీసైకిల్ చేయడం స్ఫూర్తితో ఎస్ఎస్ 2024-25 పురస్కారాలను అందిస్తున్నారుదేశవ్యాప్తంగా ప్రతి వార్డులో 3,000 మందికి పైగా మదింపుదారులు 45 రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహించారుసమగ్రతపారదర్శకత పట్ల అచంచలమైన నిబద్ధతతో ఈ సర్వే 11 లక్షలకు పైగా కుటుంబాల అభిప్రాయాలను సేకరించిందిఇది జాతీయ స్థాయిలో పట్టణ జీవన విధానంపారిశుధ్యాన్ని అర్థం చేసుకోగల సమగ్రమైనదార్శనిక విధానాన్ని ప్రతిబింబించింది.

2024లో నిర్వహించిన ఈ సర్వే ప్రజాభిప్రాయ సేకరణలో ఒక కీలక ఘట్టంగా నిలిచిందిముఖాముఖి సంభాషణలుస్వచ్ఛతా యాప్, MyGovసోషల్ మీడియా వేదికల ద్వారా 14 కోట్ల మంది పౌరుల నుంచి విజయవంతంగా అభిప్రాయాలను సేకరించి వారిని ఈ సర్వేలో భాగస్వాములుగా చేసింది.

పట్టణ పరిశుభ్రతనుప్రజలకు సేవలందున్న తీరును అంచనా వేయడం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఒక స్మార్ట్నిర్మాణాత్మక విధానాన్ని అనుసరించింది. 54 సూచికలు.. 10 ప్రాధాన్య అంశాలతో నగరాల్లో పారిశుధ్యంవ్యర్థాల నిర్వహణ గురించి పూర్తి అవగాహనను ఇది అందిస్తుంది.

ఎస్ఎస్ 2024-25 చాలా ప్రత్యేకమైన లీగ్.. ఇది సూపర్ స్వచ్ఛ లీగ్ (ఎస్ఎస్ఎల్)పరిశుభ్రతలో రాణిస్తున్న నగరాల ప్రత్యేక లీగ్ఎస్ఎస్ఎల్ రెండు ప్రయోజనాలను అందిస్తుందిఇది అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాలు పరిశుభ్రతలో మరింత ఉన్నత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రేరేపిస్తుందిఅలాగే ఇతర నగరాలు తమ పనితీరును మరింత మెరుగుపరచుకుని అగ్ర స్థానం కోసం పోటీపడేలా ప్రోత్సహిస్తుందిగత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు.. ప్రస్తుత సంవత్సరం సంబంధిత జనాభా కేటగిరీలో టాప్ 20 శాతంలో నిలిచిన నగరాలు ఎస్ఎస్ఎల్‌లో భాగంగా ఉంటాయి.

తొలిసారిగా దేశంలోని నగరాలను జనాభా ఆధారంగా ఐదు వర్గాలుగా వర్గీకరించారుఅవి (1) చాలా చిన్న నగరాలు: 20,000 కన్నా తక్కువ జనాభా గలవి, (2) చిన్న నగరాలు: 20,000 నుంచి 50,000 జనాభా గలవి, (3) మధ్యస్థ నగరాలు: 50,000 నుంచి లక్షల జనాభా గలవి, (4) పెద్ద నగరాలు: 3 నుంచి 10 లక్షల జనాభా గలవి, (5) మిలియన్-ప్లస్ నగరాలు: 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా గలవిప్రతి కేటగిరీని దాని పరిమాణంప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పారమితులను ఉపయోగించి మూల్యాంకనం చేశారుప్రతి కేటగిరీ నుంచి అత్యంత పరిశుభ్రమైన నగరాలను గుర్తించి పురస్కారాలను అందిస్తారుచిన్న నగరాలు కూడా అగ్రస్థానంలో ఉన్న ప్రధాన నగరాలతో సమానంగా పోటీ పడే అవకాశాన్ని ఈ విధానం అందిస్తుంది.

 

***


(Release ID: 2145109) Visitor Counter : 3