ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

Posted On: 12 JUL 2025 2:32PM by PIB Hyderabad

నమస్కారం!

కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయిసిఫార్సు లేదుఅవినీతి లేదుఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాంనేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాంఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారుఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందినేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారుకొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగామరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరుఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగామరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారుమీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటేవిభాగంపనిహోదాప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యంమళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలిప్రజలే ప్రథమంఇదే మన మార్గదర్శక సూత్రందేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించిందిజీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలుకెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ప్రజలుప్రజాస్వామ్యం.. ఈ రెండూ భారత్‌కు గల అపరిమిత శక్తులని ప్రపంచం నేడు గుర్తించిందిప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన దేశంఅతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ఈ యువశక్తి దేశ ఉజ్వల భవితకు గొప్ప ఆస్తిబలమైన భరోసాఈ శక్తినే సంక్షేమానికి సాధనంగా మలిచేలా మా ప్రభుత్వం రేయింబవళ్లూ కృషిచేస్తోందినేను ఇటీవలే అయిదు దేశాల్లో పర్యటించి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందేప్రతి దేశంలోనూ భారత యువశక్తిపై ప్రశంసలు వెల్లువెత్తాయిమన యువతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందిఈ పర్యటనల సందర్భంగా కుదిరిన అన్ని ఒప్పందాలు దేశంలోనూ విదేశాల్లోనూ భారత యువతకు నిశ్చయంగా ప్రయోజనం చేకూరుస్తాయిరక్షణఔషధాలుడిజిటల్ సాంకేతికతఇంధనంఅరుదైన భౌగోళిక ఖనిజాల వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాలు భారత్‌కు మున్ముందు విశేష ప్రయోజనాలను చేకూరుస్తాయిఅవి భారత తయారీసేవల రంగాలకు బలమైన ప్రోత్సాహాన్నిస్తాయి.

మిత్రులారా,

మారుతున్న కాలానికి అనుగుణంగా 21వ శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం కూడా మారుతోందిఎప్పటికప్పుడు కొత్త రంగాలు అనేకం వస్తున్నాయిఅందుకే గత దశాబ్ద కాలంగా యువతను ఈ మార్పులకు సన్నద్ధులను చేయడంపై భారత్ దృష్టి పెట్టిందిఈ శకం అవసరాల దృష్ట్యా.. ప్రభుత్వం ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆధునిక విధానాలనూ రూపొందించిందిఅంకుర సంస్థలఆవిష్కరణలుపరిశోధనలకు దేశంలో నేడు రూపొందుతున్న అనువైన వ్యవస్థ యువత సమర్థతను పెంచుతోందిసొంతంగా అంకుర సంస్థలను ప్రారంభించాలనుకునే యువతను చూసినప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందిఅంకుర సంస్థలకు సంబంధించిన కొన్ని గణాంకాలను ఇప్పుడే డాక్టర్ జితేంద్ర సింగ్ మీ దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పంతో గొప్ప దార్శనికతవేగంశక్తియుక్తులతో ముందుకురుకుతున్న నా దేశ యువతను చూసి గర్విస్తున్నాను.

మిత్రులారా,

ప్రైవేటు రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోందిఇటీవలే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందిప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం పొందే యువతకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ15,000 అందిస్తుందిమరోమాటలో చెప్పాలంటేమొదటి ఉద్యోగం మొదటి జీతానికి సంబంధించి ప్రభుత్వం చేయూతనిస్తోందిదీనికోసం ప్రభుత్వం దాదాపు రూలక్ష కోట్ల బడ్జెటును కేటాయించిందిఈ పథకం ద్వారా దాదాపు 3.5 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

మిత్రులారా,

నేడు తయారీ రంగం మన దేశానికిగల గొప్ప వరంతయారీ రంగంలో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయిఈ రంగానికి ఊతమిచ్చేందుకు ‘మిషన్ మాన్యుఫాక్చరింగ్’ను ప్రారంభించినట్లు ఈ ఏడాది కేంద్ర బడ్జెటులో ప్రభుత్వం ప్రకటించిందికొన్నేళ్లుగా ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని మేం బలోపేతం చేశాంఒక్క పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలుపథకం ద్వారానే దేశంలో 11 లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయిఇటీవల మొబైల్ ఫోన్ఎలక్ట్రానిక్స్ రంగాలు మునుపెన్నడూ లేనిరీతిలో వృద్ధిని సాధించాయిగత 11 ఏళ్లలో ఇందులో అయిదు రెట్ల వృద్ధి నమోదైందినేడు భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ దాదాపు రూ11 లక్షల కోట్లుఅంతకుముందు భారత్‌లో లేదా మాత్రమే మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఉండేవినేడు మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన దాదాపు 300 యూనిట్లున్నాయిలక్షలాది యువతకు అవి ఉద్యోగాలను అందిస్తున్నాయిమరో ముఖ్యమైన రంగం రక్షణ తయారీముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇది అందరి దృష్టినీ ఆకర్షించిందిఈ రంగం ప్రతిష్ఠ ఇనుమడిస్తోందిరక్షణ ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోందిప్రస్తుతం మన రక్షణ ఉత్పత్తులు రూ1.25 లక్షల కోట్లు దాటాయిలోకోమోటివ్ రంగంలోనూ భారత్ ప్రధాన మైలురాయిని చేరిందిభారత్ నేడు ప్రపంచంలో అతిపెద్ద రైలింజన్ ఉత్పత్తిదారురైలింజన్లురైలు పెట్టెలుమెట్రో కోచ్‌లు... ఏవైనా సరేభారత్ వాటిని పెద్ద సంఖ్యలో అనేక దేశాలకు ఎగుమతి చేస్తోందిమన ఆటోమొబైల్ రంగం కూడా మునుపెన్నడూ లేనివిధంగా వృద్ధిని సాధిస్తోంది.

గత సంవత్సరాల్లోనే ఈ రంగంలో దాదాపు 40 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయిఅంటేకొత్త కంపెనీలు వచ్చాయి. కొత్త కర్మాగారాలను నెలకొల్పడంతోపాటు, కొత్త ఉద్యోగావకాశాలు లభించాయిఅదే సమయంలో దేశంలో రికార్డు స్థాయిలో ఆటోమొబైల్స్ అమ్మకాలతో వాహన డిమాండు పెరిగిందిఅనేక రంగాల్లో భారత్ పురోగతితయారీలో ఈ రికార్డులు ఊరికే వచ్చినవి కాదుఎక్కువ మంది యువత ఉద్యోగాలు పొందుతుండడం వల్లే అవి సాధ్యమవుతున్నాయివారి కృషితెలివితేటలుఅంకితభావం వల్లే ఇది సాధ్యమైందిదేశ యువత ఉద్యోగాలను పొందడమే కాకుండావాటిలో అత్యున్నతంగా రాణించారుతయారీ రంగంలో ఇదే ఊపు కొనసాగేలా చూసుకోవడం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ కర్తవ్యంమీరెక్కడ నియమితులైనా.. ఉత్తేజాన్ని నింపాలి... ప్రోత్సాహకులుగా ఉండాలిఅవరోధాలను అధిగమించి ప్రక్రియలను సులభతరం చేయాలి. మీరు వ్యవస్థను ఎంత తేలికగా నడపగలిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.

మిత్రులారా,

నేడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే దిశగా వేగంగా పురోగమిస్తోందిభారతీయుడెవరైనా ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలరు. ఈ ఘనత కూడా మన యువత చేసిన కృషివారు కష్టించడం వల్లనే సాధ్యం అయింది.

గత 11 సంవత్సరాల్లో దేశం అన్ని రంగాలలో పురోగతి సాధించిందిఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వోవిడుదల చేసిన ఓ నివేదికలోని అంశాలు అత్యంత ప్రశంసనీయార్హమైనవి. గత దశాబ్ద కాలంలో దేశంలోని 90 కోట్లకు పైగా పౌరులు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారనని ఈ నివేదిక పేర్కొన్నదిముఖ్యంగాఇది సామాజిక భద్రతను విస్తృతపరచడమేఈ పథకాలు సంక్షేమానికే పరిమితం కాదు.. అవి భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించాయికొన్ని ఉదాహరణలు చెప్తాను... ప్రధానమంత్రి ఆవాస యోజనఈ పథకం కిందఇప్పటికే కోట్ల కొత్త పక్కా ఇళ్ళను నిర్మించాంమరో కోట్ల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయిఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తుంటే.. మేస్త్రీలుకార్మికులుముడి పదార్థాల సరఫరాదారులురవాణా చేసేవారుస్థానిక దుకాణదారులుారీ డ్రైవర్లు.. ఇలా అందరికీ పని దొరుకుతుందిదీని ద్వారా ఎంత భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయో ఊహించండిఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ఉపాధి అవకాశాల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయికాబట్టి ప్రజలు నగరాలకు వలస పోవాల్సిన అవసరం లేదుఅదేవిధంగా దేశవ్యాప్తంగా కొత్తగా 12 కోట్ల టాయిలెట్లను నిర్మించారుఇది నిర్మాణ రంగంలోనే కాకుండామన విశ్వకర్మ సమాజానికి చెందిన ప్లంబర్లువడ్రంగులునైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా పని దొరికేలా చేసిందిఇలా ఉద్యోగావకాశాలు విస్తరించిక్రియాశీల ప్రభావాన్ని చూపుతున్నాయిఅదేవిధంగా ఉజ్వల పథకం కింద 10 కోట్లకు పైగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లను అందించాందీనికోసం పెద్ద సంఖ్యలో ఎల్పీజీ బాటిలింగ్ యూనిట్లు నెలకొల్పారుఇది సిలిండర్ తయారీదారులుపంపిణీ సంస్థలుడెలివరీ సిబ్బందికి ఉపాధిని కల్పిస్తోందిమీరు జాగ్రత్తగా పరిశీలిస్తే.. ప్రతీ కార్యక్రమం అనేక దశల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిస్తోందిఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది ప్రజలు కొత్త ఉద్యోగాలను పొందారు.

మిత్రులారా,

మరో పథకం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ‘ఇంకో లడ్డూ కావాలా’ అని మనం మాట్లాడుకుంటాం చూడండిఅలాంటిదే ఇదిఅది పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనఈ పథకం కింద ప్రతి ఇంటికీ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సగటున రూ75,000 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందిఇది ఇంటి పైకప్పును విద్యుత్ ప్లాంటుగా మారుస్తుందిగృహ అవసరాల కోసం మాత్రమే కాదు.. మిగులు విద్యుత్ ఉంటే గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కూడా ఉందిఇది కరెంటు బిల్లులు చెల్లించాల్సి అవసరం లేకుండా చేసి కుటుంబాలకు పెద్దమొత్తంలో డబ్బును ఆదా చేస్తుందిఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఇంజినీర్లుసాంకేతిక నిపుణులు అవసరంసోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారాలుముడి పదార్థాల సరఫరాదారులు పెరుగుతున్నారుసామగ్రిని తరలించడానికి రవాణా రంగంలో నిర్వాహకులను నియమించాలిఈ వ్యవస్థల నిర్వహణమరమ్మతుల కోసం ఒక సరికొత్త పరిశ్రమే ఆవిర్భవిస్తోందిఒక్కసారి ఆలోచించండి – ఈ ప్రయోజనాలు పౌరులకు సహాయపడడమే కాకుండాలక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి.

మిత్రులారా,

నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం మన అక్కాచెల్లెళ్లుబిడ్డల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించిందిఈ పథకం కింద లక్షలాది గ్రామీణ మహిళలు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారుగ్రామాలకు చెందిన మన తల్లులుఅక్కాచెల్లెళ్లు.. డ్రోన్ దీదీలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలను అందిస్తూఒకే వ్యవసాయ సీజన్‌లో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అందుబాటులో ఉన్న పలు నివేదికలు వెల్లడిస్తున్నాయిఅంతేకాదుదేశంలో డ్రోన్ తయారీ రంగానికి కూడా ఈ పథకం ఊపునిస్తోందివ్యవసాయమైనా రక్షణ రంగమైనా.. డ్రోన్ తయారీ దేశ యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది.

మిత్రులారా,

మూడు కోట్ల మహిళలను లాఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందివీరిలో 1.5 కోట్ల మహిళలు ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధించారుమీకు తెలుసు.. లాఖ్‌పతి దీదీ కావడమంటే ఒక్కసారి మాత్రమే కాదుస్థిరంగా ఏటా కనీసం లక్ష రూపాయలు సంపాదించడంఅదే దీనికి ప్రమాణం1.5 కోట్ల లాఖ్‌పతి దీదీలునేడు మీరు గ్రామాల్లోకి వెళ్తే.. బ్యాంక్ సఖిబీమా సఖికృషి సఖిపశు సఖి వంటి పదాలు మీకు వినిపిస్తాయిగ్రామాల్లోని మన తల్లులుఅక్కాచెల్లెళ్లు ఉపాధి అవకాశాలు పొందిన వివిధ పథకాలవిఅదేవిధంగాప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా మొదటిసారిగా వీధి వ్యాపారులువిక్రేతలకు చేయూత లభించిందిలక్షల మంది దీని ద్వారా ప్రయోజనం పొందారుడిజిటల్ చెల్లింపుల కారణంగారోడ్డు పక్కన ఉండే విక్రేతలు కూడా ఇప్పుడు నగదు కన్నా యూపీఐ వైపే మొగ్గు చూపుతున్నారుఎందుకుఎందుకంటే ఇది వారికి బ్యాంకు నుంచి అప్పటికప్పుడే మరిన్ని రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుందిబ్యాంకులు వారిని మరింత విశ్వసిస్తాయికుప్పలకొద్దీ పత్రాలతో వారికి పనిలేదుఅంటేఓ చిన్న వీధి వ్యాపారి కూడా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతోసగర్వంగా ముందుకు సాగుతున్నాడుప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్నే ఉదాహరణగా తీసుకోండిసాంప్రదాయకపరంపరగా వస్తున్నకుటుంబ ఆధారిత హస్తకళలువర్తకాలను ఆధునికీకరించడంనవీకరించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారించిందిఆధునిక పరికరాలను అందించడంకళాకారులకు శిక్షణ ఇవ్వడంరుణ సౌలభ్యాన్ని అందించడం ద్వారా ఈ పథకం చేయూతనిస్తుందిపేదల అభ్యున్నతికిఅలాగే యువతకు ఉపాధి లభించే పథకాలు అనేకం ఉన్నాయిఇవి ఎంతలా ప్రభావం చూపాయంటేపదేళ్లలోనే 25 కోట్ల భారతీయులు పేదరికాన్ని అధిగమించారుఒక్కసారి ఆలోచించండి ఉద్యోగం దొరకకపోతేకుటుంబంలో ఆదాయం లేకపోతేమూణ్నాలుగు తరాలుగా పేదరికంలో మగ్గిపోతున్న వ్యక్తి ఆ అంధకారం నుంచి బయటకు రావడాన్ని కనీసం ఊహించగలడావారికిప్రతిరోజూ మనుగడ కోసం పోరాటమేజీవితం భారంగా అనిపిస్తుందికానీ నేడువారు తమ శక్తియుక్తులతో పేదరికాన్ని జయించారువిజేతలుగా నిలిచిన ఈ 25 కోట్ల సోదరీసోదరుల దృఢ సంకల్పానికి నేను ప్రణమిల్లుతున్నానువారు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకున్నారుఫిర్యాదులు చేస్తూ కూర్చోలేదు. వారు పేదరికంతో పోరాడారుదానిని సమూలంగా పెకలించివిజయం సాధించారుఇప్పుడు ఈ 25 కోట్ల మందిలో ఎంతటి ఆత్మవిశ్వాసం ఉంటుందో ఊహించండిఓ వ్యక్తి సంక్షోభాన్ని అధిగమిస్తేకొత్త హుషారు వస్తుందిఇప్పుడు మన దేశంలో ఈ కొత్త శక్తి కనిపిస్తోందిఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందినేను స్పష్టంగా చెప్తున్నానుఇదేదో ప్రభుత్వం మాత్రమే చెబుతున్నది కాదుప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు నేడు ఈ విజయంపట్ల భారత్‌ను మెచ్చుకుంటున్నాయిప్రపంచం భారత్‌ను ఓ ఆదర్శంగా చూస్తోందిసమానత్వం పరంగానేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోందిఅంటేఅసమానతలు వేగంగా తగ్గుతున్నాయిగొప్ప సమానత్వం దిశగా మనం పయనిస్తున్నాంఈ పరివర్తనను ప్రపంచం గమనిస్తోంది.

మిత్రులారా,

పేదల సంక్షేమంఉపాధి కల్పన దిశగా గొప్ప అభివృద్ధి లక్ష్యంతో సాగుతున్న ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈరోజు నుంచి మీపైనా ఉందిప్రభుత్వం ఎప్పుడూ అడ్డంకిగా ఉండకూడదు. అది అభివృద్ధికి దోహదకారిగా ఉండాలిఅభివృద్ధి చెందేందుకు ప్రతి వ్యక్తికీ అవకాశాలుండాలిచేయూతనిచ్చే పాత్ర మనదిమీరంతా యువకులుమీ మీద నాకు చాలా నమ్మకముందిమీ మీద నాకు ఎన్నో ఆశలున్నాయిమిమ్మల్ని ఎక్కడ నియమించినామీరెప్పుడూ ప్రజలకే ప్రాధాన్యమివ్వాలివారికి సహాయం చేయడం.. వారి కష్టాలను తగ్గించడం... అదే దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తుందిభారత అమృత కాలంలోఈ సువర్ణావకాశాల యుగంలో మీరు క్రియాశీల భాగస్వాములు కావాలిరాబోయే 20 25 సంవత్సరాలు మీ కెరియర్ కే కాదుమొత్తం దేశ భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. ‘వికసిత భారత్’ నిర్మాణానికి ఇవి నిర్ణయాత్మక సంవత్సరాలుఅందుకే మీ పనిమీ విధులుమీ లక్ష్యాలు అన్నీ వికసిత భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉండాలి. ‘నాగరిక దేవో భవో (ప్రజల దేవుళ్లు)’- ఇదే మంత్రప్రదంగా మీ నరనరాల్లో ప్రవహించాలిమీ మనస్సులోఆలోచనల్లో ఇదే ఉండాలిమీ నడవడిలోప్రవర్తనలో ఆ స్ఫూర్తి ప్రతిబింబించాలి.

మిత్రులారాగత పదేళ్లుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ యువశక్తి నాతో పాటు నిలిచిందన్న పూర్తి నమ్మకం నాకుందివారెక్కడున్నా నా ప్రతి మాటనూ మనస్ఫూర్తిగా విన్నారుదేశం కోసం వారు చేయగలిగినదంతా చేశారుఇప్పుడు ఈ అవకాశం మీకు లభించిందిమీపై ఇంకా చాలా అంచనాలున్నాయిమీ బాధ్యత చాలా పెద్దదిమీరు అవకాశాన్ని ఉపయోగించుకుని దాన్ని సాకారం చేస్తారన్న నమ్మకం నాకుందిమీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుమీ కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలుమీకెంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందిమీరంతా జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నానుఐగాట్ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ ఉండండిఇప్పుడు మీకో అవకాశం వచ్చింది... వెనక్కి తగ్గకండిగొప్పగా కలలు కనండి.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోండినిరంతర కృషిఅభ్యాసంకొత్త ఫలితాలతో ముందుకు సాగండిమీ పురోగతి దేశానికి గర్వకారణంమీ అభివృద్ధితోనే నాకు సంతృప్తి కలుగుతుందిఅందుకే.. నేడు మీరు జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ వేళ మీతో మాట్లాడటానికిమిమ్మల్ని ఆశీర్వదించడానికిఎన్నో కలలను నెరవేర్చుకోవడంలో నా భాగస్వామిగా మిమ్మల్ని స్వాగతించడానికి నేనిక్కడికి వచ్చానుఓ సన్నిహితుడైననమ్మకమైన సహచరుడిగా మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానుమీ అందరికీ ధన్యవాదాలుశుభాకాంక్షలు.

గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదంమౌలిక ప్రసంగం హిందీలో సాగింది.  

 

***


(Release ID: 2144560)