మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025, జులై 31
Posted On:
08 JUL 2025 2:11PM by PIB Hyderabad
ముస్లిం సమాజంలో అత్యంత పవిత్ర తీర్థయాత్ర అయిన హజ్ 2026కు దరఖాస్తు ప్రక్రియను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రారంభించింది.
హజ్‌కు వెళ్లాలని భావిస్తున్న యాత్రికులు https://hajcommittee.gov.in పోర్టల్ లేదా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘‘హజ్ సువిధ’’ మొబైల్ అప్లికేషన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. 2025 జులై 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై 31 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు తమ ఫారాలను సమర్పించే ముందు మార్గనిర్దేశకాలు, విధివిధానాలను పూర్తిగా చదవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీన లేదా అంతకు ముందే జారీ చేసి, 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటయ్యే మెషీన్ చదవగలిగిన అంతర్జాతీయ భారత పాస్‌పోర్టును కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి ముందు వారి సన్నద్ధతను పరిగణనలోకి తీసుకోవాలని యాత్రికులకు హజ్ కమిటీ సూచించింది. దురదృష్టవశాత్తూ సంభవించిన మరణం లేదా తీవ్రమైన అనారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో యాత్రను రద్దు చేసుకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది.
వేలాది మంది భారతీయ ముస్లింలకు భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారం, సౌకర్యాలతో హజ్ సందర్శించాలనే ఆధ్యాత్మిక ఆకాంక్షను నెరవేర్చుకొనేందుకు మరో అవకాశాన్ని ఈ ప్రకటన కల్పించింది.
మరిన్ని వివరాలకు https://hajcommittee.gov.in సందర్శించండి.
***
(Release ID: 2143098)
Read this release in:
English
,
Malayalam
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada