ప్రధాన మంత్రి కార్యాలయం
ఒప్పందాల జాబితా: ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధానమంత్రి పర్యటన
Posted On:
04 JUL 2025 11:41PM by PIB Hyderabad
A) సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాలు / ఒప్పందం:
i. ఇండియన్ ఫార్మకోపియా గురించిన అవగాహన ఒప్పందం
ii. త్వరిత ప్రభావ ప్రాజెక్టుల (క్యూఐపీల) అమలు కోసం భారత గ్రాంట్ సహాయం గురించిన ఒప్పందం
iii. 2025-2028 కాలానికి సాంస్కృతిక వినిమయ కార్యక్రమం
iv. క్రీడల్లో సహకారంపై అవగాహన ఒప్పందం
v. దౌత్యపరమైన శిక్షణలో సహకారంపై అవగాహన ఒప్పందం
vi. ట్రినిడాడ్-టొబాగోలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్టిండీస్ (యూడబ్ల్యుఐ)లో హిందీ, భారతీయ భాషల అధ్యయనాలకు సంబంధించిన రెండు ఐసీసీఆర్ అధ్యయన కేంద్రాలను తిరిగి ఏర్పాటు చేయడంపై అవగాహన ఒప్పందం.
B) గౌరవనీయ ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు:
i. ట్రినిడాడ్ అండ్ టొబాగో (టీటీ)లో నివసిస్తున్న భారత సంతతి ప్రజలకు ఆరో తరం వరకూ ఓసీఐ కార్డు సౌకర్యాన్ని పొడిగించడం: గతంలో ఈ సౌకర్యం టీ-టీలో నాలుగో తరం భారత సంతతి వరకు మాత్రమే అందుబాటులో ఉండేది.
ii. టీ అండ్ టీలోని పాఠశాల విద్యార్థులకు 2000 ల్యాప్‌టాప్‌లు కానుకగా అందించడం.
iii. ఎన్ఏఎమ్‌డీఈవీసీఓకి వ్యవసాయ ప్రాసెసింగ్ యంత్రాలను (1 మిలియన్ యూఎస్డీ) అధికారికంగా అప్పగించడం.
iv. టీ అండ్ టీలో 800 మందికి కృత్రిమ అవయవాలను అమర్చేందుకు 50 రోజుల శిబిరం నిర్వహించడం (పోస్టర్-ఆవిష్కరణ).
v. 'హీల్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద భారత్‌లో ప్రత్యేక వైద్య చికిత్స అందించడం.
vi. ఆరోగ్య సంరక్షణ సహకారంలో భాగంగా టీ అండ్ టీకి ఇరవై (20) హీమోడయాలసిస్ యూనిట్లు, రెండు (02) సముద్రమార్గ అంబులెన్సులను కానుకగా అందించడం.
vii. టీ అండ్ టీ విదేశాంగ, సీఏఆర్ఐసీఏఎమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానెళ్లను అందించి దానిని సోలరైజేషన్ చేయడం.
viii. భారత్ గీతా మహోత్సవ్ వేడుకలతో సమానంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ కల్చరల్ కోఆపరేషన్‌లోనూ గీతా మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం.
ix. టీ అండ్ టీ, కరేబియన్ ప్రాంత పండితుల కోసం భారత్‌లో శిక్షణ అందించడం.
C) ఇతర ఒప్పందాలు:
భారత్ చేపట్టిన ప్రపంచస్థాయి కార్యక్రమాల్లో చేరనున్నట్లు ప్రకటించిన టీ అండ్ టీ: విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), ప్రపంచ జీవన ఇంధన కూటమి (జీబీఏ) లలో చేరుతున్నట్లు టీ అండ్ టీ ప్రకటించింది.
***
(Release ID: 2142475)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam