ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామ మందిరం నమూనా, పవిత్ర జలాన్నీ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రికి బహూకరించిన ప్రధానమంత్రి

Posted On: 04 JUL 2025 8:57AM by PIB Hyderabad

అయోధ్యలోని రామ మందిరం నమూనాని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాకు బహుమతిగా ఇచ్చారుతన గౌరవార్థం ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి ఇచ్చిన విందు సందర్భంగా,  ఈ కానుకను శ్రీ మోదీ ఆమెకు అందజేశారుసరయూ నదికి చెందిన పవిత్ర జలాన్నీప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్‌ను నిర్వహించిన సందర్భంగా సేకరించిన పవిత్ర జలాన్నీ ప్రధానమంత్రి ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రికి బహూకరించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘అయోధ్య రామ మందిర నమూనాతో పాటు సరయూ నది పవిత్ర జలాన్నీప్రయాగ్రాజ్లో మహాకుంభ్‌ సందర్భంగా సేకరించిన పవిత్ర జలాన్నీ ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా ఇచ్చిన విందు కార్యక్రమంలో నేను ఆమెకు కానుకగా అందజేశానుఅవి భారత్ట్రినిడాడ్ టొబాగోల మధ్య ప్రగాఢ సాంస్కృతికఆధ్యాత్మిక సంబంధాలకు సంకేతాలు’’ అని పేర్కొన్నారు.

****


MJPS/ST


(Release ID: 2142060)