ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మారుతోన్న పరిస్థితుల గురించి వివరాలను ప్రధాని మోదీకి తెలిపిన ఆ దేశ ప్రధాని
భారత్‌కు ఉన్న ఆందోళనలు తెలిపిన మోదీ.. శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం అందని ప్రధానంగా పేర్కొన్న ప్రధాని
Posted On:
13 JUN 2025 11:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాలు, మారుతున్న పరిస్థితుల గురించిన వివరాలను ఆ దేశ ప్రధాని మోదీకి తెలియజేశారు.
భారత్ తరఫున ఆందోళనను ప్రధాని మోదీ ఆదేశ నాయకుడితో పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు.
ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు అందుబాటులో ఉండేందుకు అంగీకరించారు.
(Release ID: 2138939)
Visitor Counter : 2
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam