ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అత్యధిక వాతావరణ ఉష్ణోగ్రత ప్రమాదాల నిర్వహణకు


ముందుచూపుతో కూడిన క్రియాశీల విధానాన్ని తీసుకుంది: డాక్టర్ పీ.కే. మిశ్రా

వేడిగాలులకు సరిహద్దుల్లేవు.. ముఖ్యంగా పట్టణాలకు మరింత ముప్పు: డాక్టర్ పీ.కే. మిశ్రా

వేడిగాలుల విషయంలో కార్యచరణ ప్రణాళికను మెరుపరిచేందుకు మొత్తం ప్రభుత్వం, మొత్తం సమాజం విధానం ద్వారా బహుళ పక్ష వాటాదారులను భాగస్వామ్యం చేయటాన్ని భారత్ అనుసరిస్తోంది: డాక్టర్ పీ.కే. మిశ్రా
తీవ్రమైన వేడి వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సీమాంతర సహకారం అవసరం: డాక్టర్ పీ.కే.మిశ్రా

Posted On: 07 JUN 2025 10:03AM by PIB Hyderabad

ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీ.కేమిశ్రా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఇచ్చిన పిలుపును సమర్థిస్తూ తీవ్రమైన వేడి వాతావరణాన్ని ప్రపంచ సంక్షోభంగా భావించిఆ సమస్యను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందన్నారునిన్న (2025 జూన్ 06) జెనీవాలో జరిగిన తీవ్ర వేడి ప్రమాద నిర్వహణ (ఎక్స్‌ట్రీమ్ హీట్ రిస్క్ గవర్నెన్స్‌)పై జరిగిన ప్రత్యేక సెషన్‌లో కోలకోపన్యాసం చేశారుపెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యంఆర్థిక స్థిరత్వంపర్యావరణ ధృడత్వానికి ముప్పుగా మారాయని చెప్పారుతీవ్ర వేడి వాతావరణ నిర్వహణ విషయంలో ఉమ్మడి‌గా నేర్చుకునేందుకుమార్గదర్శకత్వం వహించటంభాగస్వామ్యాల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఒక సంయుక్త వేదికగా ఏర్పాటు చేయాలన్న యూఎన్‌డీఆర్‌ఆర్‌ ఆలోచనను స్వాగతిస్తున్నట్లు భారత్ తెలిపింది

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీవ్ర వేడి వాతావరణ ప్రమాద నిర్వహణకు ముందుచూపుతో కూడిన క్రియాశీల విధానాన్ని భారత్ తీసుకుందని డాక్టర్ మిశ్రా ప్రధానంగా చెప్పారుభారతదేశం విపత్తులకు స్పందించే విధానాన్ని దాటి సమగ్ర సంసిద్ధతఉపశమన వ్యూహాల దిశగా ప్రయాణం సాగించిందని అన్నారు. 2016 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏవేడిగాలుల నిర్వహణపై సమగ్రంగా జాతీయ స్థాయిలో మార్గదర్శకాలను తయారు చేసి 2019లో సవరించిందిఇది వేడి విషయంలో కార్యాచరణ ప్రణాళికల (హెచ్ఏపీ-హీట్ యాక్షన్ ప్లాన్)ను వికేంద్రీకరించారు. ముందస్తు హెచ్చరికలువివిధ సంస్థల మధ్య సమన్వయంప్రజలను భాగస్వామ్యం చేయటం ద్వారా ప్రాణాలను కాపాడటాన్ని తెలియజేసే అహ్మదాబాద్ వేడి వాతావరణ కార్యాచరణ ప్రణాళికను ఆ సందర్భంగా ప్రస్తావించారు

23 వేడి వాతావరణం ఉండే రాష్ట్రాలలో 250 కి పైగా నగరాలుజిల్లాలు ఎన్‌డీఎంఏ సలహాసాంకేతికతసంస్థాగత యంత్రాంగాల మద్దతుతో పనిచేసే కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉన్నాయిఅని డాక్టర్ మిశ్రా ప్రధానంగా చెప్పారునిఘాను బలోపేతం చేయటంఆసుపత్రులను సంసిద్ధంగా ఉంచటంఅవగాహనను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా వేడిగాలుల విషయంలో మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు

మొత్తం ప్రభుత్వంప్రజలందరినీ.. ఆరోగ్యంవ్యవసాయంపట్టణాభివృద్ధికార్మికవిద్యుత్జలవిద్యమౌలిక సదుపాయాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలను నిమగ్నం చేసే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని ప్రధానంగా చెప్పారువేడి వాతవరణం విషయంలో కార్యాచరణ ప్రణాళికలను మెరుగుపరచడంలో స్థానిక ప్రభుత్వాలకు సహయసహకారాలు అందించటంలో ప్రజారోగ్య సంస్థలుపరిశోధనా బృందాలుపౌర సమాజ సంస్థలువిశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు

"తీవ్రమైన వేడి వివిధ వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందిఈ విషయంలో స్పందించేందుకు సంప్రదాయ విజ్ఞానానికి స్థానిక అనుభావాలను జోడించిందిఅని డాక్టర్ మిశ్రా ప్రధానంగా చెప్పారుపాఠశాలలు... మార్పుకు ఉత్ప్రేరకాలుగా మారాయనివాతావరణం గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాయని అన్నారుఅత్యవసర పరిస్థితుల్లో వేగంగాప్రభావవంతంగా స్పందించేందుకు ఆసుపత్రులుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని వివరించారు

సంసిద్ధంగా ఉండటం అనే విధానం నుంచి భారతదేశం.. చలువ పైకప్పు సాంకేతికలుపరోక్ష కూలింగ్ కేంద్రాలుప్రట్టణాల్లో హరిత ప్రాంతాలను పెంచటంసంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణతో హా దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా వేడిగాలుల తీవ్రత తగ్గించే విధానానికి మారిందని తెలిపారుఅర్బన్ హీట్ ఐలాండ్ (యూహెచ్ఐఅంచనాలను నగర ప్రణాళికలకు భారత్ అనుసంధానిస్తోందని పేర్కొన్నారు

విధానపరమైన మార్పును సూచిస్తూ... జాతీయరాష్ట్ర విపత్తు ఉపశమన నిధులను(ఎస్‌డీఎంఎఫ్ఇప్పుడు వేడి గాలుల తగ్గింపు కోసం ఉపయోగించొచ్చని తెలిపారుఇది స్థానిక ప్రభుత్వాలుప్రైవేట్ రంగ సంస్థలుస్వచ్ఛంద సంస్థలువివిధ వ్యక్తులకు నివారణఉపశమన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసేందుకు వీలు కల్పిస్తుందనితద్వారా సంయుక్తంగా బాధ్యత తీసుకోవటం పెరుగుతుందని అన్నారు

ఇంకా ఉన్న కీలక సవాళ్లను గుర్తించాలని డాక్టర్ మిశ్రా కోరారుముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడానికిభవన నిర్మాణ సాంకేతికతలను మరింత అభివృద్ధి చేయడం, అందుబాటు ధరల్లో సాంస్కృతికంగా ఇబ్బందిలేని కూలింగ్ వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలన్నారుమహిళలుఆరుబయట పనిచేసే కార్మికులువృద్ధులుచిన్న పిల్లలను వేడిగాలులు కలిగించే ప్రభావాలు వేర్వేరుగా ఉన్నందున ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు రియల్-టైమ్ డేటా ఆధారంగా స్థానికీకరించిన వేడి-తేమ సూచికను (హీట్ హ్యుమిడిటీ ఇండెక్స్)ను అభివృద్ధి చేయడంపై ప్రపంచం దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

"వేడిగాలులకు సరిహద్దులు ఉండవుఅందరినీ ప్రభావితం చేస్తాయిముఖ్యంగా జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాల్లో వీటి ప్రమాదం ఎక్కువఅని డాక్టర్ మిశ్రా వ్యాఖ్యానించారుఈ విషయంలో ధృడంగా నిలబడేందుకు అంతర్జాతీయ సమాజం సాంకేతిక సహకారంవివరాలను పంచుకోవటంఉమ్మడి పరిశోధనలను పెంచాలని కోరారుసంస్థాగతఆర్థిక సహాయ విధానాలతో పాటు విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచటంపరిశోధనఆచరణాత్మక పరిష్కారాలను అందించేందుకు ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేయాలని అన్నారు

తీవ్ర వేడి విషయంలో ప్రపంచం ముందుచూపుసమన్వయంతో గట్టిగా స్పందించేందుకు భారతదేశం తన నైపుణ్యం.. సాంకేతికసంస్థాగత సామర్థ్యాలను ఇతరులతో పంచుకునే విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నట్లు డాక్టర్ మిశ్రా పునరుద్ఘాటించారు

 

***


(Release ID: 2134946) Visitor Counter : 3