ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ యువత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది... క్రియాశీలత, నవకల్పన, దృఢనిశ్చయం.. వీటికి మారుపేరుగా యువశక్తి నిలుస్తోంది: ప్రధానమంత్రి

కొత్త విద్యావిధానంతో పాటు అంకుర సంస్థలు, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధనలో యువత ముఖ్య భాగస్వామిగా మారింది: ప్రధాని

మన యువశక్తి రాణించడానికి చేతనైన అన్ని అవకాశాలనూ మేం వారికి అందిస్తూనే ఉంటాం...‘వికసిత్ భారత్’ సాధనలో వారిది కీలక పాత్ర: ప్రధాని‌

Posted On: 06 JUN 2025 10:42AM by PIB Hyderabad

భారతదేశ యువత ఒడిసిపట్టుకున్న ప్రపంచస్థాయి విజయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారువారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారుక్రియాశీలత్వంనూతన ఆవిష్కరణదృఢనిశ్చయం.. వీటికి ప్రతీకలుగా వారు నిలిచారని ఆయన అభివర్ణించారుయువశక్తీసంకల్పం.. ఇవి గత పదకొండు సంవత్సరాలుగా దేశ పురోగతికి వెన్నుదన్నుగా నిలిచాయని ఆయన అన్నారు.

అంకుర సంస్థలువిజ్ఞానశాస్త్రంక్రీడలుసంఘసేవసంస్కృతి సహా వివిధ రంగాల్లో యువ భారతీయులు విశేష సేవలను అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘గత 11 సంవత్సరాల్లోఊహకైనా అందని ఘనకార్యాలను యువత సాధించిన ప్రశంసాయోగ్య సందర్భాలను మనమంతా గమనించాం’’ అని ఆయన అన్నారు.

యువతకు సాధికారత కల్పన లక్ష్యంగా ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో అమలు చేసిన విధానాలు గణనీయ మార్పునకు కారణమయ్యాయని ప్రధాని శ్రీ మోదీ స్పష్టంచేశారుఒక దేశం చేయగలిగిన అత్యంత శక్తిమంతమైన పని ఆ దేశ యువతకు సాధికారతను కల్పించడమేనన్న దృఢ విశ్వాసం ప్రాతిపదికగా ‘స్టార్టప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’లతో పాటు ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందాయని శ్రీ మోదీ వివరించారు.

వెనుకటి 11 సంవత్సరాల్లోయువతకు సాధికారతను కల్పించడానికి ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నిస్తూ వస్తోందని ప్రధానమంత్రి తెలిపారునూతన విద్యావిధానంనైపుణ్యాల అభివృద్ధిఅంకుర సంస్థలపై దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో, ‘అభివృద్ధి చెందిన భారత్’ సంకల్ప సాధనలో యువత ప్రధాన భాగస్వాములుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

యువశక్తిని బలోపేతం చేసేందుకు సాధ్యమైన అన్ని అవకాశాలనూ ప్రభుత్వం కల్పిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ చెప్పారు.

శ్రీ మోదీ ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు:

‘‘మన దేశ యువత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొందిచైతన్యంనూతన ఆవిష్కరణలుసంకల్పం.. వీటికి మారుపేరుగా మన యువ శక్తి నిలిచిందిమన యువత సాటిలేని శక్తితోనూదృఢవిశ్వాసంతోనూ భారత్ వృద్ధి దూసుకుపోయేటట్లుగా చేస్తోంది.

గడచిన 11 సంవత్సరాల్లోఅంకుర సంస్థలువిజ్ఞానశాస్త్రంక్రీడలుసంఘసేవసంస్కృతితదితర అనేక రంగాల్లో అనూహ్య విజయాలను యువత సాధించిన ప్రశంసార్హ సందర్భాలను మనం చూశాం.

గత 11 సంవత్సరాలు యువత సాధికారత కల్పనకు ఉద్దేశించిన విధానంలోనూకార్యక్రమాలలోనూ నిశ్చయాత్మక దృక్పథాన్ని ప్రవేశపెట్టాయిఒక దేశం చేపట్టదగిన అత్యంత శక్తిమంతమైన పని యువతకు సాధికారతనను కల్పించడమేనన్న దృఢ విశ్వాసంలో నుంచే ‘స్టార్టప్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’లతో పాటు ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు పుట్టాయి.

వికసిత్ భారత్‌ను ఆవిష్కరించే దిశగా సాగుతున్న ప్రయత్నాలను మన యువతరం బలపరుస్తూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను.

#11YearsOfYuvaShakti"

‘‘వెనుకటి 11 సంవత్సరాల్లో మా ప్రభుత్వం యువశక్తికి సాధికారతను ఇవ్వడానికి అదే పనిగా క‌ృషి చేస్తూవచ్చిందికొత్త విద్యావిధానంతో పాటు నైపుణ్యాభివృద్ధిఅంకుర సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోమన యువతీయువకులు ‘వికసిత్ భారత్’ సంకల్పంలో ముఖ్య భాగస్వాములయ్యారుప్రస్తుతం దేశ యువత దేశ నిర్మాణంలో అగ్రగామి భూమికను పోషిస్తూ ఉండడం మాకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోంది.

#11YearsOfYuvaShakti"

‘‘మన యువశక్తి రాణించడానికి సాధ్యమైనన్ని అవకాశాలను వారికి మేం కల్పిస్తూనే ఉంటాంవికసిత్ భారత్‌ను సాకారం చేయడంలో వారిది కీలక పాత్ర

#11YearsOfYuvaShakti’’

 

***


(Release ID: 2134716)