ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జెనీవాలో విపత్తు ప్రమాద తగ్గింపు పెట్టుబడులపై జరిగిన మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో సాంకేతిక సహాయం, విజ్ఞాన బదిలీతో కూడిన ఉత్ప్రేరక నిధి కోసం ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలని.. నిర్దిష్టమైన, కాలపరిమితి గల ఫలితాల కోసం చర్యలు తీసుకోవాలని కోరిన భారత్


భారతదేశ డీఆర్ఆర్ పెట్టుబడి వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ విధానాలలో ఒకటిగా మారింది: డాక్టర్ పీ.కే. మిశ్రా

బలమైన, ప్రతిస్పందించే డీఆర్ఆర్ పెట్టుబడుల వ్యవస్థ ధృడత్వానికి మూలస్తంభమని భారత్ విశ్వసిస్తోంది: డాక్టర్ పీ.కే. మిశ్రా

విపత్తు ప్రమాద పెట్టుబడులను దేశాలు సొంతంగా చూసుకోవాలి. దీనికి అనుబంధంగా అంతర్జాతీయ సహకారం ఉండాలి: డాక్టర్ పీ.కే. మిశ్రా

Posted On: 06 JUN 2025 11:27AM by PIB Hyderabad

ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీ.కేమిశ్రా 2025 జూన్ 04న జెనీవాలో విపత్తు ప్రమాద తగ్గింపు (డీఆర్ఆర్డిసాస్టర్ రిస్క్ రిడక్షన్పెట్టుబడులపై జరిగిన మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారుకీలకమైన ఈ చర్చను చేపట్టినందుకు యూఎన్‌డీఆర్ఆర్దాని భాగస్వాములను ఆయన ప్రశంసించారుజీ20 అధ్యక్షత ద్వారా బ్రెజిల్దక్షిణాఫ్రికాలు ఈ ప్రపంచ స్థాయి చర్చను కొనసాగించటంలో చేసిన కృషిని ఈ సందర్భంగా భారత్ ‌గుర్తించింది

డీఆర్ఆర్ కు నిధుల లభ్యత (ఫైనాన్సింగ్) అనేది చిన్న విషయం కాదని.. పెరుగుతోన్న ప్రకృతి వైపరీత్యాలువిపత్తుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ వ్యవస్థల ప్రభావవంతమైన పనితీరుకుఅభివృద్ధి ఫలాలను కాపాడుకునేందుకు కేంద్రమని డాక్టర్ మిశ్రా ప్రధానంగా చెప్పారుబలమైనప్రతిస్పందించే డీఆర్ఆర్ ఫైనాన్సింగ్ వ్యవస్థ.. ధృడత్వానికి మూలస్తంభమని భారత్ విశ్వసిస్తోందని ఆయన అన్నారు

డీఆర్ఆర్ ఫైనాన్సింగ్‌లో భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా వివరిస్తూ మొదల్లో ఫైనాన్స్ కమిషన్ రూ. 6 కోట్లు కేటాయించినట్లు తెలిపారునేడు 15వ ఫైనాన్స్ కమిషన్ కింద మొత్తం వ్యయం రూ. 2.32 ట్రిలియన్లు (సుమారు 28 బిలియన్లు డాలర్లుదాటిందని తెలియజేశారు

2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రజిల్లా స్థాయులకు ముందుగా నిర్ణయించిననియమ ఆధారిత కేటాయింపుల ప్రాముఖ్యతను డాక్టర్ మిశ్రా ప్రధానంగా చెప్పారుఈ మార్పు ద్వారా విపత్తు ఫైనాన్సింగ్ చర్యకు ప్రతిచర్యగా కాకుండా నిర్మాణాత్మకంగాఊహించదగినదిగా మారిందని ఆయన అన్నారు.

నాలుగు కీలక అంశాలపై తయారైన భారత డీఆర్ఆర్  ఫైనాన్సింగ్ విధానాన్ని వివరించారుఇందులో మొదటిది -సంసిద్ధతతగ్గింపుఉపశమనంపునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఆర్థిక సహాయ వ్యవస్థరెండోది ప్రభావిత ప్రజలుఎక్కువ ప్రభావితమయ్యే వర్గాల అవసరాలకు ప్రాధాన్యత, మూడో అంశంఅన్ని ప్రభుత్వ స్థాయుల్లో అంటే కేంద్రరాష్ట్రస్థానిక సంస్థల స్థాయిలో ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచటం, నాలుగో అంశంజవాబుదారీతనంపారదర్శకతఅన్ని ఖర్చుల విషయంలో మదింపునకు వీలున్న ఫలితాలు

విపత్తు ప్రమాద పెట్టుబడులను దేశాలు సొంతగా నిర్వహించుకోవాలనిఅంతర్జాతీయ సహకారం దీనికి అనుబంధంగా ఉండాలని మిశ్రా ప్రధానంగా పేర్కొన్నారుప్రతి దేశం దాని వ్యవస్థను దాని పరిపాలను పద్ధతులకుఆర్థిక పరిస్థితిరిస్క్ తీసుకునే శక్తికి అనుగుణంగా ఖచ్చితంగా మార్చుకోవాలిఅదే సమయంలో  ప్రపంచ ప్రమాణాలుమార్గదర్శకత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి

పబ్లిక్ ఫైనాన్స్‌ ఆవల ఉన్న ఆర్థిక సాధనాల అవసరాన్ని గుర్తిస్తూ రిస్క్ పూలింగ్భీమాసరికొత్త ఆర్థిక సాధనాలు వంటి విధానాలను స్థానికంగా ఉన్న స్థోమతఆర్థిక స్థిరత్వానికి అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు

ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక కీలకమైన అంతరాన్ని గుర్తించిన ఆయన.. డీఆర్ఆర్ ఫైనాన్సింగ్ వ్యవస్థల ఏర్పాటు, వాటిని బలోపేతం చేసే విషయంలో మద్దతిచ్చేందుకు ప్రత్యేకించిన అంతర్జాతీయ ఆర్థిక యంత్రాంగం లేదని తెలిపారు.  సాంకేతిక సహాయంవిజ్ఞాన బదిలీతో కూడిన ఉత్ప్రేరక నిధులకు సంబంధించి ప్రపంచ స్థాయి వేదికను ఐక్యరాజ్యసమితిబహుళ పక్ష ఆర్థిక సంస్థల మద్దతుతో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటనలు మాత్రమే పరిమితం కాకుండా నిర్దిష్టమైనకాలపరిమితి గల ఫలితాల వైపు ముందుకు సాగాలని భారత్ కోరిందిఅంతర్జాతీయంగా మద్దతుతో నడిచే జాతీయ స్థాయి డీఆర్‌ఆర్ ఫైనాన్సింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసే విషయంలో నాయకత్వంసహకారానికి భారతదేశ నిబద్ధతను డాక్టర్ మిశ్రా పునరుద్ఘాటించారు.

 

***


(Release ID: 2134715) Visitor Counter : 2