ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటిన ప్రధానమంత్రి

Posted On: 05 JUN 2025 11:48AM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగాప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారుగుజరాత్‌లో కచ్ఛ్‌కు చెందిన సాహసిక మాతృమూర్తులుసోదరీమణులు కానుకగా ఆయనకు అందజేసిన మొక్క అది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ కాలంలో కచ్ఛ్‌కు చెందిన మాతృమూర్తులుసోదరీమణులు మొక్కవోని ధైర్య-సాహసాలతో పాటు గొప్ప దేశభక్తిని ప్రదర్శించారుప్రధాని ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన సంగతిని గుర్తుచేసుకున్నారు...నాకు బహుమతిగా ఇచ్చిన సిందూర్ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యంతో పాటు ప్రేరణకు కూడా ఒక ప్రబలమైన ప్రతీకగా అలరారుతుందని ప్రధానమంత్రి అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ మోదీ ఎక్స్‌లో ఒక సందేశాన్ని ఇలా పోస్టు చేశారు:

‘‘1971 లో యుద్ధంలో ధైర్య-సాహసాలుపరాక్రమాలకు అద్భుత ఉదాహరణను అందించిన కచ్ఛ్‌కు చెందిన వీరాంగనలైన మాతృమూర్తులుసోదరీమణులు ఇటీవల నేను గుజరాత్‌లో పర్యటించినప్పుడు నాకొక సిందూర్ మొక్కను కానుకగా ఇచ్చారుఆ మొక్కను ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజున న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నాటి నీళ్లు పోసే సౌభాగ్యం నాకు దక్కిందిఈ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యానికీస్ఫూర్తికీ శక్తిమంతమైన ప్రతీకగా నిలిచివుంటుంది.’’

 

**‌‌*


(Release ID: 2134428) Visitor Counter : 3