ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పట్టణాల్లో స్వచ్ఛ, హరిత రవాణాను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 JUN 2025 12:46PM by PIB Hyderabad

పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, హరిత రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమం స్వచ్ఛ, హరిత ఢిల్లీ ఆవిష్కారానికి తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. ఈ చర్య ఢిల్లీ ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుంది కూడా అని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు:

‘‘స్వచ్ఛ, హరిత ఢిల్లీకి రూపకల్పన. పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, స్వచ్ఛ రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాను. దీనికి అదనంగా, ఈ కార్యక్రమం ఢిల్లీ ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా మెరుగుపరుస్తుంది.’’‌

 

***


(రిలీజ్ ఐడి: 2134425) సందర్శకుల సూచీ సంఖ్య : : 42