ప్రధాన మంత్రి కార్యాలయం
విపత్తు నష్టభయం తగ్గింపునకు 8వ ప్రపంచ వేదిక జెనీవాలో నిర్వహణ..
ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల నిరోధ కృషికి భారత్ కట్టుబాటును పునరుద్ఘాటించిన
ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా
Posted On:
04 JUN 2025 9:06AM by PIB Hyderabad
విపత్తు నష్టభయం తగ్గింపునకు 8వ ప్రపంచ వేదికను నిన్న (2025 జూన్ 3న) జెనీవాలో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల నిరోధక కృషికి భారత్ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ అభివృద్ధి విషయాల నార్వే ఉప మంత్రి స్టాయిన్ రెనెట్ హాహెమ్‌తో డాక్టర్ మిశ్రా నిర్వహించిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. విపత్తు నష్టభయాలను తగ్గించడంలో అందర్జాతీయ సహకారానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
వేదిక ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ మిశ్రా పాల్గొన్నారు. విపత్తుల వేళ సన్నద్ధ చర్యలు తీసుకొనే విషయంలో భారత్ దృష్టికోణాన్ని ఈ కార్యక్రమంలో ఆయన ప్రధానంగా వివరించారు. సురక్షిత భవిష్యత్తును, ఆటుపోట్లకు తట్టుకోగల భవిష్యత్తును ఆవిష్కరించడానికి అవసరమైన భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ మిశ్రా చెప్పారు.
***
(Release ID: 2134002)
Visitor Counter : 3
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam