ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 JUN 2025 8:23PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు సమీపంలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో యోగా ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన పులిగుండు జంట కొండల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2,000కిపైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) 2025 ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నెల రోజుల కార్యక్రమాలకు అద్భుతమైన ఆరంభంగా నిలిచింది.

 

కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ను ఉటంకిస్తూ, “యోగా డే 2025 పట్ల ఉత్సాహం పెరగడం సంతోషంగా ఉంది. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏపీ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయం. ఈ నెల 21న ఏపీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 

‘మీరంతా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని, యోగాను మీ జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను‘ అని శ్రీ మోదీ పిలుపు ఇచ్చారు. 


(रिलीज़ आईडी: 2133671) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada