పార్లమెంటరీ వ్యవహారాలు
ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదన్న భారత్
దృఢమైన సందేశాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు
Posted On:
17 MAY 2025 9:19AM by PIB Hyderabad
ఆపరేషన్ సింధూర్, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కొనసాగిస్తున్న పోరాటం నేపథ్యంలో ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు ఈనెల తరువాత ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్య దేశాలతో సహా కీలక భాగస్వామ్య దేశాలను సందర్శించనున్నాయి.
అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న జాతీయ ఏకాభిప్రాయం, అవలంబిస్తున్న దృఢమైన విధానాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడం అఖిలపక్ష ప్రతినిధుల పర్యటన ఉద్దేశం. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదన్న భారత్ బలమైన సందేశాన్ని వారు ప్రపంచానికి చేరవేయనున్నారు.
ప్రతి ప్రతినిధి బృందంలో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు, రాజకీయ ప్రముఖులు, ప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారు.
ఈ కింద పేర్కొన్న పార్లమెంటు సభ్యులు ఏడు ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తారు.
1) శ్రీ శశిథరూర్ , ఐఎన్ సీ
2) శ్రీ రవి శంకర్ ప్రసాద్ , బిజెపి
3) శ్రీ సంజయ్ కుమార్ ఝా, జెడియు
4) శ్రీ వైజయంతి పండా, బిజెపి
5) శ్రీమతి కనిమొళి కరుణానిధి, డిఎంకె
6) శ్రీమతి సుప్రియ సూలే, ఎన్సిపి
7) శ్రీ శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, శివసేన
***
(Release ID: 2129419)
Visitor Counter : 4
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam