ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 16 MAY 2025 10:13AM by PIB Hyderabad

సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనదిప్రకృతి రమణీయతసుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలుకష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.

ప్రధానమంత్రి ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు! 50 వ అవతరణ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది.

 

ప్రకృతి రమణీయతసుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలుకష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన ఈ రాష్ట్రం.. వివిధ రంగాల్లో  గొప్ప ప్రగతి సాధించిందిఈ సుందరమైన రాష్ట్రానికి చెందిన ప్రజలు మరింత వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.’’


(Release ID: 2129029)