ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 04 MAY 2025 8:16PM by PIB Hyderabad

బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులుమన్సుఖ్ భాయ్సోదరి రక్షా ఖడ్సేశ్రీ రామ్ నాథ్ ఠాకూర్ జీబీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి జీ మరియు విజయ్ కుమార్ సిన్హా జీహాజరైన ఇతర విశిష్ట అతిథులుక్రీడాకారులుకోచ్ లుఇతర సిబ్బంది నా ప్రియమైన యువ స్నేహితులు!

దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులందరికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామీరంతా ఒకర్ని మించి మరొకరు అసమాన ప్రతిభావంతులు.

మిత్రులారా...

ఖేలో ఇండియా యువజన క్రీడల్లో భాగంగా బీహార్లోని పాట్నారాజ్గిర్గయభాగల్పూర్బెగుసరాయ్ సహా పలు నగరాల్లో పోటీలు జరుగుతాయిదేశం నలుమూలల నుంచి 6 వేల మందికిపైగా యువ క్రీడాకారులు తమ కలలుఆకాంక్షలను మోసుకుంటూ  క్రీడా సంరంభంలో పాల్గొంటున్నారుఅందరికీ నా శుభాకాంక్షలుదేశంలో నేడు క్రీడలు ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుగా పురోగమిస్తున్నాయిభారత క్రీడా సంస్కృతి ఇనుమడిస్తున్న కొద్దీప్రపంచ వేదికపై మన దేశం శక్తి కూడా ఇనుమడిస్తుందిదేశ యువతకు  కీలక వేదికను సమకూర్చడంలో ఖేలో ఇండియా యువజన క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

మిత్రులారా..

ప్రతిభకు పదును పెట్టుకోవడంలో క్రీడాకారులు నిరంతర శ్రమించాల్సి ఉంటుంది మేరకు మరిన్ని మ్యాచ్ లు ఆడటంవివిధ వేదికలపై పోటీలలో పాల్గొనడం అవసరంతదనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం తన విధానాలలో  అంశానికి సదా అగ్ర ప్రాధాన్యమిస్తుందిఇప్పుడు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయఖేలో ఇండియా యువజనఖేలో ఇండియా శీతాకాలఖేలో ఇండియా పారా క్రీడల వంటి పలు క్రీడా పోటీలను దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా బహుళ స్థాయులలో నిర్వహిస్తున్నారుక్రమం తప్పకుండా నిర్వహించే  పోటీలు క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిప్రతిభను వెలికితీస్తాయిబీహార్ క్రీడాకారుడు వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సులోనే ‘ఐపీఎల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించడాన్ని మనం ఈమధ్యే చూశాంఇలా రాణించడంలో అతని కృషి తక్కువదేమీ కాకపోయినాపలు పోటీల్లో పాల్గొనడం అతని ప్రావీణ్యం మెరుగులో కీలకపాత్ర పోషించిందిమరోరకంగా చెప్పాలంటే  క్రీడాకారుడైనా ఎంత ఎక్కువగా పోటీల్లో పాల్గొంటే అంత బాగా రాణిస్తారుయువ క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల సూక్ష్మ నైపుణ్యాలను అవగతం చేసుకోవడంతోపాటు విలువైన అనుభవ సముపార్జనకు ఖేలో ఇండియా యువజన క్రీడలు అవకాశం కల్పిస్తాయి.

మిత్రులారా..

మన దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్నది ప్రతి భారతీయుడి చిరకాల స్వప్నం సంకల్ప సాకారంలో భాగంగా 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ కృషి చేస్తోందిఅంతర్జాతీయ క్రీడలలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా  పాఠశాల స్థాయిలోనే క్రీడా ప్రతిభను పసిగట్టివిశిష్ట పద్ధతులతో శిక్షణనివ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందిఖేలో ఇండియా కిందటాప్ (టార్గెట్ ఒలింపిక్ పోడియంవంటి కార్యక్రమాలు బలమైన క్రీడావరణ వ్యవస్థ రూపకల్పనకు దోహదం చేశాయిబీహార్ సహా దేశవ్యాప్తంగా వేలాది క్రీడాకారులకు వీటితో ఎంతో ప్రయోజనం చేకూరిందివిభిన్న క్రీడలలో అవకాశాల అన్వేషణకు క్రీడాకారులను ప్రోత్సహించడంపై మా ప్రభుత్వం దృష్టి పెట్టిందిఇందులో భాగంగానే  ఖేలో ఇండియా యువజన క్రీడలలో “గట్కాకలరిపయట్టుఖో-ఖోమల్లఖంబ్యోగాసనాల” వంటి సంప్రదాయస్వదేశీ క్రీడలకు చోటు కల్పించాంఅంతేకాకుండా సరికొత్తవర్ధమాన క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకుంటున్నారు మేరకు “వుషుసెపక్ తక్రాపెన్కాక్ సిలాట్లాన్ బౌల్స్రోలర్ స్కేటింగ్” వంటి క్రీడల్లోనూ మనవాళ్లు ప్రశంసనీయంగా రాణిస్తున్నారు క్రమంలోనే 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా జట్టు ‘లాన్ బౌల్స్లో పతకం సాధించింది.

మిత్రులారా..

దేశంలో క్రీడా మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించిందిగత దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది ఏడాది  దాదాపు రూ.4,000 కోట్లు కేటాయించాంఇందులో అధిక  శాతం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చిస్తున్నాందేశవ్యాప్తంగా నేడు 1,000 కిపైగా ఖేలో ఇండియా కేంద్రాలు నడుస్తున్నాయివాటిలో 36కుపైగా బీహార్లోనే ఉన్నాయిఎన్డీఏ  డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నమూనాతో  బీహార్ కూడా ప్రయోజనం పొందుతోందిరాష్ట్ర ప్రభుత్వం తన స్థాయిలో సొంతంగా అనేక పథకాలను చేపడుతోందిరాజ్గిర్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటైందిఅదీగాక బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్టేట్ స్పోర్ట్స్ అకాడమీ వంటి సంస్థలు కూడా ఏర్పాటయ్యాయిఇక పాట్నా-గయ హైవే వెంబడి ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మాణం కొనసాగుతోంది.  అలాగే వివిధ గ్రామాల్లో క్రీడా సౌకర్యాల కల్పన చురుగ్గా చేపట్టారుఖేలో ఇండియా యువజన క్రీడలతో జాతీయ క్రీడా పటంలో బీహార్ గుర్తింపు మరింత పటిష్టమవుతుంది.

మిత్రులారా..

క్రీడాలోకందానితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మైదానాలకే పరిమితం కాదుయువతరానికి సరికొత్త ఉద్యోగ మార్గాల సృష్టితోపాటు స్వయం ఉపాధికీ దోహదం చేస్తోంది.  ఫిజియోథెరపీడేటా అనలిటిక్స్స్పోర్ట్స్ టెక్నాలజీబ్రాడ్కాస్టింగ్-స్పోర్ట్స్మేనేజ్మెంట్” వంటివి ముఖ్యమైన ఉప రంగాలుగా ఎదుగుతున్నాయి.  వీటిద్వారా శిక్షకులుఫిట్నెస్ ట్రైనర్లురిక్రూట్మెంట్ ఏజెంట్లుఈవెంట్ మేనేజర్లుస్పోర్ట్స్ లాయర్లుమీడియా నిపుణులుగా సరికొత్త పాత్రల్లో ఇమిడిపోయే అవకాశాలను యువ వృత్తి నిపుణులు అన్వేషించవచ్చుమరోరకంగా చెప్పాలంటే స్టేడియం అన్నది ఇవాళ మ్యాచ్లకు వేదిక మాత్రమే కాదు... వేలాది ఉద్యోగాలకూ మూలస్తంభంగా మారిందిక్రీడా సంస్థల రంగంలో యువతకు అనేక కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటున్నాయి.

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకొత్త జాతీయ విద్యా విధానపు ప్రధాన విద్యలో క్రీడలను ఏకీకృతం చేయడం జరిగింది రెండూ దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను మాత్రమే కాకుండా అగ్రశ్రేణి క్రీడా నిపుణులను కూడా తయారుచేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.

నా యువ మిత్రులారా..

జీవితంలోని ప్రతి అంశంలోనూ క్రీడా స్ఫూర్తి కి ఎంత ప్రాధాన్యం ఉందో మనందరికీ   తెలుసుజట్టుగా సమష్టి కృషినిసహకారాన్నిపట్టుదలను క్రీడలు ఎంతగానో పెంచుతాయిఆయా క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్లుగా.. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్  (ఒకే భారతం - శ్రేష్ఠ భారతంస్ఫూర్తికి ప్రతినిధులుగా మీరంతా అత్యుత్తమంగా రాణించాలి క్రీడలు ముగిసేనాటికి మీరంతా  బీహార్ నుంచి మధుర స్మృతులతో మీ స్వస్థలాలకు వెళ్తారని విశ్వసిస్తున్నాఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ‘లిట్టి చోఖా’ , బీహార్ కే ప్రత్యేకమైన ప్రసిద్ధ ‘మఖానా’ రుచిని ఆస్వాదించండి.

మిత్రులారా..

ప్రస్తుత ఖేలో ఇండియా యువజన క్రీడల్లో పాల్గొంటున్నవారిలో క్రీడా స్ఫూర్తిదేశభక్తి ఇనుమడించగలవని ఆశిస్తూ..  7 ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నా. 

***


(Release ID: 2127238)