మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 కోసం నామినేషన్లు


నమోదుకు చివరి తేదీ జూలై 31

అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లు

Posted On: 03 MAY 2025 10:44AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా బాలలు సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఏటా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంఆర్బీపీ)-2025 కోసం భారత ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించిందినామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూలై 31. అన్ని నామినేషన్లను అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి.

నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు (జూలై 31 నాటికినామినేషన్లకు అర్హులుఅసాధారణ విజయాలను సాధించిన పిల్లలను ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ పీఎంఆర్బీపీ కోసం నామినేట్ చేయవచ్చు. పిల్లలు స్వీయ నామినేషన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడం కోసంముందుగా మొదటి పేరుచివరి పేరుపుట్టిన తేదీదరఖాస్తుదారు విభాగం (వ్యక్తి/సంస్థ)మొబైల్ నంబర్-మెయిల్ ఐడీఆధార్ నంబర్ మొదలైన వివరాలను అందించడం ద్వారా పోర్టల్‌లో నమోదు చేసుకుని లేదా లాగిన్ అయ్యిక్యాప్చా ధ్రువీకరణ పూర్తిచేయాలిరిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రస్తుత నామినేషన్ల విభాగం కింద ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్2025’ని ఎంచుకుని, ‘నామినేట్/అప్లై నౌ’పై క్లిక్ చేయాలిదరఖాస్తుదారులు సంబంధిత అవార్డు విభాగాన్ని ఎంచుకునినామినేషన్ తమ కోసమా లేక మరెవరి కోసమా అన్నది తెలియజేయాలి.

దరఖాస్తు ఫారం కోసం నామినీ వివరాలుసాధించిన విజయమూ దాని ప్రభావాన్ని వివరించే సంక్షిప్త కథనమూ (గరిష్టంగా 500 పదాలు)సహాయక పత్రాల అప్‌లోడ్ (పీడీఎఫ్ ఫార్మాట్గరిష్టంగా 10 అటాచ్‌మెంట్లు)ఇటీవలి ఫొటో (జేపీజీ/జేపీఈజీ/పీఎన్జీ ఫార్మాట్‌అవసరంతుది సమర్పణకు ముందు దరఖాస్తులను డ్రాఫ్టులుగా సేవ్ చేసుకుని అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చుక్షుణ్నంగా సమీక్షించి సమర్పించిన అనంతరం డౌన్‌లోడ్ చేసుకోగల దరఖాస్తు ప్రతి రిఫరెన్సు కోసం అందుబాటులో ఉంటుంది.

కింది ఆరు విభాగాల్లో ప్రతిభ ప్రదర్శించిన 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న (2025 జూలై 31 నాటికిపిల్లలను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ద్వారా సత్కరిస్తారుధైర్య సాహసాలుసామాజిక సేవపర్యావరణంక్రీడలుకళలు – సంస్కృతిసైన్స్ అండ్ టెక్నాలజీ.

విభిన్న రంగాలలో దేశ యువత సాధించిన విజయాలను ఘనంగా చాటడంనిజ జీవితంలో ఆదర్శప్రాయులను పరిచయం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా చిన్నారుల్లో స్ఫూర్తిని నింపడంపిల్లల సమగ్రాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల లక్ష్యాలు.

మరింత సమాచారం కోసంనామినేట్ చేయడానికి సందర్శించండిhttps://awards.gov.in.  

 

***


(Release ID: 2126540) Visitor Counter : 12