సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రేపు ‘లీగల్ కరెంట్స్: ఎ రెగ్యులేటరీ హ్యాండ్ బుక్ ఆన్ ఇండియాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్- 2025’ విడుదల
Posted On:
02 MAY 2025 2:39PM
|
Location:
PIB Hyderabad
దేశ మీడియా, వినోద రంగంలో వేవ్స్-2025 కీలక ఘట్టం. ఈ కార్యక్రమంలో ‘లీగల్ కరెంట్స్: ఎ రెగ్యులేటరీ హ్యాండ్ బుక్ ఆన్ ఇండియాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ 2025’ శీర్షికన కీలక నివేదికను విడుదల చేయనున్నారు. వేవ్స్- 2025 నాలెడ్జ్ పార్టనర్లలో ఒకటైన ఖైతాన్ అండ్ కో దీనిని రూపొందించింది. భారతదేశ శక్తిమంతమైన మీడియా, వినోద రంగం సామర్థ్యాన్ని పెంపొందించి, ఆవిష్కరించే నియంత్రణ వ్యవస్థలను ఈ నివేదిక వివరిస్తుంది.
సమాచార ప్రసారం, టీవీ ప్రసారం, గేమింగ్, ఏఐ, డిజిటల్ మీడియా, సినిమా రంగాల్లో నైపుణ్యాలనూ సాంకేతిక ఆవిష్కరణలనూ పెంపొందించుకునేందుకు అవకాశాలను కల్పించే నియంత్రణ వ్యవస్థల వల్ల భారతదేశ మీడియా, వినోద పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇటువంటి కీలకమైన తరుణంలో ఈ లీగల్ గైడ్ వస్తోంది. ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా పెరగడం, దేశంలో కంటెంట్ వీక్షణలో మార్పులతోపాటు.. క్రియాశీలమైన పరిపాలన ద్వారా సమూలమైన డిజిటల్ పరివర్తన దిశగా భారత్ సాగుతోంది. దేశంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులున్న ముద్రణ రంగం, టీవీ, రేడియోల్లో ప్రసారాల కోసం ప్రభుత్వం తగిన నియంత్రణ ప్రక్రియలను రూపొందించి సులభతరం చేసింది.
ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు మార్కెట్‌లోకి విదేశీ సంస్థల ప్రవేశం, సహకారం, వాటి కార్యకలాపాల కోసం చట్టబద్ధమైన ప్రణాళికలను ప్రోత్సహించి, క్రమబద్ధీకరించేలా ఉన్న చట్టపరమైన వ్యాఖ్యానాలు ఈ హ్యాండ్‌బుక్‌లో ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రొడక్షన్, కో-ప్రొడక్షన్ ప్రోత్సాహక పథకాలు కూడా కంటెంట్ సృజనలో భారత్‌ను ప్రధాన గమ్యస్థానంగా నిలిపాయి.
అడ్వర్టైజింగ్, ఆన్‌లైన్ గేమింగ్, డిజిటల్ మీడియా వంటి కీలక రంగాల్లో సంబంధిత సంస్థలు, ప్రభుత్వం మధ్య సహకారంతో కూడిన భాగస్వామ్యం ఏర్పడింది. దీనివల్ల చట్టపరమైన అనుమతుల సమయంలో కార్యాచరణలో సౌలభ్యం లభిస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో కంటెంట్ కేంద్రంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో.. ప్రభావవంతమైన, సాంకేతిక ఆధారితమైన మీడియా, వినోద రంగంలో ఓ ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడాలన్నదే ఈ హ్యాండ్ బుక్ లక్ష్యం.
***
Release ID:
(Release ID: 2126313)
| Counter:
26
Read this release in:
Kannada
,
English
,
Nepali
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi