ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్, టొబాగోలో ఎన్నికల విజయంపై శ్రీమతి కమలా పెర్సాద్-బిస్సేస్సార్‌ను అభినందించిన ప్రధాని
Posted On:
29 APR 2025 2:49PM by PIB Hyderabad
ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కమలా పెర్సాద్- బిస్సేస్సార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ - ట్రినిడాడ్, టొబాగో మధ్య చరిత్రాత్మకంగా సన్నిహిత, కుటుంబ సంబంధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘ఎన్నికల్లో విజయం సాధించిన @MPKamlaకు హృదయపూర్వక అభినందనలు. ట్రినిడాడ్, టొబాగోతో మాకున్న చరిత్రాత్మక సన్నిహిత, కుటుంబ సంబంధాలు మరువలేనివి. ఇరుదేశాల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం దిశగా మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మీతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నాను.’’
***
MJPS/SR
(Release ID: 2125306)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam