WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

42 అద్భుతమైన యానిమేషన్ చిత్రాలను తెరకెక్కించిన వేవ్స్ యానిమేషన్ చిత్ర దర్శకుల పోటీ


వేవ్స్ సదస్సుకు అర్హత సాధించిన యానిమేషన్ సినిమాలు:

18 లఘు చిత్రాలు, 12 ఫీచర్ ఫిల్మ్‌లు, 9 టీవీ సిరీస్‌లు, 3 ఏఆర్/వీఆర్ ప్రాజెక్టులు

 Posted On: 28 APR 2025 2:41PM |   Location: PIB Hyderabad

ప్రపంచ దృశ్యశ్రవణ వినోద సదస్సు2025 క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-1లో భాగంగా నిర్వహించిన యానిమేషన్ సినీ దర్శకుల పోటీ (ఏఎఫ్‌సీ)లో 42 మంది తుది పోటీదారులను ఏప్రిల్ రెండో వారంలో ప్రకటించారు. మే నుంచి వరకు ముంబయిలో జరిగే వేవ్స్‌లో ప్రదర్శించాల్సిన 42 అత్యుత్తమ ప్రాజెక్టులపై సమగ్ర సృజనాత్మక కేటలాగ్‌ను డాన్సింగ్ ఆటమ్స్ స్టూడియో రూపొందించింది. ఏర్పాటైన నాటి నుంచి కేంద్ర సమాచారప్రసార శాఖ సహకారంతో జాతీయ స్థాయి పోటీలను ఆ స్టూడియో నిర్వహిస్తోందిప్రతిభావంతులైన సృజనకారులను తోటి కళాకారులునిర్మాతలుడిస్ట్రిబ్యూటర్లతో అనుసంధానించడం ఈ విశిష్ట కార్యక్రమ లక్ష్యంభౌగోళిక సరిహద్దులకు అతీతంగా సృజనకారులుపరిశ్రమల మధ్య సహకారాన్ని ఇది పెంపొందిస్తుంది.

తొమ్మిది నెలల నిశిత పరిశీలనల అనంతరం ఉత్తమమైనవిగా నిలిచిన ఈ 42 ప్రాజెక్టులూ మొత్తం యానిమేషన్ రంగానికి సంబంధించి కథాకథనంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయిసాంప్రదాయక యానిమేషన్వీఎఫ్ఎక్స్అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)/ వర్చువల్ రియాల్టీ (వీఆర్), వర్చువల్ ప్రొడక్షన్ వంటివన్నీ ఆ యానిమేషన్ రంగంలో భాగంగా ఉన్నాయిసృజనాత్మక కేటలాగ్‌లో వివిధ రకాల వినూత్న ప్రాజెక్టులున్నాయి12 కథా చిత్రాలు (ఫీచర్ ఫిల్మ్‌లు), 18 లఘు చిత్రాలుటీవీ సిరీస్‌లు: 9 టీవీ/లిమిటెడ్ సిరీస్ఏఆర్/వీఆర్ సంబంధిత అంశాలు అందులో ఉన్నాయిఎంపికైన 42 సినిమాలనూ ఈ విశిష్ట కార్యక్రమంలో పరిశ్రమ వర్గాల ఎదుట ప్రదర్శిస్తారు.

ఎంపికైన 18 షార్ట్ యానిమేషన్ సినిమాల దర్శకులువారి ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:

1) శ్రేయా సచ్‌దేవ్ వాణి

2) శ్రీకాంత్ ఎస్ మీనన్ ఒడియన్

3) ప్రశాంత్ కుమార్ నాగదాసి బెస్ట్ ఫ్రెండ్స్

4) శ్వేతా సుభాష్ మరాఠే మెల్టింగ్ షేమ్

5) అనికా రాజేష్ అచ్చప్పం

6) మార్తాండ్ ఆనంద్ ఉగల్ముగ్లే ఛందోమామ

7) కిరుతిక రామసుబ్రమణియన్ ఎ డ్రీమ్స్ డ్రీమ్

8) హరీష్ నారాయణ్ అయ్యర్ కరాబి

9) త్రిపర్ణ మైతి ది చెయిర్

10) అరుంధతి సర్కార్ సో క్లోజ్ యెట్ సోఫార్  

11) గడమ్ జగదీష్ ప్రసాద్ యాదవ్ సింఫనీ ఆఫ్ డార్క్‌నెస్

12) వెట్రివేల్ ది లాస్ట్ ట్రెజర్

13) గార్గి గావ్తే గోడ్వా

14) శ్రీయా వినాయక్ పోరే కాళి (Bud)

15) హర్షితా దాస్ లూనా

16) సాంద్రామేరీ మిస్సింగ్

17) రిచాభూతాని – క్లైమేట్‌స్కేప్

18) హిరాక్ జ్యోతి నాథ్ టేల్స్ ఫ్రమ్ టీ హౌజ్

యానిమేషన్ కథా చిత్రాలకు సంబంధించి 12 మంది ఫైనలిస్టులువారి ప్రాజెక్టులు:

1) కాథరినా డియాన్ విరాస్వతి ఎస్ ఫ్లై!

2) శుభమ్ తోమార్ మహ్జూన్

3) శ్రీకాంత్ భోగి రుద్ర

4) అనిర్బన్ మజుందార్ బాబర్ ఔర్ బన్నో - ఎ ఫ్రెండ్షిప్ సాగా

5) నందన్ బాలకృష్ణన్ - ది డ్రీమ్ బెలూన్

6) జాక్వెలిన్ సి చింగ్ లిక్కే అండ్ ది ట్రోల్స్

7) రోహిత్ సంఖ్లా - ద్వారక.. ది లాస్ట్ సిటీ ఆఫ్ శ్రీ కృష్ణ

8) భగత్ సింగ్ సైనీ రెడ్ ఉమన్

9) అభిజీత్ సక్సేనా ఎరైజ్ఎవేక్

10) వంశీ బండారు ఆయుర్వేద క్రానికల్స్ సెర్చ్ ఫర్ ది లాస్ట్ లైట్

11) పీయూష్ కుమార్ రాంగ్ ప్రోగ్రామింగ్.. ది అన్లీష్డ్ వార్స్ ఆఫ్ ఏఐ

12) ఖంబోర్ బతేయ్ ఖర్జానా లపలాంగ్ - ఎ ఖాసీ ఫోక్‌లోర్ రీఇమాజిన్డ్

ఎంపికైన మంది టీవీలిమిటెడ్ సిరీస్ దర్శకులువారి ప్రాజెక్టులు:

1) జ్యోతి కళ్యాణ్ సుర జాకీ జిలాల్

2) తుహిన్ చందా చుపి సైలెన్స్ బిహైండ్ లాస్

3) కిషోర్ కుమార్ కేదారి ఏజ్ ఆఫ్ ద డెక్కన్ది లెజెండ్ ఆఫ్ మాలిక్ అంబర్

4) భాగ్యశ్రీ సత్పతి పాశ

5) రిషవ్ మొహంతి ఖట్టి

6) సుకంకన్ రాయ్ సౌండ్ ఆఫ్ జాయ్

7) ఆత్రేయ పొద్దార్సంగీత పొద్దార్బిమల్ పొద్దార్ మోరే కాకా

8) ప్రసేన్‌జిత్ సింఘా ది క్వైట్ చావోస్

9) సెగున్ సామ్సన్ఓమోతుండే అకియోడ్ మాపు.

ఏఆర్/వీఆర్ ప్రాజెక్టుల దర్శకులువారి ప్రాజెక్టులు:

1) సుందర్ మహాలింగం అశ్వమేధ ది అన్‌సీల్డ్ ఫేట్ 

2) అనుజ్ కుమార్ చౌదరి లిమినలిజం

3) ఇషా చందన టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ అబ్యూస్ ఆన్ హ్యూమన్ బాడీ. 

తొలిసారిగా మొత్తం 42 ప్రాజెక్టులను ఒకే సృజనాత్మక కేటలాగ్లోకి తీసుకురావడం గొప్ప విషయమనిగొప్ప ప్రతిభను తాము ఆవిష్కరించామనడానికి ఇది నిదర్శనమని డ్యాన్సింగ్ ఆటమ్స్ స్టూడియోస్ వ్యవస్థాపకులుసీఈవో సరస్వతి బయ్యాల అన్నారు. సంబంధిత రంగంలో అనుభవజ్ఞులుప్రభావవంతమైన వ్యక్తులతో కూడిన వేవ్స్ సలహా మండలి ఈ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని మదింపు చేయడంలోనుప్రొడక్షన్ – డిస్ట్రిబ్యూషన్ దిశగా మార్గనిర్దేశం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా ఈ పరిశ్రమకు లభిస్తున్న ఆదాయం యానిమేషన్‌కు గల అపారమైన సమర్థతకు నిదర్శనమని కూడా ఆమె తెలిపారు2024లో అంతర్జాతీయంగా యానిమేషన్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ఫెస్టివల్స్ సహా వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా షార్ట్ ఫిల్మ్‌లు 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాయని అంచనామరోవైపు విద్యాసంబంధ కంటెంట్ 2032 నాటికి 70 బిలియన్ డాలర్లను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారుఅతిపెద్ద విభాగమైన కథా చిత్రాలు (ఫీచర్ ఫిల్మ్స్అనుబంధ మార్కెట్ల ద్వారా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 బిలియన్ డాలర్ల నుంచి 32.3 బిలియన్ డాలర్ల వరకు ఆర్జించాయిస్ట్రీమింగ్ సేవల ద్వారా యానిమేషన్ టీవీ సిరీస్‌లు విజృంభించాయిఉత్పత్తిలైసెన్సింగ్ ద్వారా దాదాపు 512 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఏఆర్వీఆర్ యానిమేషన్ సహా ఏఆర్వీఆర్వీక్షకులను తన్మయులను చేయగల వినోద రంగానికి సంబంధించి మార్కెట్ విశేషంగా అభివృద్ధి చెందుతోందిఇది 22.12 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనాగణనీయంగా 79.36 బిలియన్ డాలర్ల వరకు వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. గేమింగ్హెల్త్‌కేర్రిటైల్విద్యతయారీ సహా పలు రంగాలను ఏఆర్/వీఆర్ సాంకేతికతలు సమూలంగా మారుస్తున్నాయిఅద్భుతమైన అనుభవాలువిశేషమైన పెట్టుబడులు దీనిని ముందుకు తీసుకెళ్తునన్నాయిఇందులో ఉత్తర అమెరికాకు గణనీయమైన వాటా ఉండగా.. ఆసియా పసిఫిక్ ప్రాంతం అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.

వేవ్స్- 2025 యానిమేషన్ సినీ దర్శకుల పోటీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి:

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2122837

యానిమేషన్ సినీ దర్శకుల పోటీలోని 42 మంది ఫైనలిస్టులపై కేటలాగ్ను వీక్షించడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమమైన తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

మీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియా, వినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.

భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోందికంటెంట్ సృజన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నదిసమాచార ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక కృత్రిమ మేధ, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్వంటి పరిశ్రమలు, రంగాలపై దృష్టి సారించారు.

ఏవైనా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ చూడండి.

పీఐబీ వేవ్స్ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.

రండి, మాతో కలసి ప్రయాణించండి! ఇప్పుడే వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి.  

 

***


Release ID: (Release ID: 2125000)   |   Visitor Counter: 7