సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
తొలి ‘టాప్ సెలెక్ట్స్’ జాబితాను వెల్లడించిన వేవ్స్ బజార్.. 9 భాషల్లో 15 ప్రాజెక్టులు
Posted On:
25 APR 2025 4:10PM by PIB Hyderabad
సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం నేపథ్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృజించడం ద్వారా మీడియా, వినోద రంగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)- మీడియా, వినోద రంగంలో కీలక ఘట్టంగా నిలవబోతోంది. విస్తృతశ్రేణి కంటెంట్ సృజనకు, పెట్టుబడులకు గమ్యస్థానంగా, ‘క్రియేట్ ఇన్ ఇండియా’ అవకాశాలనూ అంతర్జాతీయ వ్యాప్తినీ పెంపొందించడానికి కీలక వేదికగా ఈ సదస్సు భారత్‌ను నిలపబోతోంది.
మీడియా, వినోద పరిశ్రమలో వేవ్స్ బజార్ ప్రధాన అంతర్జాతీయ మార్కెట్ వేదిక. అనుసంధానాన్నీ సహకారాన్నీ అభివృద్ధినీ పెంపొందించడానికి రూపొందించిన క్రియాశీల వేదిక ఇది. బయర్లు, సెల్లర్లు, విస్తృత శ్రేణి ప్రాజెక్టులు, నిపుణులతో భాగస్వామ్యాన్ని నిర్మించుకునే అవకాశాన్ని దర్శకులు, సినీ నిపుణులకు కల్పిస్తుంది. అలాగే వారి నైపుణ్యాలను చాటుకోవడానికి, వారి వృత్తిపరమైన నెట్వర్కును విస్తరించుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది.
వీక్షణ గది (వ్యూ రూమ్) అనేది మే 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న వేవ్స్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన ఓ వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే పూర్తయిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్టుల ప్రదర్శనకు దీనిని ఉపయోగిస్తారు. ఇవి చలనచిత్రోత్సవాలు, అంతర్జాతీయంగా విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యాలు, తుది నిర్మాణ నిధుల కోసం అవకాశాలను వెతుకుతున్న సినిమాలు.
సినిమా ప్రోగ్రామర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రపంచవ్యాప్త సేల్స్ ఏజెంట్లు, ఇన్వెస్టర్లు, ఈ రంగంలోని ఇతర నిపుణుల కోసం రూపొందించిన ఈ వ్యూయింగ్ రూమ్.. ప్రత్యేక వ్యూయింగ్ రూమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా వేవ్స్ బజార్‌ను సందర్శించే ప్రతినిధులు ఈ సినిమాలను చూడడానికి, ప్రాజెక్టు సమాచారాన్ని వివరంగా తెలుసుకోవడానికి, దర్శకులను నేరుగా కలవడానికి సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది.
తొలి వేవ్స్ బజార్‌లో భారత్, శ్రీలంక, అమెరికా, స్విట్జర్లాండ్, బల్గేరియా, జర్మనీ, మారిషస్, యూఏఈ దేశాలకు చెందిన మొత్తం 100 చిత్రాలను వ్యూయింగ్ లైబ్రరీలో వీక్షించవచ్చు. ఈ మొత్తం జాబితా (లైనప్)లో ఎన్ఎఫ్‌డీసీ నిర్మించిన, సహనిర్మాణ బాధ్యతలు వహించిన 18 సినిమాలుండగా.. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ) పునరుద్ధరించిన 8 అపురూప చిత్రాలనూ ఇందులో జోడించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ, పూణే), సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్‌టీఐ, కలకత్తా) విద్యార్థుల 19 ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయి.
వ్యూయింగ్ రూమ్ నుంచి వేవ్స్ బజార్ టాప్ సెలెక్ట్స్ విభాగానికి ఎంపికైన ఈ 15 ప్రాజెక్టుల్లో- 9 ఫీచర్ ప్రాజెక్టులు, 2 డాక్యుమెంటరీలు, 2 షార్ట్ ఫిల్మ్‌లు, 2 వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మే 2న ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగే వేవ్స్ బజార్‌లో నిర్వహించే ఓపెన్ పిచింగ్ సెషన్‌లో తమ చిత్రాలను నిర్మాతలు, సేల్స్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, చలనచిత్రోత్సవ ప్రోగ్రామర్లు, పెట్టుబడిదారుల ఎదుట ప్రదర్శిస్తారు.
వేవ్స్ బజార్ టాప్ ఎంపికలు 2025
1. ది వేజ్ కలెక్టర్ | తమిళం | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు – ఇన్‌ఫాంట్ సూసై | నిర్మాత – భగవతీ పెరుమాళ్
2. పుతుల్ | హిందీ | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు - రాధేశ్యామ్ పిపాల్వా | నిర్మాత - శరద్ మిట్టల్
3. దూస్రా బ్యాహ్ (లెవిర్) | హర్యానీ, హిందీ | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు - భగత్ సింగ్ సైనీ | నిర్మాత - పర్వీన్ సైనీ
4. పంఖుడియాన్ (గాలిలో పూల రేకులు) | హిందీ | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు – అబ్దుల్ అజీజ్ | నిర్మాత – అబ్దుల్ అజీజ్, జ్యోత్స్న రాజ్‌పురోహిత్
5. ఖిడ్కి గావ్ (శీతాకాలపు రాత్రివేళలో) | మలయాలం | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు - సంజు సురేంద్రన్ | నిర్మాత - డాక్టర్ సురేంద్రన్ ఎం ఎన్
6. సుచన – ది బిగినింగ్ | బంగ్లా | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు - పౌసలి సేన్‌గుప్త | నిర్మాత - అవినంద సేన్‌గుప్త
7. స్వాహా ఇన్ ది నేమ్ ఆఫ్ ఫైర్ | మగాహి | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు - అభిలాష్ శర్మ | నిర్మాత - వికాస్ శర్మ
8. గోటిపువా - బియాండ్ బోర్డర్స్ | ఇంగ్లీష్, హిందీ, ఒడియా | ఇండియా | డాక్యుమెంటరీ ఫీచర్
దర్శకుడు & నిర్మాత - చింతన్ పరేఖ్
9. ఫ్రం ఇండియా | ఇంగ్లిష్ | యూఎస్ఏ | డాక్యుమెంటరీ షార్ట్
దర్శకుడు & నిర్మాత - మందర్ ఆప్టే
10. థర్డ్ ఫ్లోర్ | హిందీ | ఇండియా | షార్ట్ ఫిల్మ్
దర్శకుడు – అమన్ దీప్ సింగ్ | నిర్మాత – అమన్ దీప్ సింగ్
11. జహాన్ | హిందీ | ఇండియా | ఫిక్షన్ షార్ట్
దర్శకుడు & నిర్మాత - రాహుల్ శెట్టి
12. ప్లానెట్ ఇండియా | ఇంగ్లిష్, హిందీ | ఇండియా | టీవీ షో
దర్శకుడు - కోలిన్ బట్ఫీల్డ్ | నిర్మాత - తమ్సీల్ హుస్సేన్
13. భారతి ఔర్ బిబో | హిందీ | ఇండియా | యానిమేషన్ వెబ్ సిరీస్/టీవీ
దర్శకులు - స్నేహ రవిశంకర్ | నిర్మాత - నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ & పప్పెటికా మీడియా ప్రైవేట్ లిమిటెడ్
14. అచ్చప్పాస్ ఆల్బమ్ (గ్రాంపాస్ ఆల్బమ్) | మలయాలం | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకులు - దీప్తి పిళ్ళై శివన్ | నిర్మాత - నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
15. దునియా నా మానే (ది అన్‌ఎక్స్‌పెక్టెడ్) | హిందీ | ఇండియా | ఫిక్షన్ ఫీచర్
దర్శకుడు & నిర్మాత – వి. శాంతారామ్
మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమమైన తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియా, వినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.
భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోంది. కంటెంట్ సృజన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నది. సమాచార ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక కృత్రిమ మేధ, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై దృష్టి సారించారు.
ఏవైనా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ చూడండి.
పీఐబీ వేవ్స్ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.
రండి, మాతో కలసి ప్రయాణించండి! ఇప్పుడే వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి.
***
(Release ID: 2124434)
|