హోం మంత్రిత్వ శాఖ
ఈ నెల 26న... పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్, ది హోలీ సీ సుప్రీం పాంటిఫ్ అంతిమ సంస్కారాలు... ఆ రోజు అధికారిక సంతాప దినంగా ప్రకటన
Posted On:
24 APR 2025 4:50PM by PIB Hyderabad
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్, ది హోలీ సీ సుప్రీం పాంటిఫ్ అంతిమ సంస్కారాలను ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఆ రోజును అధికారిక సంతాప దినంగా పాటిస్తూ, జాతీయ జండాను అవనతం చేస్తారు. వినోద కార్యక్రమాలను రద్దు చేశారు.
పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్, ది హోలీ సీ సుప్రీం పాంటిఫ్ అస్తమయానికి గౌరవ సూచకంగా మూడు రోజులపాటు సంతాప దినాలుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీలతోపాటు, అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్న రోజును కూడా అధికారిక సంతాప దినంగా పాటిస్తారు.
(Release ID: 2124123)
Visitor Counter : 7